Monday 29 October 2018

స్వస్తిక్ చిహ్నం విశిష్టత*

*జై శ్రీమన్నారాయణ-జై శ్రీ హనుమాన్*

*స్వస్తిక్ చిహ్నం విశిష్టత*

స్వస్తికం మన ప్రాచీన ధర్మానికి ప్రతీక.
ఇది సమగ్ర మంగళప్రద భావనకు సూచన.

సు+అసు ధాతువు నుంచి *స్వస్తిక* వచ్చింది.
మంచి అస్తిత్వం, శక్తి అని అర్థం.

ఏ శుభకార్యాన్నైనా ఈ స్వస్తిక్ మంత్రంతోనే ప్రారంభిస్తాము.

శ్లో" స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తిన పూషా విశ్వవేదాః,
స్వస్తినస్తార్ష్యో అరిష్టనేమిః
స్వస్తినో బృహస్పతిర్దధా.

తా" గొప్ప కీర్తి కలిగిన ఇంద్రుడు మాకు శుభములిచ్చుగాక.
విశ్వజ్ఞాన స్వరూపుడైన పూష (సూర్యుడు) మాకు శుభము లిచ్చుగాక.
అమోఘములైన ఆయుధములు కలిగిన గరుడుడు మాకు శుభము లిచ్చుగాక.
బృహస్పతి మమ్ము రక్షించుగాక.

అనేక సందర్భాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని పసుపు కుంకుమతో తయారు చేసి ప్రవేశ ద్వారాల వద్ద అలంకరిస్తారు.

అక్షరాలలో ఓంకారమెంత పవిత్రమో, వేదసారమో అలానే స్వస్తిక్ చిహ్నం కూడా అవుతుందని శ్రీరాముడు వరమిచ్చినట్లు పురాణాల్లో ఉంది.

ఇంకా స్వస్తికుడనే రాజు రావణ గర్వభంగం చేసి లంకలో స్వస్తికాకృతిలో భవనాలు నిర్మించుకునేటట్లు చేశాడని ఐతిహ్యం ఉంది.

*స్వస్తిర్భవతు*

Sunday 28 October 2018

దీర్ఘాయుష్మాన్ భవ

దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య


దీర్ఘాయుష్మాన్ భవ" అంటే?

చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శననానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు కూర్చున్నారు.

మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు. “భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారినినారాయణ నారాయణఅని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులను ఏమని అశీర్వదిస్తారు?”

మేముదీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని అశీర్వదిస్తాము. అదే సాంప్రదాయము.కదా!
అని అన్నారు.

అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.

చాలాకాలం సౌఖ్యంగా ఉండుఅని దీని అర్థం.

మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్నవేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు.

మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పుఅన్నారు.

పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.

సంస్కృత వాక్యందీర్ఘాయుష్మాన్ భవఅనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కాని మహాస్వామి వారు అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.

వారి పరిస్థితి చూసి మహాస్వామి వారునేను చెప్పనా దాని అర్థంఅని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.

పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్, 11 కరణములలో ఒకటి భవ, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటేఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారముకలిసి వస్తే అది శ్లాగ్యముఅంటే చాలా శుభ ప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాకఅని అర్థం.

మాటలు విన్న వెంటనే పండితులు ఆశ్చర్యపోయి, ఆనందాశ్రువులతో అందరూ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసారు.

జ్యోతిష సంబంధ కథలు

జ్యోతిష సంబంధ కథలు
వరాహ మిహిరుడు.
          పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్కుని ఆస్థానములో వరాహ మిహిరుడు గొప్ప  విద్వాంసుడు.విక్రమాదిత్యుని ఆస్థానములో తొమ్మండుగురు విద్వాంసులు ఉండే వారు.. వారినే నవరత్నములు అని కూడ పిలిచే వారు.ప్రముఖ కవి కాళిదాసు కూడ అందులో ఒకరు.వరాహ మిహిరుడి అసలు పేరు మిహిరుడు.అయితే ఆయనకు వరాహ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలిపే కథ ఒకటి ఉంది.
    విక్రమార్క మహారాజు కు ఒక కొడుకు పుట్టిన తరుణం లో రాజు ఆస్థాన జ్యోతిష్కులందరిని పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుని జన్మ పత్రిక లిఖించి ఆయుర్దాయం గణింప  వలసినదని కోరెను.ఆస్థాన జ్యోతిష్కులందరు జాతకమును సిద్దపరచిరి.గ్రహ స్థానముల బలాబలములను పరిశీలించి కుమారునకు 18 వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహింపగల్గిరి,కాని దాని స్వభావ మెట్టిదో మరణకారకమగునా కాదా నిశ్చయింప జాలక పోయిరి.కాని గండము గడచి బయట పడ వచ్చునని తెలిపిరి.దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18 వ ఏట పలాన మాసమున పలానా దినమున సూర్యోదయానంతరము 27 ఘడియలకు వన వరాహముచే ప్రాణములు కోల్పోవునని జంకు గొంకు లేకుండ నిర్మొహమాటముగా నిర్భయుడై రూఢిగా చెప్పెను.ఆ రాజు జ్యోతిష శాస్త్రము నందు అధిక విశ్వాసము గలవాడైనందున మరియు జ్యోతిష విద్వాంసుల పై గౌరవముతో మిహిరుడు చెప్పిన మాటలపై కినుక వహించక ,తగు ప్రయత్నము చేయుట వలనను,భగవదనుగ్రహం వలనను ఆ అనర్థ తీవ్రతను తగ్గింప వచ్చునేమో నని తలచి మంత్రులతోను,శ్రేయోభిలాశులతో అలోచించి కుమారుని రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకొనెను.
  తన భవనమునకు మైలు దూరములో 7 అంతస్తుల భవనము నొకటి నిర్మింపజేసి దాని చుట్టును 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి, క్రిమి కీటకములు గూడ లొన ప్రవేశించుటకు వీలు లేనంత కట్టడి చేసి రాకుమారునకు కావల్సిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను.విద్యాభ్యాసమునకు కూడ ఆ భవనములోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్కులు పేర్కొన్న గడువు ఇంకను 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి బయటి ప్రాణి ఓక్కటి కూడా లోపలికి పోకుండ హెచ్చరికలతో భటులకు ఆఙ్ఞాపించెను.కుమారుని దేహ ఆరోగ్యస్థితి తెలిసికొనుటకై వేగులని ఏర్పాటు చేసెను. నాటి మధ్యాహ్నము 3 జాముల వరకు   వేగులు తడవ తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమను గూర్చి తెలుపుచుండిరి.రాజు గారు నిండు సభలో జాతక పలితములను గూర్చి దైవఙ్ఞులతో చర్చలు జరుపుచుండెను.కొందరు దైవఙ్ఞులు మిహిరాచార్యుని జాతక గణన లో ఏదో తప్పు చేసియుండునని తమలో తాము బాధ పడుచుండిరి.సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజు గారికి తెలిపిరి.వారి వారి భిన్నాభిప్రాయములు విని రాజు గారు, దైవ వశమున తన కుమారుని గండము తప్పినను ,ఆచార్యులయెడ తనకు గల భక్తి గౌరవములు సడలవని,శాస్త్రముపై గురుత్వమేమాత్రము నశింపదనియు,మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయాది నుండి 26 వ ఘడియ గడిచెను.అప్పుడు ఒక వేగు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను.
  తదుపరి అందరు రాకుమారుని చూడ డానికి బయలు దేరిరి.దారిలో 28 వ ఘడియ సమయములో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను.అందరు ఆచార్యుని వంక చూసిరి.అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా నుండెను.అందరు మేడలోకి ప్రవేశించి ప్రతి అంతస్తును  పరికించుచూ అచ్చట ఉన్న వారు కుమారుని క్షేమ సమాచారము చెప్పుచుండగా పైకి వెళ్ళిరి.మధ్యలో కొందరు రాకుమారుడు ఏదో బద్ధకముగా నుండుటచే అరఘడియ ముందు మంచి గాలికై డాబా మీదికి వెళ్ళినాడని తెలిపిరి.గుండెలు దడ దడ కొట్టుకొనుచుండగా అందరును ఏడవ అంతస్తు డాబా పైకి వెళ్ళీ చూడగా అచట ఒక ధ్వజ స్తంభము క్రింద మంచం పై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై బడి నెత్తురు గారుచున్న కుమారుని చూచిరి. రాజు పుత్ర శోకములో మునిగి ఉండికూడా,మిహిరుని విఙ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను.తాను ఎన్ని ఉపాయములు అవలంబించినకూడ శాస్త్ర పలితముమే సంభవించెను.ఆకాలములో వారి కులదైవం వరాహమూర్తి అగు విష్ణువును ఇళ్ళు నిర్మిస్తున్నప్పుడు శిల్పి స్తంభముపై నిలిపెను.దైవ వశమున అది రాకుమారుని మరణమునకు కారణమయ్యెను.
శాస్త్ర విధి తప్పదనుటకు ఇది తార్కాణమని పల్కుచూ రాజు అచార్యుని ఆలింగనము చేసుకొని అదిమొదలు  అతడు “వరాహ మిహిరాచార్యుడు”అని పిలువబడునని “వరాహ” బిరుదు నొసగి శ్లాఘించెను.
       ఈ కథ ఎంత వరకు సత్యము అనునది చారిత్రకాన్వేషకుల బాధ్యత,కాని ఆకాలములో  జ్యోతిష శాస్త్రము యొక్క ఔన్నత్యమును,వికాసమును చాటుతుంది.తరువాతి తరములలో దానికి తగు శ్రద్ధ,శిక్షణ,గ్రంథ లభ్యత ,ఆసక్తి లేనందున జ్యోతిషమ్ వెనుక బడినది.
       వరాహ మిహిరాచార్యుని రచనలు.బృహత సంహిత.(హోరా గ్రంథము),పంచ సిద్ధాంతిక,లఘు జాతకము,వివాహ పటలము,యాత్రా గ్రంథము,సమాస సంహిత,జాతకార్ణవము,ఢికినిక యాత్ర,గ్రహణ మండల ఫలమ్,పంచ పక్షి,మొదల్గునవి.

2.లీలావతి గణితం నకు సంబంధించిన చిన్న కథ.
    మనం చిన్నప్పుడు లీలావతి గణితం అనే పదం మన తరగతి పుస్తకాలలో చదివి ఉంటాము.అయితే లీలా వతి వ్రాయలేదు ఆ గణితాన్ని.
లీలావతి అనే ఆమే భాస్కరాచార్యుడి కుమార్తె.భాస్కరాచార్యుడు “సిద్ధాంత శిరోమణి” అనే సిధ్ధాంత గ్రంథాన్ని, “కరణ కుతూహలం అనే కరణ గ్రంథాన్ని వ్రాసినాడు.    సిధ్ధాంత శిరోమణి అనేది చాలా పెద్దది.నాలుగు భాగాలు అవి.1.పాటీ గణితంలేదా లీలావతి గణితం 2.బీజ గణితం 3.గ్రహ గణితము 4.గోళాధ్యాయం
లీలావతి గ్రంథం లో అంక గణితము,క్షేత్ర గణితము గురించి తెలిపినాడు.తన కుమార్తె లీలావతి శ్రేయస్సుకై భాస్కరుడు ఈ గ్రంథాన్ని వ్రాసాడని ఒక గాథ కలదు.
      ఆమె జాతకం ప్రకారం అవివాహితగా ఉండి పోవాలి.భాస్కరుడు మాత్రం ఆమెకు పెళ్ళి జర్పించాలని తన జ్యోతిష విఙ్ఞానమ్  అంతా వినియోగించి మంచి ముహూర్తానికై ఆలోచించసాగాడు.ఆమె వివాహాన్ని గట్టి శుభ ఘడియలో జరిపించాలనుకొని ముహూర్త శుభ ఘడియలను నిశ్చయించుకొని ఆ కాలాన్ని సూచించే నీటి గడియారాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు.కాని అతని సత్సంకల్పాన్ని విధి బాల వధువు రూపంలో భగ్నం చేసింది.బాల్యోత్సాహం తో కేరింతలు కొడుతూ ఆ నీటి గడియారం దగ్గరకు వెళ్ళి తొంగి చూసింది.ఆ హడావుడిలో ఆమె నగలనుండి ఒక చిన్న ముత్యం జారిపడి నీటి గడియారంలో పడి,నీరు ప్రవహించే రంధ్రానికి అడ్డుపడింది.ఆ  శుభ ఘడియ దాటిపోయింది.ఆ పిల్ల అవివాహితగానే మిగిలిపోవలసి వచ్చింది. ఆమెకు ఊరట కల్పించే సంకల్పం తో ఆమె పేరు చిరస్మరణీయం కావాలనే తలంపుతో భాస్కరుడు తాను వ్రాసిన అంక గణిత,క్షేత్ర గణిత గ్రంథానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు.
లీలావతి గణితం లో మొదటి అధ్యాయం అంక గణితం .ఇందులో 278 శ్లోకాలు ఉన్నవి.దీనిలో సంఖ్యలు దశాంశ పద్దతిలో పరార్ధం వరకు అంటే 10^17(ten to the power of 17) వరకు చెప్పబడ్డాయి.
  మామూలు కూడికలు,తీసివేతలు ,గుణకార,భాగాహారాలతో పాటు,వర్గం(sqare),వర్గమూలము(sqare root),ఘనము(cube) ,ఘనమూలము(cube root),త్రైరాశికమ్(rule of three),పంచ రాశికము(rule of five),సప్త రాశికమ్(rule of seven),నవరాశికం(rule of nine),శ్రేణి(series),చితి(piles),రాశి(heap),చాయ(shadow),కుట్టకము(pulveriser),అంక పాశము,ప్రస్తారాలు,సంయోగాలు(permutations-combinations) గురించి శ్లోక రూపం లో వివరించ బడ్దాయి.
  అంక పాశమునకు ఒక చక్కటిఉదాహరణ.263 వ శ్లోకం
 శ్లో॥పాశాంకుశాహి డమరూక కపాల శూలైః।
        ఖట్వాంగ శక్తి శర చాపయుతైర్భవంతి॥
        అన్యోన్య హస్త కలితైః కతి మూర్తి భేదాః
       శంభోర్హరే రివ గదాది సరోజ శంఖైః॥
   అనగా మహేశ్వరుని పది చేతులలో  పది ఆయుధాలు ఉన్నవి అవి .1.పాశము .2.అంకుశం 3.సర్పం 4.డమరు 5.కపాలమ్ 6.శూలమ్ 7.మంచంకోడు.
     8.శక్తి  9 బాణము 10.ధనుస్సు. ఈ పది ఆయుధాలను పది పది చేతులలో మార్చి ,మార్చి ఉంచగా మహేశ్వరుని రూపాలు ఎన్ని అవుతాయి?
     అలాగే విష్ణువు నాలుగు చెతులలో గల గద,శంఖం,చక్రం,పద్మం అనే నాలుగింటిని మార్చి మార్చి ఉంచగా శ్రీ మహా విష్ణువు రూపాలు ఎన్ని అవుతాయి ?
పై రెండు ప్రశ్నలకు సమాధానాలు తార్కింకంగా ఆలోచించి చెప్పండి.లేదా వివరణాత్మకంగా చెప్పండి

1.      మహేశ్వరుని రూపాలు 36,28,800
2.      విష్ణువు రూపాలు…………24.
ఎలాగో చూద్దాం.
     ఉదాహరణకు …………ఒక అంకె తో ఎన్ని సంఖ్యలు ఏర్పడుతాయి?
                                  ఒకటి మాత్రమె
     రెండు అంకెలతో ఎన్ని సంఖ్యలు ఏర్పడుతాయి.?
             రెండు అంకెలు……5,6 అనుకుందాము.
               అప్పుడు 56, 65 రెండు అంకెలు ఏర్పడ్డాయి
            3 అంకెలతో ఎన్ని ఏర్పడుతాయి?
          5,6,7, అనుకుందాము
                      567, 576
                      657,675
                     756,765     మొత్తము 6 సంఖ్యలు ఏర్పడుతాయి
        4 అంకెలతో ఎన్ని?
       అంకెలు  5,6,7,8, అనుకుందాము,
        5తో మొదలగునవి   6 సంఖ్యలు… ………………..5678,5687;,5768,5786;,5876,5867,
        6 తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు….       6578, 6587; ,6758,6785;,6857,6875,
       7  తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు    …….7568,7586; 7856,7865; 7658,7685;
        8  తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు………8567,8576; 8657,8675; 8756,8765
మొత్తమ్ 6+6+6+6=24  ఇలా విష్ణువు రూపాలు 24.
    Mathemetics ప్రకారం   ఒక అంకె తో =1x1=1
                                      రెండు అంకెలతో=2X1=2
                         మూడు అంకెలతో   3x2x1=    6
                     నాలుగు అంకెలతో 4x3x2x1=24
ఈ సూత్రం(F0rmula) తోనే  శంకరుని రూపాలు= పది చేతులలో పది ఆయుధాలు మార్చి మార్చి ఉంచగా   శంకరుని రూపాలు
      10x9x8x7x6x5x4x3x2x1=36,28,800


జ్యోతిశం తెలుగు

ద్వాదశ లగ్నాలు- ఆధిపత్య శుభా శుభ గ్రహాలు.
గ్రహాలను  శుభ ,అశుభ  గ్రహాలు  అని రెండు రకాలుగా విభజించవచ్చు.
అయితే ఇందులో మళ్ళీ రెండు విధాలుగా విభజన చేయడమైనది.
1.నైసర్గిక శుభ గ్రహాలు-నైసర్గిక అశుభ (పాప) గ్రహాలు.
2 ఆధిపత్య శుభ గ్రహాలు-ఆధిపత్య పాప గ్రహాలు.
 నైసర్గిక శుభ పాప గ్రహాలు- జ్యోతిషం లో ఒక గ్రహం
శుభ పలితం ఎప్పుడు ఇస్తుంది,అశుభ పలితం ఎప్పుడు ఇస్తుంది,
 తెలుసుకోవాలంటే పై రెండు అంశాలను పరిశీలించాలి
గురు,,శుక్రులు  ఇవి రెండు పూర్తి  నైసర్గిక శుభ గ్రహాలు.
బుధుడు స్వయంగా శుభ పలితాన్నివ్వడు,పాప పలితాన్నివ్వడు.తటస్తుడు.
కాని  శుభ గ్రహాలతో కూడి ఉన్నప్పుడు శుభుడు.
పూర్ణ చంద్రుడు శుభుడు,(శుక్ల అష్టమి నుండి కృష్ట అష్టమి వరకు)
ఇక పాప గ్రహాలలో కుజ, శని, రాహు, కేతు పాప గ్రహములు.
వీరితో కలిసి యున్న బుధుడు కూడ పాప గ్రహమే.
క్షీణ చంద్రుడు (కృష్ట అష్టమి నుండి శుక్ల అష్టమి వరకు) పాప గ్రహం
రవి కౄర గ్రహమ్ అగుట వలన పాప గ్రహంగా పరిగణించ నైనది.
శుభత్వ పాపత్వములు సహజ లక్షణములు.
అయితే  గ్రహలు లగ్న కుండలి లో ఒక్కొక్క భావానికి ఆధిపత్యం వహించడం వలన  ఆధిపత్య స్థానముల  వలన శుభ పాపత్వములు ఏర్పడును.
అందుచే లగ్న కుండలిలో ఒక్కొక్కప్పుడు నైసర్గిక శుభ గ్రహాలైన  గురు,శుక్రులు కూడ పాప పలితాన్నిస్తారు. నైసర్గిక పాపులైన కుజ శనులు కూడ ఒక్కొక్కప్పుడు వారి వారి ఆధిపత్యంచే,వారున్న స్థానాన్ని బట్టి శుభ పలితాన్నిస్తారు.
కాబట్టి లగ్నకుండలి లో ఒక్కొక్క లగ్నానికి (మేషం నుండి మీనం వరకు)
శుభ అశుభ గ్రహాలేవో తెలుసుకుందాం.ఇప్పుడు రాశులు-అధిపతులు మళ్ళీ ఒకసారి చూద్దాం.
గ్రహాలు- ఆధిపత్య శుభా శుభ సూత్రాలు.లగ్నాలకు ఆధిపత్యాల రీత్యా శుభాశుభ గ్రహాలను,
 యోగ కారక గ్రహాలను నిర్ణయించడానికి కొన్ని ప్రత్యేకమైన సూత్రాలున్నాయి.
వాటి ననుసరించి ఒక్కో లగ్నానికి శుభాశుభ గ్రహ పలితాలను నిర్ణయించవచ్చు.
లగ్నాన్నించి లెక్కిస్తే 1,4,7,10 స్థానాలను కేంద్రములని,1,5,9 స్థానాలను
 కోణ స్థానాలని పేర్కొంటాంము.
  ఒకటవ స్థానం అనగా  అనగా లగ్నం.ఇది కేంద్రము మరియు కోణ స్థానము.
  (1)లగ్నానికి 5,9 స్థానిధిపతులు ఎవ్వరైనా శుభులే
నైసర్గిక పాపులైన శని కుజులు కూడా లగ్న జాతకులకు శుభ పలితాన్నిస్తారు.
ఉదాహరణకు తులా లగ్నానికి 5 స్థానం అయిన కుంభ రాశి
అధిపతి శని శుభ పలితాన్నిస్తాడు.అలాగే ధనుర్లగ్నానికి
 5 స్థానం అయిన  మేష  రాశి అధిపతి కుజుడు
 శుభ పలితాన్నిస్తాడు.
(2).నైసర్గిక శుభ గ్రహాలు, లగ్నానికి కేంద్రాదిపతులైతే
 (అనగా 4,7,10 స్థానలకు అధిపతులైతే) శుభ పలితాన్నివ్వవు.
అలాగే నైసర్గిక పాప గ్రహాలు(ఉదా.కుజ శని) కేంద్రాదిపతులైతే
 (అనగా 4,7,10 స్థానలకు  అధిపతులైతే పాప పలితాన్నివ్వడు.
 3. గ్రహమైనా కోణాధిపతి అయితే శుభ పలితాన్నిస్తాడు.
4. గ్రహమైనా 3,6,11,8,12  స్థానాలకు అధిపతి
 అయితే అశుభ పలితాన్నిస్తారు.
5.కాని అష్టమాధిపతి ఒకవేళ లగ్నాధిపతి కూడ అయి వున్నట్లైతే అతడు శుభ పలితాన్నిస్తాడు.
ఇది మేష తులా రాశులకు వర్తిస్తుంది.ఉదాహరణకు
 మేష రాశికి లగ్నాధిపతి కుజుడు అలాగే 8 స్థానాధిపతి అయిన వృశ్చిక రాశ్యాధిపతి కూడ కుజుడే.అందువలన కుజుడు మేష లగ్నానికి శుభాన్ని కలిగిస్తాడు.
(6).  2-12 స్థానాధిపతులు అనగా లగ్నానికి ముందు వెనక ఉన్న రాశ్యాధిపతులు లగ్నాధిపతి తో సాహచర్యం వల్ల  శుభాశుభ పలితాన్నిస్తారు.
7.గ్రహాలలో రవి చంద్రులు తప్ప మిగతా గ్రహాలకు రెండేసి ఆధిపత్యాలున్నాయి.
 కుజ---మేషం,వృశ్చికం,      శనిమకర కుంభాలు
గురు---ధనుర్మీనాలు,        శుక్రుడువృషభం,తులా
  బుధుడు-మిధునం-కన్యలు 
    ఈ గ్రహాల కుండే రెండు ఆధిపత్యాలలో ఒకటి బాగా ఉండి రెండవ ఆధిపత్యం దోష ప్రదమైనప్పుడు గ్రహం ఇచ్చే పూర్తి పలితం ఆ లగ్నాధిపతి తో గల శత్రు మిత్రత్వాలపై ,మరియు గ్రహం ఉన్న స్తానాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది
8.కేంద్రాలలో (1,4,7,10) శుభ గ్రహాలు ఉండడం మంచిది.
కోణాలలో (5,9) ఉండే శుభ గ్రహాలు ఎల్లప్పుడు శుభాన్నిస్తాయి.
కోణాలలో (5,9) ఉండే పాప గ్రహాలు భావానికి ఆధిపత్యం కలిగి
 ఉన్నాయో భావాన్ని సంపూర్ణంగా వృ ద్ధి చేసి
కోణ భావ పలితాన్ని పాడు చేస్తాయి
కేంద్రాలలో  ఉండే పాప గ్రహాలు  భావానికి ఆధిపత్యం
 కలిగి ఉన్నాయో భావాన్ని  వృ ద్ధి చేసి
కేంద్ర  భావ పలితాన్ని పాడు చేస్తాయి.
అందుకే పాప గ్రహాలకు కేంద్రాధిపత్యం మంచిది.
కాని కేంద్ర స్థితి  (కెంద్రాలలో ఉండడం) మంచిది కాదు.
సూత్రాల రీత్యా మేషాది ద్వాదశ లగ్నాలకు యోగ కారక గ్రహాలను,
 మారకులను బాధకులను నిర్ణయించే అవకాశం ఉంది.

మేష లగ్నం:--మేష లగ్నానికి అధిపతి కుకుజుడు.
లగ్నం ,దీనినే ప్రథమ భావం లేదా తను భావమ్ అని
కూడా పిలుస్తాము.తనువు అనగా శరీరం తను భావము
 నుండి మనస్సు ఆత్మ విశ్వాసము రూపమ్ ఙ్ఞానం,వర్ణం బలం
 దౌర్బల్యం సుఖ దుఃఖాలు పట్టుదల ఆశయాలు అభిరుచులు
 దృక్పతాలు తదితర అంశాలు లగ్న భావం నుండి పరిశీలించాలి.
అయితే మేష లగ్న జాతకులందరికి కుజుడే అధిపతి అయినా
 కూడ అందరి శరీరాలు రూపమ్ మొదలగు పైన చెప్పబడిన
అంశాలు ఒకే రకంగా ఉండవు.కుజుడు సమయమం
 లో మేషాది ద్వాదశ రాశులలో ఎక్కడైన ఉండ వచ్చు.
ఆయా స్థానాలు కేంద్రాలు, కోణాలు,ఉపచయ స్తానాలు,
షష్టాష్టమ వ్యయ స్థానాలా,లేదా కుజుని యొక్క ఉచ్చ, నీచ,
 మూల త్రికోణ స్థానాలలా లేదా కుజుడు శత్రు,మిత్రు క్షేత్రాలలో
ఉన్నాడా అనే దాన్ని బట్టి పలితం మారుతుంది. ఒక రాశిలో కూడ
 ఎన్నవ డిగ్రీలో ఉన్నాడు అని కూడా చూడాలి.లగ్న కుండలి లో
 ఒక్కొక్క రాశి 0-30 డిగ్రీలు. గ్రహాలు రాశి మధ్యలో ఉంటే (12-18 డిగ్రీలు)
 పూర్తి పలితాన్ని ఇస్తాయి. లగ్నంపై, కుజునిపై ఇతర గ్రహాల దృష్టి
వలన కూడ పలితం మారుతుంది.అలాగే లగ్నం లో ఉన్న గ్రహం బట్టి
 కూడ పలితం మారుతుంది.లగ్నం లో ఇన్నగ్రహం కుజుని మిత్రుడా,శత్రువా
 అతనిపై ఇతర గ్రహాల యతి లేదా యుతి ఉన్నదా పరిశీలించాలి
అలగే మేష లగ్నానికి అష్తమాధిపతి కూడా కుజుడే.అష్టమం ఆయుస్థానం
 మరియు మృత్యు స్థానమ్,మరియు ఆకస్మిక లాభాలు
 నష్టాలు,lottry లాంటివి,అష్టమం నుండి చూడాలి.
మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి శుక్రుడు.
ద్వితీయం ధన స్థానం.సప్తమం కళత్ర స్థానం (spouse).
కళత్రం అంటే భార్య లేదా భర్త,మగవారికైతే భార్యా స్థానం
 ఆడ వారికైతే భర్త స్తానమ్,ఇదే కాకుండ వ్యాపారం లో
 భాగ స్వామ్యం కూడా సప్తమ స్తానాన్ని బట్టి పరిశీలించాలి.
మేష లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బుధుడు.
తృతీయం సొదరీ సోదర వర్గం,పరాక్రమం.సేవకులు,
షష్టమం శత్రు రోగ రుణాలను తెలియ జేస్తాయి.
మేష లగ్నానికి చతుర్దాధిపతి చంద్రుడు.చతుర్థం ద్వారా
గృహం భూములు,వాహనం, తల్లి మొదలగు అంశాలు పరిశీలించాలి.
మేష లగ్నానికి పంచమాధిపతి రవి.పంచమం ద్వారా సంతానం విద్య
అనురాగం అత్మీయత మొదలగు అంశాలు పరిశీలించాలి.
మేష లగ్నానికి నవమ వ్యయాధిపతి గురుడు.
నవమం భాగ్య స్థానం.నవమం ద్వారా భాగ్యం,తండ్రి,
వారసత్వం ఉపాసనా బలం ప్రయాణాలు మొదలగు
 అంశాలు పరిశీలించాలి.
వ్యయం (12 స్థానం) ;- స్థానాన్ని బట్టి ధన వ్యయం,నిద్రాభంగం,
జన్మాంతర విషయాలు,శత్రు భయం,దేశాంతర వాసం
మొదలగునవి పరిశీలించాలి.

జ్యోతిశ్శాస్త్రం లో రాశులకు విశేషమైన ప్రాధాన్యం ఉంది.
27 నక్షత్రాలు 12 రాశులలో ఇమిడి ఉంటాయి. రాశుల తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే
రాశుల లోని గ్రహాల పలితాలను విశ్లేశించే అవకాశం గల్గుతుంది.
రాశులు అంటే సమూహాలు. రాశులకు కొన్ని తత్త్వాలు,స్వభావాలు ఉంటాయి.

1.మేషం.:-మేషం అంటే గొఱ్ఱే అని అర్థం.గొఱ్ఱే తాను వెళ్ళే మార్గం లో తనకు పని చెప్పిన
 మార్గం లో ఆగకుండా ముందుకు వెల్తుంది.అనుసరణ దీని స్వభావం.అలాగే కొండనైనా
డీకొనే గాంభీర్యం కూడా గొర్రె కు సహజ లక్షణం.అందువలన దైర్యానికి, ముందడుగు వేయడానికి, అనుసరించి నడవడానికి,వ్యవహార నిర్వహణకు ప్రతీకగా మేషాన్ని పోల్చడం సంప్రదాయం. రాశి వారిలో తత్త్వమే మనకు కనిపిస్తుంది.
వృషభం:- వృషభమ్ అంటే ఎద్దు.ఒంటెద్దు పోకడ అని ఒక సామెత ఉంది.ఎద్దులు రెండు ఉంటే అవి బండికి కట్టినా నాగలి కి కట్టినా సమమైన పోకడ ఉంటుంది.
ఒంటెద్దు అయితే అసమత్వం,ఇష్టమొచ్చిన రీతిలో గమనం ఉంటాయి.
రాశి వారి ప్రవర్తనాదులలో విశయాన్ని గమనించి తగు జాగ్రత్తలు సూచించవల్సి ఉంటుంది.
మిధునంః-మిథునం అంటే జంట అని అర్థం. విషయాన్నైనా రెండు విధాలుగా చర్చించుకోవడం,రెండు విధాలైన భావాలకు స్థానమివ్వడం,
నిర్ణయ శక్తి లోపిస్తూ అన్నింటిలోనూ ఊగిస లాడటం అనేవి రాశి నామానికున్న ప్రత్యేక లక్షణాలు.
కర్కాటకంః-అంటే ఎండ్రికాయ.నీళ్ళలో సంచరిస్తుంటుంది.నీళ్ళలో అట్టడుగున ఉండే ఎండ్రకాయ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి కనపడుతుంది. మాత్రం అలజడి
అయినా లోపలికి వెళ్ళిపోతుంది.చూడడానికి ఆకృతి భయంకరంగా ఉన్నా,ధైర్యం లేని తత్వం కర్కాటకానికి ప్రత్యేకం. గొడవలంటే ఇష్టపడక పోవటం,ఇంటి వ్యవహారాలలో
 మాత్రం ఎక్కువ శ్రద్ధ వహించడం రాశి వారికి ప్రత్యేకం.

సింహంః-సింహమ్ మృగరాజు.గుహలలో సంచరించడం, అవసరానికి తగిన విధంగా ప్రవర్తించడమ్,శత్రువును సూటిగా దెబ్బతీయడం,ధైర్యంగా అడుగుముందుకు వేయడమ్,నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మొదలైన అంశాలన్ని
 సింహరాశికి వర్తిస్తాయి. అంశాలన్ని సింహ రాశి వారిలో కనిపిస్తాయి.
హుందాగా ప్రవర్తించడం,న్యాయబద్దమైన జీవనం,దోషాన్ని సహించలేక పోవడం,శత్రువును దెబ్బతీసే వ్యవహారం రాశి వారిలో కనిపించే గుణాలు.
కన్యః-ఒంటరిగా ఉండే కన్య యొక్క మనసులో కలిగే హావ భావాలకు రాశి ప్రతీక.అందరూ  తనను గమనించేటట్లుగా  విద్యాత్మకంగానో,
 ప్రవర్తనాత్మకంగానో,వాచికంగానోఏదో రూపంలో కనిపిస్తారు.ప్రతిభా పాండిత్యాలు అధికంగా ఉన్నప్పటికి,వాటిని ఉపయోగించాడానికి అవసరమైన మార్కెటింగ్
 మెళకువలు తెలిసిన వారు కన్యా రాశికి చెందిన వారు అవుతారు.
తులా రాశిః-తుల అనగా త్రాసు.త్రాసు లోని రెండు పళ్ళేల లాగా మంచి చెడులకు సంబంధించిన నిర్ణయాత్మ శక్తి కి ప్రతీక తులారాశి.వేరు వేరు అంశాల
మధ్యలో సామరస్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగే లక్షణం తులా రాశి వారిది.
అలాగే సమత్వ భావన కూడా వీరిలో అధికంగా కనపడుతుంది.
వృశ్చికంః-శబ్దార్థం తేలు.తేలు స్వయంగా కావాలని  మరొకరిని ఇబ్బంది పెట్టదు.ఎవరితో తనకు ఇబ్బంది రాకుండా చాటుమాటున తిరుగుతుంది.
తన తోకలో విషం నింపుకొని తిరుగుతుంది.ఇబ్బంది ఎదురైనపుడు తన ఆయుధాన్ని
వినియోగించుకొని ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది.అంతే కాకుండ తన జీవితాన్ని చాలించుకొని తన తరువాత తరానికి జన్మ నిస్తూ
ఉదాత్తత కు మారుపేరుగా నిలిస్తుంది. రాశి వారిలో లక్షణాలు కనపడుతాయి.
వీరు భావ వ్యక్తీకరణ కన్నా పనిలో నైపుణ్యం చూపిస్తుంటారు.

ధనుస్సుః-ఎక్కుపెట్టబడిన ధనుస్సు,లక్ష్య సాధనకు ప్రతీక.నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించాడానికి తన శక్తిని యుక్తిని ధారపోసి అనుకున్నది. పొందే వరకు పట్టు వదలని విక్రమార్కుల లాగా ఉంటారు రాశి వారు.జీవితమ్ లో  లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధనా మార్గం లో  జీవితాన్ని గడపి పరిణతులుగా కనిపించడం    రాశి వారి ప్రత్యేకత
మకరంః-మకరం అంటే మొసలి.సాధారణంగా  మొసళ్ళు నీటిలో ఎక్కువగా జీవిస్తూ ,నేల
 మీద కూడ తిరుగ గలిగేది.అయినా నీటి లోనే ఎక్కువ బలం కలది అని భావన.
మొండి పట్టుదలతో సేవా ధర్మాన్ని కలిగి తాను చెసే పని ఎంత కష్టమైనా,ఎంత ఇబ్బంది
కరమైనా చేసి చూపించె తత్త్వం మకరానిది.అయితే స్వంత ప్రదేశం లో వీరు అత్యధికంగా ఎదిగే అవకాశం ఉంటుంది.లోకంలో అత్యంత
 ఉదాత్తమైన ధర్మం సేవా ధర్మం. ధర్మానికి ప్రతీకగా రాశి వారిని మనము చూస్తాము.

కుంభమ్;-కుంభం అంటే కుండ అని అర్థం.అయితే కుండలో ఉండేది ఏమిటో తెలియకుండా ఉంటుంది.ఒకవేళ నీరు ఉన్నా ఎంత ఉందో తెలియదు.
కాబట్టి ఏదో తెలియని విశేషాలు కుంభంలో ఉంటాయి.నిండు కుండలా కనిపిస్తారీ కుంభ రాశి వారు,కాని ఒక్కొక్కప్పడు ఏమి ఉండక పోవచ్చు.ఏమి లేదనుకుంటే క్రొత్త విశేషం కనిపించ వచ్చు.
మీనంః-మీనం అంటే చేప.రెండు చేపలు అయిదు  అంట్లతో ఒకదాని తోకవైపు మరొకటి తిరిగి కనపడే  ఆకృతి మీనాకృతి.ఇక్కడ కూడా రెండు చేపలు  రెండు భావాలకు ప్రతీకలు.నిర్ణయ శక్తి విషయం లో రెండు భావనలు ఎప్పటికప్పుడు ఇబ్బంది
 పెడుతుంటాయి. రెండు చేపలకు అంట్లుగా అయిదు  నక్షత్రాలు ఉండడమ్ వల్ల ,వీరు అనుబంధాల కోసం  ప్రాకులాడడం కనిపిస్తుంది.అదే విధంగా అందరితో  ఆత్మీయతను పంచుకోవాలనే తపన వీరిలో కనిపిస్తుంది.మీనమ్ నీటిలో వేగంగా సంచరించడమ్ వలన  స్వస్థానం లో తమ ప్రతిభ చూపించడం,
వేగంగా జీవితాన్ని గడపడం ,అదే విధంగా  నిర్ణయాలను చేపలు మార్చుకొనే దిశల్లాగా వెనువెంటనే మార్చుకోవడం రాశి వారిలో ప్రత్యేకంగా మనము చూడవచ్చు.
 అయితే పైన పేర్కొనబడిన 12 రాశుల పలితాలు ఆయా లగ్నం లో జన్మించిన వారిలోను,చంద్రుడు రాశిలో ఉన్నవారిలోను,రవి రాశిలో ఉన్న
 వారిలోను కనిపించే ఫలితాలు. అయితే ఇవి ఒక సాధనా మార్గాలే తప్ప
 పరిపూర్ణంగా ఉండవు. రాశుల్ల్లొ ఉండే గ్రహాలు రాశులను చూసే గ్రహాలు తదితర అంశాలను  బట్టి పలితాలలో కొన్ని మార్పులుంటాయి.








రత్న ధారణః-
రత్నం ధరించడం వల్ల గౌరవం,ఖ్యాతి, సంపద అనందం,బలమ్ మరియు ధీర్ఘాయుర్ధాయం
కలుగుతాయి.అన్నింటి కంటే అవి గ్రహ దుష్ప్రభావాలను శరీరంను ఆరోగ్య వంతం
చేయడం నిరాశ నిస్ప్రుహ లని తొలగించి ధైర్యాన్ని కలుగ చేస్తుంది.
ప్రధాన రత్నములు ముఖ్యముగా తొమ్మిది రకములు
గ్రహం…….రత్నం…….ధరించవల్సిన వేలు.
రవి…..కెంపు(ruby)….అనామిక వేలు
చంద్రుడుముత్యం(pearl).. అనామిక వేలు
కుజుడుపగడం (Red coraL). అనామిక వేలు
బుధుడు..జాతి పచ్చ(emaraald).కనిష్టిక
గురువు..కనకపుష్య రాగం(Yellow Saphire)..చూపుడు వేలు
శుక్రుడు..తెలుపు వజ్రం(Diamond)…మధ్య వేలు
శని…..నీలం (blue Saphire)….మధ్య వేలు
రాహు..గోమేధికం(Garnet)… మధ్య వేలు
కెతువైఢూర్యం(cats eye)….. మధ్య వేలు
వేళ్ళ ఎన్నిక హస్త సాముద్రికం ఆధారంగా నిర్ణయించినపటికి
బుధునికి సంబంధించిన పచ్చ రాయి ఉంగరమ్  అనామిక వేలుకు కూడ ధరించ వచ్చును.
కాని ముందుగా తన జాతకమును జ్యోతిష్కునికి చూపించి
వారి సలహా మేరకు ధరించడమ్ మంచిది.
నవగ్రహ ఉంగరము లో రవి ప్రీతికి మధ్యన కెంపు,ఆగ్నేయ మూలన ముత్యం(చంద్రుడు),దక్షిణమున కుజుని కొరకై పగడమును,బుధునికిసంబంధించిన పచ్చను ఈశాన్య భాగమున ఉత్తర భాగమున పుష్య రాగమును(గురు)శుక్ర ప్రీతికై తూర్పున వజ్రమును,పశ్చిమమున శని ప్రీతి కొరకై నీలమును,రాహు కొరకు
 గోమేధికమును నైఋతి యందు,కెతు ప్రీతికొరకై  వాయవ్యమున వైఢూర్యమును
పొదిగిన ఉంగరమును కుడిచేతి చూపుడువేలు లేదా అనామిక వేలు ధరించ
 వలెను.
శుక్రుడు కొరకై పొదిగిన వజ్రము వేలు  గోరు వైపు వచ్చు నట్లుగా ధరించ వలెను.
కొత్తగా ఉంగరం ధరించే ముందు శాస్త్రోక్తంగా దానికి అభిషేకము, పూజ చేయించి  కనీసం 108 సార్లు నవగ్రహ జపం చేయించి,పంచాంగ శుద్ధి గల దినములలో శుభ నక్షత్ర
 శుభ తిథులతో కూడిన రోజున ధరించాలి.ఆడ వారు ఎడమ చేతికి
మగ వారు కుడి చేతికి ధరించాలని కొంతమంది,ఆడ వారైన మగవారైన కుడి చేతికి ధరించడం మంచిదని కొంత మంది చెప్పుతారు.
         Gemstones are prescribed to either strengthen or balance the energies of these planets in question, i.e. strengthen weak planets so that they do create some good effect, or further strengthen already strong planets, such that their effect is more pronounced. As an example, someone may want to strengthen Mercury to cure any speech impediment or skin inflammation, as a weak Mercury is known to cause these ailments. A person may want to strengthen Saturn if it is a Raj Yoga causing planet, in that case, in Saturn’s dasha or bhukti, the results given by Saturn multiply. Surely all good and bad effects multiply at the same time, there is a need for balance.
How do people wear these stones? These stones have to be of specific weight (in carats, or in ratti). They are worn either in gold or in silver in appropriate finger, during Shukla Paksha, when the planet is in own/friendly sign, on the planet’s day of the week, in the morning before 7:00 AM and after chanting the ruling god’s name 108 times. Needless to say, these gems should be flawless as much as possible and should be of good quality.
Name Stone Weight Wear in…
Sun Ruby (Maanik) 2 Carats Gold, in ring finger
Moon Pearl (Moti) 2 Carats Silver, in ring finger
Mars Red Coral (Munga) 3 Carats Gold (pref. 18 carat) or Silver, in ring finger
Mercury Emerald (Panna) 1.5 carats Gold, in ring or little finger
Jupiter Yellow Sapphire (Pukhraj) 2 carats Gold, in index finger
Venus Diamond (Heera) 1 carat Gold or silver in middle finger
Saturn Blue Sapphire (Neelam) 2 carats Gold, in middle finger
Rahu Garnet(Gomed) 3 carats Gold or Silver, in middle finger
Ketu Cat’s eye (Lahsuniya) 3 carats Gold, in middle finger
When deciding which finger the gem should be worn on, astrologers always consult the planetary friendship table. Mercury is a natural friend of Sun, therefore you can wear Emerald in the ring finger, which belongs to Sun.
A Diamond is not for everyone! Firstly, you should always consult an astrologer before you decide to wear a diamond. Secondly, it should not be worn on the ring finger as all of us are made to believe by the cool and jazzy television commercials. It is a natural friend of Saturn, therefore it should be worn only on the middle finger. It is not a natural friend of Sun and hence ring finger is not the place for it.





రాశులు-స్వభావాలు
చర స్థిర దిస్వభావ రాశులుః-
చర రాశులుః-మేషం,కర్కాటకం,తుల మకరం చర రాశులు.
రాశులలో లగ్నం లేదా చంద్రుడు లేదా ఎక్కువ గ్రహాలున్న జాతకులు చురుకు దనమ్,మార్పు,చాంచల్యం మొదలైన లక్షణాలు గలిగి ఉంటారు.
స్థిర రాశులుః-వృషభం,సింహం,వృశ్చికమ్,కుంభం
  నాలుగు స్థిర రాశులు. రాశులలో లగ్నం లేదా చంద్రుడు లేదా ఎక్కువ గ్రహాలున్న జాతకులు  స్థిరమైన అభిప్రాయం కలవారు,స్థిర నివాసమ్ పై
అభిలాశ,స్థిర ఆస్తులపై మమ కారం కలిగి ఉంటారు.
దిస్వభావ రాశులుః-మిధినం,కన్య,ధనుస్సు,మీనం
ఇవి దిస్వభావ రాశులు. రాశులలో మొదటి సగభాగమ్,చర స్వభావంలోను,రెండవ సగభాగం స్థిర స్వభావం లోను ఉంటారు
రాశులు-తత్వాలు
అగ్ని తత్వ,భూతత్వ,వాయు తత్వ,జల తత్వ రాశులు
మేషం, సింహం,ధనుస్సు అగ్నితత్వ రాశులు.
వీటిలో ఎక్కువ గ్రహాలుండగా జన్మించిన వారికి ఊష్ణతత్వ ప్రాధాన్యం,ధైర్య సాహాసాలు,శత్రుజయం మొదలైన లక్షణాలు ఉంటాయి.
భూతత్త్వ రాశులుః-వృషభం,కన్య,మకరాలు భూతత్త్వ
రాశులు. రాశులలలో ఎక్కువ గ్రహాలుండగా  జన్మించిన వారు శరీర బలం,భోజన ప్రీతి,భౌతిక జీవన విశ్వాసం,ప్రారంబించిన పని పూర్తి చేయడం,
సంపాదన పై అభిలాశ మొదలైన లక్షణాలు గలిగి ఉంటారు.
వాయు తత్త్వ రాశులుః-మిధునం,తుల,కుంభమ్ ఇవి
వాయు తత్త్వ రాశులు. రాశులలో ఎక్కువ గ్రహాలుండగా  జన్మించిన జాతకులు కష్టించి పని చేయలెరు.వీరి జీవితం ఆలోచనులు,ప్రణాలికలు,పథకాలలో గడుస్తుంది.
నూతన విషయాలు కనుగొనడం,దర్శించడం వీరికిష్టం.నిస్వార్థం,సౌభ్రాత్రుత్వం,మానవ శ్రేయస్సు వీరి లక్షణాలు.
జల తత్త్వ రాశులుః-కర్కాటకమ్,వృశ్చికం,మీనం ఇవి
 జల తత్త్వ రాశులు. రాశులలో ఎక్కువ గ్రహాలుండగా పుట్టిన వారు ఆవేశ పరులు,ఆందోళన,ఉన్న దానికంటే ఎక్కువ ఊహించడం మొదలగు లక్షణాఉలు
కలిగి ఉంటారు.పరిసరాలకు లోబడి నడవడం,చాంచల్యం వీరి గుణాలు.
రాశులు-జాతులు
మేషం, సింహం,ధనుస్సులు-- క్షత్రియ రాశులు
వృషభం,కన్య,మకరాలు-- వైశ్య రాశులు
మిధునం,తుల,కుంభమ్-- శూద్ర రాశులు
కర్కాటకమ్,వృశ్చికం,మీనం--బ్రాహ్మణ రాశులు
రాశులు-రంగులు
మేషం-ఎరుపు
వృషభం-తెలుపు
మిధునం-హరిత వర్ణం
కర్కాటకం-పాటల వర్ణం.
సింహమ్-ధూమ్ర పాండు వర్ణమ్
కన్యచిత్ర వర్ణం
తులనలుపు
వృశ్చికం..బంగారు వర్ణం
ధనుస్సు-పసుపు రంగు.
మకరం.-గోధుమ వర్ణం(కర్జూర రంగు)
కుంభం-బభ్రు వర్ణం
మీనంఊదా రంగు
రాశులు-చతుష్పదాది సంఙ్ఞలు
నర రాశులు(ద్విపాద)….మిధునం,కన్య,తుల,
ధనుస్సులో మొదటి సగభాగం,కుంభం
చతుష్పాద రాశులుమేషం,వృషభం సింహం
ధనుస్సులో రెండవ సగభాగం,మకరం లో మొదటి భాగం,
జల చర రాశులుకర్కాటకం,మకరం లో రెండవ భాగం,మీనమ్
కీట రాశులువృశ్చికం
రాశులు-హ్రస్వాది సంఙ్ఞలు
హ్రస్వ---మేష,వృషభ,కుంభ,మీన
దీర్ఘ…..సింహ,కన్య,తుల,వృశ్చిక ధనుస్సులు
మధ్యమమిధున,కర్కాటక,మకర రాశులు
రాశులు-గుణ ప్రకృతులు
కర్కాటక,సింహ,ధనుస్సు,మీనములు-సత్త్వ గుణ రాశులు
మేషం,వృషభం,తుల,వృశ్చికములు-రజో గుణ రాశులు
మిధున కన్య మకర కుంభ మీనములుతమో గుణ రాశులు.
రాశులు-వాతాది ప్రకృతులు
మేష,సింహ,ధనుస్సులు-పిత్త ప్రకృతి
వృషభ,మిధున,కన్య,తుల,మకరములు.వాత ప్రకృతి,
కర్కాటక,వృశ్చిక,కుంభ,మీనములు-కఫ ప్రకృతి.
నక్షత్రాలు-ఆకృతులు
ఆకాశంలో కనిపించే నక్షత్రాలు నిజానికి కొన్ని నక్షత్రాల సమూహాలు. నక్షత్రాల ఆకృతులు వేరు వేరుగా ఉంటాయి.ద్వాదశ రాశుల లోని 27 నక్షత్రాల ఆకృతులు విధంగా ఉన్నాయి.
అశ్విని….తురగముఖాశ్వినీ త్రీణి
(గుర్రం ముఖం ఆకృతి లో ఉన్న
 మూడునక్షత్రాల గుంపు)
భరణిభరణీ యోని త్రీణి
 (యోని ఆకృతి లో 3 నక్షత్రాలు)
కృత్తిక..కృత్తికా క్షురాషట్కం
 (మంగలి కత్తి ఆకృతి లో 6 నక్షత్రాలు)
రోహిణి..రోహిణీ శకటం పంచ
  (బండి ఆకృతి లో 5 నక్షత్రాలు)
మృగశిరమృగశిరా శీర్షం త్రయం
   (శిరస్సు ఆకారం లో 3 నక్షత్రాలు)
ఆరుద్ర..ఆరుద్రా ప్రవాళమేకం
  (పగడం ఆకృతి లోమెరుస్తూ ఒకే నక్షత్రం)
పునర్వసు..పునర్వసూ కులాల చక్రం పంచ
 (కుమ్మరి సారె రూపం లో 5 నక్షత్రాలు)
పుష్యమి..సరళా పుశ్యమి త్రీణీ
  (సరళాకృతిలో వరుసగా 3 నక్షత్రాలు)
ఆశ్లేష….ఆశ్లేషా సర్పా ఋతూ
  (సర్పాకృతిలో 6 నక్షత్రాలు)
మఖమఖాందోళికా పంచ
  (పల్లకి ఆకృతి లో 5 నక్షత్రాలు)
పుబ్బ-పుబ్బ ,ఉత్తర నేత్ర ద్వయో
  (కంటి ఆకృతి లో 2 నక్షత్రాలు)
ఉత్తర…. పుబ్బ ,ఉత్తర నేత్ర ద్వయో
  (కంటి ఆకృతి లో 2 నక్షత్రాలు)
హస్త..హస్తా పాణినాం పంచ
   (చేతి వేళ్ళ ఆకృతిలో 5 నక్షత్రాలు)
చిత్త..చిత్తా మౌక్తిక మేకం
  (ముత్యం ఆకృతి లో ఒకే ఒక నక్షత్రం)
స్వాతీ..స్వాతీ మాణిక్య మేకం
  (మాణిక్యం ఆకృతి లో ఒకే ఒక నక్షత్రం)
విశాఖ..విశాఖా కులాల చక్రం పంచ
  (కుమ్మరి సారె రూపం లో 5 నక్షత్రాలు)
అనూరాధ.అనూరాధా జ్యేష్టాంగుళ చత్రాకారం త్రయం
    (గొడుగు ఆకృతి లో 3 నక్షత్రాలు)
జ్యేష్టా.. అనూరాధా జ్యేష్టాంగుళ చత్రాకారం త్రయం
    (గొడుగు ఆకృతి లో 3 నక్షత్రాలు)
మూల..మూలా కుప్యత్కేసరి పంచ
   (కోపించిన కేసరి ఆకృతి లో 5 నక్షత్రాలు)
పూర్వాషాడపూర్వాషాడ,ఉత్తరాషాడ
   ద్వే ద్వే భేకం(కప్ప ఆకృతి లో 2)
ఉత్తరాషాడపూర్వాషాడ,ఉత్తరాషాడ
   ద్వే ద్వే భేకం(కప్ప ఆకృతి లో 2)
శ్రవణంశ్రవణం మఛ్ఛాకార త్రయం
    (చేప ఆకారం లో 3)
ధనిష్ట..ధనిష్టా శీర్షత్రయం
     (శీర్షాకృతిలో 3 నక్షత్రాలు)
శతభిషంశతభిక్చతం తారా
    (100 తారల గుంపు)
పూర్వాభాద్ర..పూర్వాభాద్ర,ఉత్తరాబాద్ర
   ద్వే ద్వే ఖట్వం(మంచమ్ ఆకృతిలో 2 నక్షత్రాలు)
ఉత్తరాభాద్రపూర్వాభాద్ర,ఉత్తరాబాద్ర
    ద్వే ద్వే ఖట్వం(మంచమ్ ఆకృతిలో 2 నక్షత్రాలు
రేవతీ..రేవతీ మత్స్యాకార త్రయం(చేప ఆకారంలో 3 నక్షత్రాలు)


నక్షత్రములు-నామాక్షరములు.
నక్షత్రం…1వ . 2 వ, 3,వ  ,4వ పాదాలు
అశ్విని….చూ,  చే,  చో,  లా
భరణిలీ , లూ  లే   లో
కృత్తిక…               .
రోహిణి..ఓ,వా , వీ, వూ         
మృగశిరవే, వో, కా, కి
ఆరుద్ర….కూ, ఖం, ఙ్ఞ, ఛ
పునర్వసుకే ,కో, హా, హీ.
పుష్యమిహూ, హే, హో, డా
ఆశ్లేష….డీ ,డూ, డే ,డో.
మఖమా, మీ, మూ, మే
పుబ్బ-మో, టా, టీ ,టూ
ఉత్తర…. టే ,టో, పా, పీ .
హస్తపూ, ష, ణా, థా .
చిత్తపే, పో, రా, రీ
స్వాతీరూ, రే, రో, తా
విశాఖతీ ,తూ, తే, తో
అనూరాధ….నా , నీ, నూ, నే
జ్యేష్టా.. ..నో, యా, యీ, యూ
మూలయే, యో, బా, బీ
పూర్వాషాడబూ, ధా, భా, ఢా.
ఉత్తరాషాడ….బే, బో, జా, జి.
శ్రవణం….జూ, జే, జో, ఖా.
ధనిష్ట…..గా, గీ ,గూ, గే.
శతభిషంగో, సా, సీ, సు.
పూర్వాభాద్రసే, సో, దా, ది.
ఉత్తరాభాద్రదూ, శం, ఝా, దా.
రేవతీ……దే, దో ,చా, చి
నక్షత్రాలు-అధిదైవాలు
అశ్విని….అశ్వినీ దేవతలు
భరణియముడు.
కృత్తిక…..అగ్ని.
రోహిణి..ప్రజాపతి.
మృగశిరచంద్రుడు.
ఆరుద్ర….రుద్రుడు.
పునర్వసుఅదితి.
పుష్యమి..బృహస్పతి.
ఆశ్లేష….సర్పం.
మఖపితరులు.
పుబ్బ-భగుడు.
ఉత్తర…. అర్యముడు.
హస్త..సూర్యుడు.
చిత్త..విశ్వకర్మ.
స్వాతీ..వాయువు.
విశాఖఇంద్రాగ్నులు
అనూరాధ….మిత్ర(సూర్య)
జ్యేష్టా.. ..ఇంద్ర.
మూలనిరృతి
పూర్వాషాడఉదకములు
ఉత్తరాషాడ….విశ్వే దేవతలు.
శ్రవణం….విష్ణు.
ధనిష్ట…..వసువులు.
శతభిషంవరుణుడు.
పూర్వాభాద్ర..అజైక పాదుడు.
ఉత్తరాభాద్రఅహిర్భుద్య్న
రేవతీ..పూష( సూర్య).
రాశులకు,నక్షత్రాలకున్న కారకత్వాలు  ఫలిత విభాగం అధ్యయనం చేయడం లో
అత్యంత కీలకమైనవి..ముఖ్యంగా నక్షత్రాలు,నక్షత్ర పాదాలతో రాశి చక్ర నిర్మాణము,
అధిపత్య వివరాలు లేకుండా సాధారణ పలితాలు కూడా చెప్పలేము.
      రాశుల కన్నా నక్షత్రాలే ముందుగా ఆకాశం  లో గమనించడం జరిగింది.ప్రతి రోజు రాత్రి పూట చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరగా
 కనిపిస్తున్నాడో ,ఆ నక్షత్రాన్ని ఆ రోజు నక్షత్రంగా సూచించడం జరుగుతుంది. ఆ రోజు నక్షత్రం వేరు వేరు కార్యక్రమాలకు బాగుందో లేదొ చూడడం ముహూర్త భాగం ప్రత్యేకత. ఆలాగే వ్యక్తుల జన్మ నక్షత్రాలకు,ఆ రోజు నక్షత్రం వరకులెక్కించి (9 నవకాలుగా)చూసి  తారా బలం బాగుందా లేదా పరిశీలించడం కూడ ముహూర్తం నిర్ణయం లో ముఖ్యమైన అంశం.

చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం చెపుతుంది.చంద్రుడున్న నక్షత్రం,చంద్రుడున్న రాశి తత్త్వాలు మన మనస్తత్వాని నిర్దేశిస్తున్నాయి.
మనస్సు లోని భావాలను అధ్యయనం  చేయడానికి ఇదొక మార్గం.
రాశి అధిపతి,నక్షత్రాధిపతి,నవాంశాధిపతుల మైత్రి,శత్రుత్వాల ఆధారంగా జాతకుడి ఫలితాలు నిర్ణయించ బడుతాయి.ఇప్పుడు ఇవి అశ్విన్యాది
నక్షత్రాల వారిని సూక్ష్మంగా పరిశీలిద్దాము.
 అశ్వినిః-అశ్విని నక్షత్రాధిపతి కేతువు.ఈ నక్షత్రం లో పుట్టిన వారికి కేతు మహాదశ
 తో ప్రారంభం అవుతుంది.కేతుదశ పూర్తి ప్రమాణం.7 సం॥లు.ఆ తరువాత
శుక్ర దశ 20 సం॥,రవి 6 సం॥,చంద్ర దశ 10 సం॥కుజ 7 సం॥,రాహు 18 సం॥,
గురు 16 సం॥ శని 19 సం॥ బుధ 17 సం॥ల దశలు అనుభవానికి వస్తాయి.
పూర్ణాయు ప్రమాణం 96 సం॥,అయితే అశ్విని ప్రారంభ రెండు ఘడియలు గండ కాలము.
ఈ నక్షత్ర జాతకులు సాధారణంగా ఆకర్షణీయంగా ఉంటారు.అందరికి ప్రేమ పాత్రులుగా
స్నేహ భావం తో ప్రవర్తిస్తారు.నెర్పుతో పనులు చక్క బెట్టుకుంటారు.నగలు ఆభరణాల మీద మోజు  ఎక్కువ.అయితే దుర్జన సాంగత్యం వల్ల చిక్కులు తెచ్చుకుంటారు. చపలత్వం,లోభ గుణం కొద్దిగా కనిపిస్తాయి.స్థూల శరీరం,ధీర్ఘ హస్తాలు,సూక్ష్మ నాసిక,విశాల నయనాలు,మంచి రూపం ఉంటుంది. అయితే అవయవాల తీరు,గుణ
గణాలు నక్షత్ర పా దాలను బట్టి,లగ్నం గ్రహస్థితి ని బట్టి మారవచ్చు.
నక్షత్రాధిపతి కేతువు ఙ్ఞాన కారకుడు.మంత్ర శాస్త్రం,వేదాంతం,తంత్ర,జ్యోతిష,
యోగ శాస్త్రాల పట్ల దైవ ఉపాసన పట్ల ఆసక్తి కలిగిస్తాడు.అలాగే వైరాగ్యం,అధ్యాత్మికం,
ఙ్ఞానం లభిస్తాయి.మశూచి,స్పోటకమ్,కడుపునొప్పి,నెత్ర వ్యాధి, వ్రణాలు ఇత్యాది రుగ్మతలు,సంప్రదాయ భిన్నమైన ప్రవర్తన,చపల బుద్ధి,అన్య మతాల వారితో చెలిమి అల్ప భోజనం మొదలగు అంశాలు కేతువు పరిధి లోకి వస్తాయి.
కేతు _యొక్క అనుకూల దశ అంతర్దశ లలో మంచి పలితాలు,ప్రతికూల దశ,అంతర్దశలలో
చెడు ఫలితాలు కనిపిస్తాయి.
భరణిః నక్షత్రాల వరుసలో రెండవది.
మేష రాశి.భరణి నక్షత్రానికి అధిపతి
శుక్రుడు.అధిదేవత యముడు.ఈ నక్షత్రం లో
పుట్టిన వారికి శుక్ర మహా దశ తో జీవితం
ప్రారంభం అవుతుంది.శుక్రదశ పూర్తి
 ప్రమాణం 20 ఏళ్ళు.తరువాత రవి 6,చంద్ర 10
కుజ 7 రాహు 18,గురు 16,శని 19,బుధ 17,
కెతు 7 సంవత్సరాలు వరుసగా అనుభవానికి
వస్తాయి.
పరమ ఆయుప్రమాణం 85 సం॥లు.
భరణి నక్షత్రం లో పుట్టిన వారు
సత్యవాదులు ధర్మ ప్రవర్తనులు,అలంకార
ప్రియులు,కళాభిరుచి గలవారు,
సుఖవంతులు అవుతారు,మంచి ఆహారం
 నిద్ర అనుభవించుతారు.
నక్ష్తత్రాధిపతి శుక్రుడు కళత్ర కారకుడు,
లలిత కళలు,వాహన సౌకర్యం,దాంపత్య
సుఖం ఆభరణాలు,సేవకసౌకర్యం
కలిగిస్తాడు.ప్రతి కూల దశ,అంతర్దశ ల లో
 కుటుంబ లోపళ్,తల్లికి లేదా భార్యకు
 అనారోగ్యం,వ్యాపారం లో నష్టం,కలహాల
 కాపురం కలుగుతాయి.
కృత్తికః-మొదటి పాదం మేష రాశిలో,
2,3,4 పాదాలు వృషభరాశిలో ఉంటాయి.
రాశి ప్రకారం మేషానికి కుజుడు,వృషభానికి
 శుక్రుడు అధిపతులు.కృత్తక కు నక్షత్రాధిపతి
రవి.అధి దైవం అగ్ని. ఈ నక్షత్రం లో పుట్టిన
వారికి రవి మహా దశ తో జీవితం ప్రారంభం
 అవుతుంది.రవి దశ పూర్తి ప్రమాణం
6 ఏళ్ళు.తరువాత చంద్ర 10 కుజ 7
 రాహు 18,గురు 16,శని 19,బుధ 17, 
కెతు 7 శుక్ర 20 సంవత్సరాలు వరుసగా
 అనుభవానికి వస్తాయి.పూర్ణ ఆయుప్రమాణం
80 సం॥లు.కృత్తిక నక్షత్రం లో జన్మించిన
 వారికి  మంచి శరీర కాంతి,తెలివితేటలు,
వాక్చాతుర్యం,బంధు ప్రీతి,సుఖ సంపదలు
 ఉంటాయి.స్వశక్తి తో సంపాదించి జీవిస్తారు.
రోహిణి.ః-ఇది 4 వ నక్షత్రం.వృషభ రాశి.
నక్షత్రాధిపతి చంద్రుడు.అధిదైవం ప్రజాపతి.
ఈ నక్షత్రం లో పుట్టిన వారికి చంద్ర మహా దశ
 తో జీవితం ప్రారంభం అవుతుంది.చంద్ర
దశ పూర్తి ప్రమాణం 10 ఏళ్ళు.తరువాత కుజ 7,
రాహు 18,గురు 16,శని 19,బుధ 17,కెతు 7,
శుక్ర 20,రవి 6 సంవత్సరాలు వరుసగా
అనుభవానికి వస్తాయి.పరమ ఆయు
ప్రమాణం 80 సం॥లు.
ఈ నక్షత్ర జాతకులకు ఆకర్షణీయమైన
రూపం,కార్య నైపుణ్యం,మాటలో నేర్పు,
కలుపుగోలు తనమ్,స్థిరమైన బుధ్ధి,చిన్న
 నుదురు కలిగి ఉంటారు.కంటి జబ్బులకు
లోనయ్యే అవకాశమెక్కువ.
మృగశిరః-1,2 పాదాలు వృషభ రాశిలో,
3,4 పాదాలు మిధునం లో ఉంటాయి.మిధున
రాశి అధిపతి బుధుడు,మృగశిర నక్షత్రాధిపతి
కుజుడు.అధి దైవతం చంద్రుడు. ఈ నక్షత్రం లో
 పుట్టిన వారికి కుజ మహా దశ తో జీవితం
ప్రారంభం అవుతుంది.కుజ దశ పూర్తి
 ప్రమాణం 7 ఏళ్ళు.ఒక్కొక్క పాదం 21 నెలలు
హరీంచగా మిగిలిన కుజ దశ అనుభవానికి
 వస్తుంది.తరువాత రాహు 18,గురు 16,శని
 19,బుధ 17,కెతు 7,శుక్ర 20,రవి 6,
చంద్ర 10 సం॥ లు వరుసగా అనుభవానికి
 వస్తాయి.పరమ ఆయుప్రమాణం 80 సం॥లు.
మృగశిర నక్షత్ర జాతకులకు ఉత్సాహం,ధైర్య
 సాహసాలు,పాపభీతి,మాత్రు భక్తి,శాస్త్ర విఙ్ఞానమ్,
స్వాభిమానం,తీవ్ర విమర్ష,అవివెకం,
ఉన్నత వక్షస్థలం,విశాలమైన భుజాలు
ఉంటాయి.చపలత్వమ్ అధికం,
పెత్తనమ్ వహించగలరు.
ఆరుద్రః-ఆరుద్రకు అధిపతి రాహువు.
ఈ నక్షత్రం లో పుట్టిన వారికి రాహు
మహా దశ తో జీవితం ప్రారంభం
అవుతుంది.రాహు దశ పూర్తి ప్రమాణం
 18 ఏళ్ళు.ఒక్కొక్క పాదాని నాలుగున్నర
ఏళ్ళూ గతించగా మిగిలిన రాహు దశ
 అనుభవానికి వస్తుంది.తరువాత
గురు 16,శని 19,బుధ 17,కెతు 7,శుక్ర 20,
రవి 6,చంద్ర 10,కుజ 7 సం॥ లు వరుసగా
 అనుభవానికి వస్తాయి.పరమ ఆయు
ప్రమాణం 70 సం॥లు.ఈ నక్షత్ర జాతకులకు
 క్రయ విక్రయాలలో నైపుణ్యం ఎక్కువ.
కాల నియమాలు పాటిస్తారు.చలన
చిత్ర రంగం,ఫోటోగ్రఫీ,ప్రింటింగ్,ఎక్ష్‍రే,
ప్లానులు,డిజైనులు,రికార్డింగ్‍ అనుకూలం,
కొంచెం గర్వం,తామస గుణం,చేసిన మేలు
 మరిచే చపలత్వం ఉంటుంది.
అక్రమ వ్యాపారానికి సంకోచించరు.
పునర్వసుః-1,2,3 పాదాలు మిధున రాశిలో
 నాలుగవ పాదమ్ కర్కాటక రాశిలోను
ఉంటాయి. ఈ నక్షత్రం లో పుట్టిన
వారికి గురు మహా దశ తో జీవితం
 ప్రారంభం అవుతుంది.గురు దశ పూర్తి
 ప్రమాణం 16 ఏళ్ళు.ఒక్కొక్క పాదం 4 ఏళ్ళు
నెలలు హరీంచగా మిగిలిన గురు దశ
 అనుభవానికి వస్తుంది.తరువాత ,శని 19,
బుధ 17,కెతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,
రాహు 18 సం॥ లు వరుసగా అనుభవానికి
వస్తాయి.గండాలు లేకుంటే
పూర్ణాయుర్ధాయం 96 సం॥లు.
ఈ నక్షత్రం లో పుట్టినవారు మంచి
 తెలివితేటలు,ధర్మబుధ్ధి,ఔదార్యం,ధైవభక్తి,
శాస్త్ర విఙ్ఞానమ్,న్యాయ దృష్టి,పరోప కారా
గుణమ్ కలిగి ఉంటారు.మంచి తనంతో జనాన్ని
ఆకర్షించగలరు.ఒక్కొక్క పాదానికి ఒక్కొ విశేషం ఉంది.
పుష్యమిః-కర్కాటక రాశి,నక్షత్రాధిపతి శని.
శని దశతో జీవితం ప్రారంభం.
 పూర్తి దశ 19 సం॥లు. తరువాత బుధ 17,కెతు 7,
శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు 18,
గురు 16 సం॥ లు వరుసగా అనుభవానికి వస్తాయి.
గండాలు లేకుంటే పూర్ణాయుర్ధాయం 70 సం॥లు.
ఈ నక్షత్రం లో పుట్టినవారికి కాముకత్వం,
శరీర పుష్టి,ధైర్యం,శుభ్రత,ఆత్మాభిమానమ్,
సూక్ష్మ గ్రహణ శక్తి,శీఘ్ర కోపం,ఉపకార గుణం,
శాస్త్ర విఙ్ఞానమ్ ఉంటాయి.
ఏకాంతంగా ఉండటానికిఇష్ట పడుతారు.
తీపి పదార్థాలు మక్కువ.
ఆశ్లేషః-కర్కాటక రాశి.నక్షత్రాధిపతి బుధుడు.
బుధ దశతో జీవితం ప్రారంభం పూర్తి
దశ 17 సం॥లు. తరువాత కెతు 7,శుక్ర 20,
రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు 18,గురు 16,
శని 19 సం॥ లు వరుసగా అనుభవానికి వస్తాయి.
 పూర్ణాయుర్ధాయం 86 సం॥లు.ఏ పాదం లో
పుట్టిన వారైనా మాటలలో మంచి నెర్పరులు.
రహస్యంగా అపకారం చేయగలరు.
యజమాని పనులను చెయడంలో ఆసక్తి,
చాతుర్యం,చూపిస్తారు,పెద్దల మన్ననలను
ఆదరణను పొందుతారు.అందంగా ఉంటారు.
పరసంపర్కం,కాముక గుణం ఎక్కువ.
మఖః-సింహ రాశి.నక్షత్రాధిపతి కేతువు.
కేతు మహా దశతో జీవితం ప్రారంభం.
తరువాత వచ్చే దశలు,,శుక్ర 20,రవి 6,
చంద్ర 10,కుజ 7,రాహు 18,గురు 16,శని 19,
బుధ 17 సం॥ లు. పూర్ణాయుర్ధాయం
97 సం॥లు.ఏ పాదం లో పుట్టిన వారైనా
 మహిళలకు గౌరవం,సుఖం,సంపద,
లభిస్తాయి.దైవభక్తి,పెద్దల పట్ల గౌరవం
ఉంటాయి.పురుషుడైతే తేజో వంతుడై
తండ్రిని మించి పోతాడు.వాదనా పటిమ,
దైవ భక్తి,గురుభక్తి ఉంటాయి.
కోపం ఎక్కువ.బంధు వర్గానికి మేలు చేస్తారు.
కార్య నిపుణులు,కళాభిరుచి,
ఆకర్షణ,ఉపాసనా బలం ఉంటాయి.
పుబ్బ(పూర్వ ఫల్గుణి)ః-సింహరాశి,పుబ్బ
నక్షత్రాధిపతి శుక్రుడు.ఈ జాతకులకు శుక్ర దశ
తో జీవితం ప్రారంభమవుతుంది.పూర్తి దశ 20 సం॥లు.
తరువాత వచ్చే దశలు రవి 6,చంద్ర 10,
కుజ 7,రాహు 18,గురు 16,శని 19,
బుధ 17,కేతు 7 సం॥ లు. పూర్ణాయుర్ధాయం
90 సం॥లు.ఏ పాదం లో పుట్టినా పుబ్బ నక్షత్ర జాతకులకు
కళాభిరుచి,ఆభరణాలు,అలంకారాల మీద మోజు,
యుక్తాయుక్త విచక్షణ,కళలలో నేర్పరి తనం,మంచి రూపమ్,
ప్రజాదరణ ఉంటాయి.ఖర్చు,చపల గుణం ఎక్కువ,
మాతృ సుఖం స్వల్పం.
ఉత్తరః-మొదటి పాదం సింహ రాశి లోను,మిగిలిన
2,3,4 పాదాలు కన్యారాశి లోను ఉంటాయి. నక్షత్రాధిపతి
 సూర్యుడు.ఈ నక్షత్ర జాతకులకు సూర్య దశ తో జీవితం
 ప్రారంభమవుతుంది.పూర్తి దశ 6 సం॥లు.
తరువాత వచ్చే దశలు చంద్ర 10,
కుజ 7,రాహు 18,గురు 16,శని 19,
బుధ 17,కేతు 7,శుక్ర 20 సం॥ లు. పూర్ణాయుర్ధాయం
80 సం॥లు.ఏ పాదం లో పుట్టినా నక్షత్ర స్త్రీ జాతకురాలు
సంతానవతి,సౌభాగ్యవతి,కార్యదక్షురాలు పురుషుడైన
తేజస్వి,కార్యాకార్య విచారము తెలిసినవాడు
నాట్యకారుడుఅగును.
హస్తః-అశ్విని నుండి 13 వ నక్షత్రం ఇది.
నక్షత్రాధిపతి చంద్రుడు.
హస్తలో పుట్టిన వారికి చంద్ర దశతో జీవితం
 ప్రారంభం.తదుపరి కుజ7,రాహు 18,గురు16,శని19,
బుధ 17,కేతు7,శుక్ర 20,రవి 6 సం॥లు వరుసగా
 అనుభవానికి వస్తాయి.పూర్ణాయుర్దాయమ్ 88 సం॥.
పురుషులైతె మంచి కీర్తి,గౌరవం,గాంభీర్యం,
విద్య,నైపుణ్యం,ఉపకార గుణంఉంటాయి.
మహిళలైతేమంచి ప్రవర్తన్,దైవభక్తి,పెద్దల
యందు గౌరవమ్, సంపద,సుఖం ఉంటాయి.
చిత్తః-మొదటి రెండు పాదాలు కన్య రాశి,చివరి
రెండు పాదాలు తులా రాశి.నక్షత్రాధిపతి కుజుడు.
కుజ దశ (7 సం॥లు) తో జీవితం ప్రారంభం.
తదుపరి ,రాహు 18,గురు16,శని19,బుధ 17,కేతు7,
శుక్ర 20,రవి 6,చంద్ర దశ 10 సం॥లు వరుసగా
 అనుభవానికి వస్తాయి.అన్ని గండాలు గడిస్తే
 పూర్ణాయుర్దాయమ్ 80 సం॥.
చిత్తా నక్షత్రం లో పుట్టినవారు పురుషులు
 సర్వ జన ప్రియులు,సుగంధ ద్రవ్యాలు,
అలంకారలపై ఆసక్తి గలవారు,విలాసప్రియులు,
మృదు సంభాషణ గలవారై ఉంటారి.స్త్రీలు
 రూపవతులు అలంకార ప్రియులవుతారు.
ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది.
స్వాతిః-ఈ నక్షత్రం నాలుగు పాదాలు తులా రాశిలో
ఉంటాయి.స్వాతి నక్షత్రాధిపతిరాహువు
రాహు దశ(18సం॥లు) తో జీవితం ప్రారంభం.
 తదుపరి గురు16,శని19,
బుధ 17,కేతు7,శుక్ర 20,రవి 6,చంద్ర10,
కుజ 7 సం॥లు వరుసగా అనుభవానికి వస్తాయి.
ఈ నక్షత్ర జాతకలు పురుషులు స్వతంత్రులు,
బుద్ధిమంతులు,ధైర్యవంతులు,
పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారు.బంధు వర్గానికి ఇష్టులవుతారు.విశాల దృక్పథం
 కలిగి ఉంటారు.స్వాతిలో పుట్టిన మహిళలకు
 మంచి సంతానం,కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు.



విదేశీ యానంః-
ప్రయాణ సాధనాలు,వైఙ్ఞానిక విలువలు
పెరిగిన ఈ రోజులలో విదేశీ ప్రయాణానికి
చాలా ప్రాముఖ్యత పెరిగింది.
విదేశీ యానగ్రహ కారకత్వాలుః- దగ్గర ప్రయాణాలకు
బుధుడు(సహజ తృతీయాధిపతి),దూర ప్రయాణాలకు
 గురువు(సహజనవమాధిపతి) కారకులు.గురువు విద్యకు,
పరిశోధనలకు,గౌరవానికి,ధనానికి కారకుడు
.ఈ అంశాలన్నింటితో సంబంధంఉన్న గురువును
 విదేశీ యానానికి కారకుడు గా గుర్తించడం
 జరుగుతుంది.
ఇంకా నవమ(9),వ్యయ(12) స్థానాలలో ఉన్న
 రాహు,కేతువులకు, సముద్ర ప్రయాణ రూపంగా
చంద్రునికి,వాయు యానానికి శని,యురేనలకు
ఈ విదేశీయాన కారకత్వాని అపాదిస్తున్నారు.
శని(శనైశ్చరః=మెల్లగా నడచే వాడు) కావడం వలన
 కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
విదేశీ యాన రాశీ భావ కారకత్వాలుః-దూర
ప్రయాణానికి 9 వ భావం ముఖ్యం కావడం
వల్ల భాగ్యభావంగా దానికి గల గుర్తింపు,
విదేశం వెళ్ళడం అదృష్టం గా భావించడ
ం మొదలైన కారణాల వలన 9 వ భావం ముఖ్యం
 అని చెప్పవచ్చు.
ఇంకా సప్తమ భావం(భాగస్వామ్య భావం),
12 వ భావం(వ్యయ భావం) ఈ కారకత్వాన్ని
  కలిగి ఉన్నాయి.రాశులలో(చర,స్థిర,దిస్వభావ రాశులలో)
చర రాశులు అనగా మేషం,కర్కాటకం,తుల,మకరం
ప్రధాన పాత్ర వహిస్తాయి.వాటిలో కర్కాటకం ,తుల
ఎక్కువ ప్రాధాన్యత కలవిగా ఉన్నాయి కారణం
వాటి రాశ్యాధిపతులు చంద్రుడు,శుక్రుడు శుభగ్రహాలవటం.
9,12 స్థానాలను బట్టీ విదేశీ యానం పరిశీలించాలి.
భాగ్య స్థానం లో శుభ  గ్రహాలుంటే విదేశీ యాన
 భాగ్యం కలుగుతుంది.నవమాధిపతి ద్వాదశ స్థానంలో
 ఉన్నా ద్వాదశాధిపతి నవంలో ఉన్నా విదేశీ యానం
చేస్తారు.అష్టమ స్థానం లో శుభ గ్రహాలుండి,శుభ వీక్షణ కలిగి
బలవంతుడైతే సముద్ర యానం వల్ల లాభం సంపాదిస్తారు.
పాశ్చాత్య జ్యోతిషం లో యురేనస్(ఇంద్రుడు),
నెప్ట్యూన్(వరుణుడు),ప్లూటో(యముడు) ఉన్నందు
వలన విదేశీ యానం,వాయు యానానికి యురేనస్
కారకం అంటారు.ఈ గ్రహం లగ్నానికి 5,9,12
స్థానాలలో ఉంటే విదేశీ యానం సూచితమౌతుంది.
5,9 లలో ఉంటే ప్రయోజనాత్మకమైనదిగా 12 లో ఉంటే విలాస యాత్రగా భావిస్తారు.





నక్షత్ర పలితాలు.
విశాఖః-విశాఖ 1,2,3, పాదాలు తులా రాశిలోను,
4 వ పాదం వృశ్చిక రాశి లో ఉంటాయి.
విశాఖ నక్షత్రాధిపతి గురువు.గురు దశ పూర్తి
 ప్రమాణం 16.సం॥లు.తదుపరి వరుసగా శని 19,బుధ 17,
కేతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,
రాహు18 సం॥ ల దశలు అనుభవానికి వస్తాయి.
పూర్ణాయువు 97 సం॥ లు. విశాఖ నక్షత్రం ఏ పాదం
 లో పుట్టినా పురుషులకు సూక్ష్మ బుద్ధి,వివేకం,యుక్తి,,
పొదుపు,దయ,ఇంద్రియ నిగ్రహం,అసూయ,లోభ గుణం,
కరుణ,స్పష్టంగా మాట్లాడే స్వభావం,నేర్పరి తనం,
బంధు వర్గానికి ఉపకారం చేసే స్వభావం ఉంటాయి.
విశాఖ మహిళలకు కోమల శరీరం,కలుపుగోలు తనం,
మిత్ర ప్రేమ ఉంటాయి,ధనవంతురాలు,తీర్థ యాత్రలు చేస్తారు.
అనూరాధః-ఈ నక్షత్రం వృశ్చిక రాశి లోనిది.
నక్ష్త్రాధిపతి శని.శని దశ తో జీవితం ప్రారంభం,
శని పూర్తి దశ 19 సం॥లు. తదుపరి వరుసగా బుధ 17,
కేతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 ,
 గురు 16 సం॥ ల దశలు అనుభవానికి వస్తాయి.
పూర్ణాయువు80 సం॥ లు. విశాఖ నక్షత్రం ఏ పాదం లో
 పుట్టినా పురుషులకు రాజ కీయాలలో ఆసక్తి,మంచి రూపం
 శౌర్యం,పాప భీతి,మహిళలపై అభిమానం,
పర స్థల నివాసం ఉంటాయి. ఈ నక్షత్రం లో పుట్టిన
మహిళలకు,స్నేహ శీలం,కలుపుగోలు తనమ్.
ప్రసన్న రూపమ్,భర్త పట్ల అనురాగం,భక్తి,
సంపదలు,ఆభరణాలు ఉంటాయి.

జ్యేష్టః-వృశ్చిక రాశిలో ఉండే ఈ జ్యేష్టా నక్షత్రం  3 తారల ఎరుపు రంగులో గొడుగు వలె కనిపిస్తుంది.
ఈ నక్షత్రం లో పుట్టిన వారికి పుత్ర సంతతి అధికం,స్నేహ గుణం.
,స్త్రీ లోలత,శత్రువులు అధికం,ముక్కు పొడవుగా ఉంటుంది.
సత్య శీలురు,సంత్రుప్తి తో జీవిస్తారు.నక్షత్రాధిపతి బుధుడు.
బుధ దశ 17 సం॥లు. తదుపరి వరుసగా కేతు 7,శుక్ర 20,రవి 6,
చంద్ర 10,కుజ 7,రాహు18 , గురు 16,శని 19 సం॥ ల
దశలు అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 80 సం॥లు.
మూలః-మూలా నక్షత్రానికి అధిపతి కేతువు.ఈ నక్షత్రం
 ధనుర్రాశిలో వుంది.కెతు మహా దశతో జీవితం
 ప్రారంభమ్,కేతు పూర్తి దశ 7 సం॥లు. తదుపరి వరుసగా
 శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 ,
 గురు 16 ,శని 19,బుధ 17 సం॥ ల దశలు
 అనుభవానికి వస్తాయి.మూలా నక్షత్ర జాతకులు
 యజమానికి మేలు చేస్తారు.అన్ని రహస్యాలు
పసిగట్ట గలరు.వివక్ష లెకుండా అన్ని తింటారు.
వితండ వాదం చేస్తారు.ఎన్ని కష్టాలైనా భరిస్తారు.
స్వాభిమానం అధికం,ధన,సుఖ,భోగాలు
అనుభవిస్తారు.ఈ నక్షత్రం లో పుట్తిన మహిళకు
 సౌఖ్యం తక్కువ.ఉన్నతవిద్యపై ఆసక్తి తక్కువ.
పూర్వాషాడః- ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు.
 ఈ నక్షత్రం ధనుర్రాశిలో వుంది.శుక్ర 
మహా దశతో జీవితం ప్రారంభమ్,శుక్ర మహా దశ
  పూర్తి దశ  20 సం॥లు. తదుపరి వరుసగా
రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 , గురు 16 ,
శని 19,బుధ 17 ,కేతు 7సం॥ ల దశలు
 అనుభవానికి వస్తాయి.
పూర్ణాయు ప్రమాణం 80సం॥లు. ఈ నక్షత్ర
జాతకులకు వినయం,ప్రసన్న ముఖం,దాన గుణం,
దూర దృష్టి, తల్లిపైన ప్రేమ,కార్య నిర్వహణ
 సమర్ధత,మంచిపేరు,స్వల్ప సంపద ఉంటాయి.
ఉత్తరాషాడః-మొదటి పాదం ధనుర్రాశి లోను,
మిగిలిన మూడు పాదాలు మకర రాశిలోను
 ఉంటాయి.నక్షత్రాధిపతి సూర్యుడు.
సూర్య దశ తో జివితం మొదలవుతుంది.
 పూర్తి దశాప్రమాణం  6 సం॥లు.ఒక్కొక్క
 పాదానికి ఒకటిన్నర సంవత్సరాల చొప్పున
 భుక్తమై మిగిలిన దశ మాత్రమే అనుభవానికి
 వస్తుంది.ఆ తదుపరి చంద్ర 10,కుజ 7,రాహు18 ,
 గురు 16 ,శని 19,బుధ 17,కెతు 7,శుక్ర 20 సం॥ ల
 దశలు అనుభవానికి వస్తాయి.పూర్నాయువు
89 సం॥లు.ఉత్తరాషాడ జాతకులు వినయంగా
 ప్రవర్తిస్తారు.ధార్మికులు,అందరికి ప్రేమ పాత్రులు
 అవుతారు.మహిళలు సంపన్నురాలులై,
 భర్త అనురాగాన్ని పొందుతారు.
01.09.2015
నక్షత్ర పలితాలు-3
శ్రవణంః-శని ఆధిపత్యం గల మకర రాశిలో
 ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి చంద్రుడు.
కనుక శ్రవణా నక్షత్ర జాతకుల జీవితం
చంద్ర దశలో ప్రారంభం అవుతుంది.
చంద్ర దశ పూర్తి ప్రమాణం 10 సం॥లు.
ఒక్కొక్క పాదానికి రెండున్నర సం॥లు
గడువగా వారి వారి పాదాన్ని బట్టి,
జన్మ సమయాన్ని అనుసరించి మిగతా
చంద్ర దశ అనుభవానికి వస్తుంది.
తదుపరి వరుసగా కుజ 7,రాహు 18,
గురు16,శని19,బుధ17,కేతు7,
శుక్ర 20,రవి 6 సం॥ల దశలు అనుభవానికి
వస్తాయి.ఏ పాదం లో పుట్టినా శ్రవణా
 నక్షత్రానికి దోషం లేదు.
అమావాస్య గ్రహణ నక్షత్రాలలో జన్మిస్తే
శాంతి అవసరం.శ్రవణా నక్షత్ర జాతకులకు
 2,3,4,5,7,13,15,30 సంవత్సరాలలో రోగ శస్త్రాగ్ని,
అపమృత్యు భయాలుంటాయి.
పూర్ణాయువు 90 సం॥లు.శ్రవణ నక్షత్ర
జాతకులకు అనుకూలవతి ఐన భార్య
లభిస్తుంది.శాస్త్ర విఙ్ఞానం,విద్య,వివేకం,
ఔదర్యం,మాటనేర్పు,స్త్రీ వ్యామోహం,ఉపకార
బుద్ధి,కీర్తి ప్రతిష్టలు,ఆర్జన, ఉంటుంది.పరదేశ
సంచారం ఉంటుంది.
ధనిష్టః-మొదటి రెండు పాదాలు మకర రాశి లోను,
మూడు,నాలుగు పాదాలు కుంభ రాశిలోను
 ఉంటాయి.ధనిష్టా నక్షత్రానికి అధిపతి కుజుడు,
కనుక కుజ దశ తో జీవితం ప్రారంభం.ఇది 7 సం॥లు.
ఒక్కొక్క పాదానికి 21 నెలలు చొప్పున భుక్తం
కాగా మిగిలిన దశ అనుభవానికి వస్తుంది.
తదుపరి వరుసగా రాహు 18,గురు16,శని19,
బుధ17,కేతు7,శుక్ర 20,రవి 6,చంద్ర 10 సం॥ల
దశలు అనుభవానికి వస్తాయి.ఏ పాదం లో
పుట్టినా దోషం లేదు.18,25,40,50,55,
60 సం॥లలో అస్వస్థత ,వేరు వేరు రూపాలలో
 గండాలు ఉంటాయి.పరమాయువు 80 సం॥లు.
ధనిష్ట జాతకులకు దాతృత్వం,ఉపకారగుణం,
రోష పౌరుషాలు,అధిక సంపాదనాభిలాశ,క్రీడలలో
 ఆసక్తి,దక్షత,కష్టపడే స్వభావం ఉంటాయి.
ఖండితంగా వ్యవహరిస్తారు.వ్యసన పరులౌతారు.
శ్వాస రుగ్మతలు రావచ్చు.ధనిష్ట లో పుట్టిన
మహిళలలకు దయ,కరుణ,పుణ్య కథలు వినే
ఆసక్తి ఉపకారగుణం ఉంటాయి.
శతభిషంః-అశ్విని నుండి 24 వ నక్షత్రం.
కుంభ రాశి.నక్షత్రాధిపతి రాహువు.రాహు దశ
 పూర్తి ప్రమాణమ్ 18 సం॥లు.తదుపరి
వరుసగా ,గురు16,శని19,బుధ17,కేతు7,
శుక్ర 20,రవి 6, చంద్ర 10,కుజ7 సం॥ల దశలు
అనుభవానికి వస్తాయి.ఏ పాదం లో పుట్టినా
 దోషం లేదు.
ఈ నక్షత్రం లో పుట్టిన జాతకులు బంధు వర్గానికి
ఉపకారం చేస్తారు.గౌరవ మన్ననలు పొందుతారు.
శత్రువుల పట్ల శాంత భావం,వ్యవహార ఙ్ఞానం,
నిజాయితి,వాక్చాతుర్యం,ధర్మ చింతన కల్గి ఉంటారు.
జీవిత భాగస్వామి పట్ల అభిమానం,ధీర్ఘాయుష్కులుగా
ఉంటారు.
పూర్వాభాద్రః- అశ్విని నుండి 25 వ నక్షత్రం.1,2,3 పాదాలు
 కుంభ రాశి లోను నాలుగవ పాదం మీన రాశి లోను ఉంటాయి.
నక్షత్రాధిపతి గురువు.గురు దశ పూర్తి ప్రమాణమ్ 16 సం॥లు.
తదుపరి వరుసగా శని19,బుధ17,కేతు7,శుక్ర 20,
రవి 6, చంద్ర 10,కుజ7 ,రాహు 18 సం॥ల దశలు
అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 90 సం॥లు.
12 వ రోజు,3,4,11,18,80 వ ఏట అపమృత్యు
 గండాలు ఉంటాయి.నక్షత్ర జనన దోషం ఉంది.
సామాన్య శాంతి చేసుకోవలెను.పురుషుడికి
దురలవాట్లు,ఉండడానికి అవకాశం ఎక్కువ.
అయినా ఔదార్యం,స్నేహ శీలం,దాన గుణం,
ఉపకారబుద్ధి ఉంటాయి.చెవి రుగ్మతలు రావచ్చు.
స్త్రీ జాతకురాలికి గురుదేవతా భక్తి,
పనులలో నేర్పరి తనం ఉంటాయి.
ఉత్తరాభాద్రః-అశ్విని నుండి 26 వ నక్షత్రం.
మీన రాశి. మీన రాశి అధితి గురువు.
నక్షత్రాధిపతి శని.శని దశ పూర్తి ప్రమాణం
19 సం॥లు. తదుపరి వరుసగా బుధ17,
కేతు7,శుక్ర 20,రవి 6, చంద్ర 10,కుజ7 ,
రాహు 18,గురు 16 సం॥ల దశలు అనుభవానికి
 వస్తాయి.పూర్ణాయువు 90 సం॥లు.
6 నెల అప మృత్యు భయం,12 వ ఏట జ్వర భీతి,
18 వ ఏట గండం ఉంటాయి. ఏ పాదం లో పుట్తినా
 దోషం లేదు.ఈ నక్షత్ర జాతకులకు ధైర్యం,నీతి,
నిజాయితీ,చాపల్యం,నెమ్మది,ఆలస్య స్వభావం
 వుంటాయి.ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది.
అభివృద్ధి చెంద గలరు.
రేవతిః-27 వ నక్షత్రం ఇది.మీన రాశి.నక్షత్రాధిపతి
బుధుడు.బుధ దశ 17 సం.లు.ఈ నక్షత్ర
జాతకులకు బుధ దశ తో జీవితం ప్రారంభం.
తదుపరి వరుసగా,కేతు7,శుక్ర 20,రవి 6, చంద్ర 10,
కుజ7 ,రాహు 18 , గురు 16,శని 19సం॥ల దశలు
 అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 85 సం॥లు.
5 వ రోజు, 5 వ ఏట,12,40,60 వ ఏట అపమృత్యు
గండాలు ఉంటాయి.రేవతి నక్షత్రం నాలుగవ పాదం
చివరి రెండు ఘడియలలో జన్మిస్తే  దోషం ఉంది.
దీనిని గండాంత కాలం అంటారు.నాలుగవ పాదం
 లో పుత్రుడు జన్మిస్తే తండ్రికి,శిశువుకు,
పుత్రిక జన్మిస్తే తల్లికి, శుశువు దోషం.
శాంతి కొరకు నక్షత్రజపం,రుద్రాభిషేకమ్
జరిపించుకొనవలెను.
ఈ నక్షత్రం లో పుట్టిన జాతకులు భాగ్య వంతులై
సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు.
మంచి రూపమ్,తేజస్సు,స్థూల శరీరం ఉంటాయి.
దూర దృష్టి గలవారు,పండితులు,
కళా నిపుణులు,అన్నదాతలు,పరోపకారులు
 కాగలరు.విదేశీ గమనావకాశాలు ఉంటాయి.
స్త్రీలు శారీరిక పుష్టి గలవారై ఆచార
 వంతులై ఉంటారు.
3.09.2015.
గ్రహ దృష్టులుః-జాతక పరిశీలనలో గ్రహ దృష్టులకు
 వివిధ పద్దతులు కలవు.
1.పరాశర పద్దతి.
2.జైమిని మతం లోపద్దతి.
3.తాజక మతం లో పద్దతి
4.పాశ్చాత్య పద్దతి లో పద్దతులు.
   ముఖ్యంగా మనం పాటించె పరాశర పద్దతి
ప్రకారం అన్ని గ్రహాలకు దృష్టి ఇలా ఉంటుంది.
అన్ని గ్రహాలకు తామున్న స్థానం నుండి
3,10 స్థానాలపై పాద దృష్టి(1/4),మరియు
5,9 స్థానాలపై అర్ధ దృష్టి(1/2),మరియు
4,8 స్థానాలపై త్రిపాద దృష్టి,7 వ స్థానంపై
పూర్ణ దృష్టి ఉంటాయి.
శ్లో॥పశ్యంతి సప్తమాన్సర్వే శని జీవ కుజాఃపునః
  విశేషతఃత్రిదశఃత్రికోణ శ్చతురష్టగాన్
పాద దృష్టీర్బలీ మందః అర్ధ దృష్టీర్బలీ గురుః
త్రిపాదో బలవాన్ భౌమఃసంపూర్ణే సకల గ్రహాః॥
అన్ని గ్రహాలకు సప్తమ దృష్టీ బలంగా ఉంటుంది.
అదనంగా శనికి 3,10 స్థానాలపై,గురునకు 5,9 స్థానాలపై
కుజునకు 4,8 స్థానాలపై పూర్ణ దృష్టి ఉంటుంది.
అనగా రవి,చంద్ర,బుధ శుక్ర,గ్రహాలకు తామున్న
 స్థానం నుండి 7 వ స్థానం పై, గురునకు 5,7,9
 స్థానాలపై,కుజునకు 4,7,8,శని కి 3,7,10 స్థానాలపై
పూర్ణ దృష్టి ఉంటుంది. విశేష దృష్టులు గురు కుజ
శనులకు మాత్రమే.ఎందుకని?
గురువు మేధావి.మంత్రి మరియు సదాచార పరాయణుడు.
మేధావి దృష్టి కి ఒక ప్రత్యేకత కలదు.ఆలోచనా శక్తి,
ఉపాసన(5),తృప్తి,పూర్వ పుణ్యం(9) లపై దృష్టి ఉండడం
సహజం.
కుజుడు సైన్యాధ్యక్షుడు.అతనికి ఆహారం,వాహనం(4),
ఆకస్మిక లాభం,ఆయువు(8) లపై దృష్టి ఉండడం సహజం.
శని సేవకుడు.ఇతనికి జన సహకారం(3).అధికారం
చెలాయించడం(10) ల పై దృష్టి ఉండడం సహజం.
కావున ఈ మూడు గ్రహాలకు విశేష దృష్టులు ఉన్నవి.
ప్రతి గ్రహం తానున్న రాశి భావం లెక రాశి నుండి
ఏడవ భావం,లేక రాశిని చూస్తుంది.
ఉదాహరణ కు ఒక వ్యక్తి మేష లగ్న జాతకుడై
నప్పుడు,తుల లో శని వున్నట్లైతే శని మేషాన్ని
7 వ ద్రిష్టి తో చూస్తాడు.మేష లగ్నానికి శని అశుభుడు
 కావున మేష లగ్నజాతకుని ఆరోగ్యం పై శని
ప్రభావం ఉంటుంది.
పురుష జాతకం లో లగ్నం తానైతే,సప్తమం(కళత్ర)
స్త్రీ.అదే విధంగా మనస్తత్వ శాస్త్రం స్త్రీ జాతకంలోలగ్నం తానైతే
సప్తమం పురుషుడు.పురుషులకు స్త్రీలయందు,
స్త్రీలకుపురుషులయందు ఉత్కంట ఉంటుందని
మనస్తత్వ శాస్త్రం చెపుతుంది.ఒక గ్రహం తాను
ఉన్న చోటు నుండి సప్తమ స్థానాన్ని చూడడం
ఈ మనస్తత్వ శాస్త్రం చెప్పే భావానికి సరిపోతుంది.

గ్రహ రాజ్య వ్యవస్థ-పలితాలు.
  కుజుడు-మేష వృశ్చికాలకు,శుక్రుడు
వృషభ తులకు,బుధుడు మిధునకన్యలకు,
కర్కాటకానికి చంద్రుడు,సింహం రవికి,
ధనుర్మీనాలకు గురువు,మకర కుంభాలకు
శని అధిపతులని ఇంతకు ముందు
చెప్పుకున్నాము.
అదే విధంగా గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా
రవిని రాజుగా,చంద్రుడు రాణి లేదా అసమర్థ
రాజుగా,కుజుడు సేనాధిపతిగా గురుని
 సమర్థుడైన న్యాయ బధ్ధమైన మంత్రిగా,
శుక్రుని న్యాయానికి తక్కువ ప్రాధాన్యం
ఇస్తూ కార్యం పూర్తి చేయించే మంత్రిగా,బుధుని
వ్యాపారం చేసుకునే దక్షుడిగా,
శనిని సేవకునిగా గుర్తిస్తారు.రాశి కారకత్వాలు
ఇంతకు క్రితమే చెప్పుకున్నాము.
ఈ రెండింటి(రాశి ,గ్రహ)కలయికలో
 రాశులను గమనిద్దాము.
సింహం-రవిః-సింహ రాశికి అదిపతి రవి.
రవి గ్రహ రాజు,సింహం మృగ రాజు.
సూర్యుడు స్యయం ప్రకాశం గలవాడై
మరొకరిపై ఆధార పడకుండ,లోకాలకు
మేలు చేసే వానిగా భావిస్తే, ఈ తత్వం
ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది.
తమపై తమకు ఉండే అత్యధిక ఆత్మ
విశ్వాసం వల్ల తమ నిర్ణయమే తుది నిర్ణయంగా
 ఉండాలని,తన్ను అనుసరించే అందరు
 మెలగాలనే తత్త్వమ్ ఈ రాశి వారిలో ఉంటుంది.
ఇది ఒక్కొక్క సారి మూర్ఖత్వంగా,మొండీ తనంగాను
 కూడా కనిపిస్తుంది.అయితే ఈ భావన బయటికి
కనపడ కుండా గంభీరంగా ప్రవర్తిస్తారు.అదే విధంగా
తమ లోపాలను బయటి వారికి కనిపించకుండా
 జాగ్రత్త పడుతారు.ప్రక్కవారి ఉన్నతి ని సహించరు.
ఇది స్పర్ధ గా ఉన్నంతవరకు బాగానే ఉన్నప్పటికి
అసూయగా మారి ఇబ్బంది పెడుతుంది.
తమ మనోభావాలు ఎవరికి చెప్పుకోక, ఎదుటి వారితో
 పంచుకుంటే చులకన అవుతామనే భావన అధికమ్
కావడం వలన హృదయ,మానసిక వ్యాధులకు కారణమ్
 అవుతుంది.కార్య నిర్వహణలో వీరు చక్కని శక్తి కలిగి
ఉంటారు.తమ ద్వారా చాలా మంది మేలుపొందాలని,
మళ్ళీ వారు తమకు కృతఙ్ఞులుగా,
అదుపాఙ్ఞలలో ఉండాలనే తత్వం వీరిలో
కనిపిస్తుంది.అవసరమైతే బెదిరించే తత్త్వం
కొన్ని సార్లు కనిపిస్తుంది.
గ్రహరాజు గాను,సింహానికి అధిపతిగను,
రవి గ్రహ కారకత్వాని కలిపి ఆలోచిస్తే పై
నిర్ణయాలన్ని మనకు  కనిపిస్తాయి.

కర్కాటకం-చంద్రుడుః
చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి.చంద్రుని
అసమర్థ రాజు గాను,రాణి గాను గుర్తించే సంప్రదాయం
 ఉంది.ఈ రాశి వారు అందరూ సహకరిస్తే తాము కూడ
 ఆధిపత్యం చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
కాని మానసికంగా సింహ రాశి అంత ధైర్యం కలిగిన
వారు కాదు.చంద్రుని లాగ స్వయం ప్రకాశం లేక
పోవడమ్,మరో గ్రహమ్ చుట్టు తిరగడం,కళలు మార్చుకుంటూ
 ఉండడమ్ అనే భౌతిక ప్రక్రియల ద్వారా ఈ రాశి వారు
 అవసరానుగుణంగా మెలగడం,అవకాశమున్న
 చోట తమ ఆధిక్యత చాటుకోవడం,మరొకరిపై
ఆధార పడే తత్త్వం,ప్రేమను పంచే లక్షణాలను
కలిగి ఉంటారు.చంద్రుడు రాత్రిపూట తన ప్రభావాన్ని
చూపించినట్టు,వీరు తమ పనులలో ఎక్కడో ఒక చోట,
ఏదో ఒక రూపం లో తమ ప్రత్యేకతను చూపిస్తుంటారు.
అసమర్థ రాజు వలే వీరిపై ఇతరుల ప్రభావం అధికంగా
 ఉంటుంది.అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తూ,
అందరిని మెప్పిస్తూ,వారిని కాదంటే తమ స్థానాన్ని
కోల్పోతమనే భయం ఉంటుంది.రాణి అనే భావన
 వలన కొంత ప్రెమ తోను,జల గ్రహం కావడం వలన
కొంత ఆకర్షణ తోనూ,చిన్న చిన్న బహుమానాలతో
అందరిని ఆకట్టు కొవాలనే ప్రయత్నం ఈ రాశి
వారిలోఅధికంగా ఉంటుంది. జల గ్రహం కావడం
వలన అందరూ తన మాట వినడం లేదనే భావన
 వల్ల మనస్సులో ఒత్తిడికి లోనై త్వరగా రోగాలకు
గురయ్యే అవకాశాలు ఎక్కువ.తనకు మానసికంగా,
శారీరికంగా ఇబ్బందులు కలిగినప్పుడు,
తమ వారందరు తన చుట్టూ ఉంటూ ప్రేమను
పంచాలని,తమకు ప్రాధాన్యం ఇవ్వాలనే భావన
మిగిలిన రాశుల వారికన్న వీరికి అధికం,మొత్తం మీద
 మాతృ ప్రేమ కలిగిన రాశిగా,నిర్ణయ శక్తి తక్కువ
ఉన్న రాశిగా,ఆకర్షణ కలిగిన రాశిగా ఈ రాశి ప్రత్యేకతను పొందింది.
మేష వృశ్చికాలు-కుజుడుః
మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపతి.
గ్రహ రాజ్య వ్యవస్థ రీత్యా సేనా నయకుడుగా
ఉండడం వలన మేష రాశి వారు నిర్ణయాల
అమలును అతి జాగ్రత్త గా పర్యవేక్షించే తత్త్వం
 కలిగిన వారై ఉంటారు.మరొకరి ఆధిపత్యం
సహించ లెరు.వీరి పనిలో మరొకరి ప్రమేయాన్ని
 కూడ ఒప్పుకోరు.ఇతరుల చేత పని చేయించడం
 వీరి ప్రత్యేకత.ఏదో ఒకపనిలో నిమగ్నమై పోవడం,
ఆ శ్రమలో ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొంటూ ఆశ్రమ
లోనే ఆనందం పొందే తత్త్వం వీరిది.మేష రాశి వారు
నిర్వహణలో అత్యుత్తమ స్థితిని,రక్షణ శాఖలో ప్రత్యక్ష
పాత్రను పోషిస్తుంటే ,వృశ్చిక రాశి వారు మాత్రం
నిఘా విభాగం లో ఉంటూ పరోక్ష పాత్రను పోషిస్తుంటారు.
మొత్తానికి కుజ ప్రభావ జనితులు తము ఉన్న విభాగంలో
సంపూర్ణ దృష్టితో వాటిని తమ సంస్థ లాగా భావిస్తూ వాటిని
ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ అందరితో చెయిస్తుంటారు.
13.09.2015
మిధున కన్యలు-బుధుడుః
మిధున కన్య రాశులకు బుధుడు అధిపతి.
బుధుడు జారిపోయే తత్త్వం గలవాడు.
గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా బుధుడు వ్యాపారస్తుడు.
వ్యాపారులు లెని చోట మన అవసరాలు తీరడం కష్టం.
బుధుడు అంటే పండితుడని కూడా అర్థం.
కాలానుగుణమైన నిర్ణయాలు తీసుకుంటూ పనులు
 పూర్తి చేసే సమర్థుడు బుధుడు.ఎవరిని ఇబ్బంది
పెట్టకుండా అందరి అవసరాలు తీరేటట్లుగా చూస్తూ
 తన లాభాలు చూసుకునే తెలివి ఇతనిది.అందరికి
అనుకూలంగా ప్రవర్తిస్తూ అందరి మన్ననలు పొందడం
 బుధుని ప్రత్యేకత.మిధునంలో వస్తువును కొనుగోలు
 చేయడమ్,కన్యలో అమ్మకపు శక్తి కనిపిస్తుంది.
ఇది కెవలం వస్తు విశయం లోనే కాకుండా అనేక
 ఇతర భావనల రూపంలో కనిపిస్తుంది.గ్రహించడం,
అందించడం అనే రెండు అంశాలు బుధుని ద్వారా
 జరుప బడుతాయి.అన్ని రంగాలలో తమకు పూర్తి పరిఙ్ఞానమ్
లేకున్నా,అవసరానుగుణంగా తమకున్న తెలివిని
 వినియోగించి అందరిని మెప్పించే ప్రత్యేకత వీరిది.
ధనుర్మీనాలు-గురుడు
ధనుర్మీన రాశులకు అధిపతి గురుడు.గ్రహ రాజ్య
వ్యవస్థ రీత్యా గురుడు సమర్థుడైన న్యాయబద్ధమైన
మంత్రి.అందరి మంచిని కోరుతూ,లోకానికి అవసరమైన
మంచిపనులు జరగడానికి అవసరమైన పరిశోధనలు
 చేయడంలో ముందడుగు వేసే తత్త్వం ధనుస్సు
 రాశిలో కనిపిస్తుంది.విషయాన్ని లోతుగా పరిశీలించడమ్,
మంచి చెడులను విశ్లేషించడం,మంచిని ప్రోత్సహించడానికి,
చెడును నిర్మూలించడానికి తగు ప్రణాళికలు
వేయడం కూడా గురుడు చేసే పని.అయితే తమ
ఆలోచనలను ప్రత్యక్షంగా కాకుండ మరొకరి ద్వారా
 అమలు పరచే ప్రయత్నం చేస్తారు.వీరికి పేరు కీర్తి పై
 ఎక్కువ కోరిక ఉండదు.వీరికి ఆర్భాటాలు, విలాసాలు,
ఆకాంక్షలు,కోరికలు ఎక్కువగా ఉండవు,కనీసావసరాలు
తీరే విధంగా సహకారం కావాలని కోరుకుంటారు.
నిరంతరమ్ పనిలో నిమగ్నమై లోకాన్ని కూడా
మరచి పోతారు.ధనుస్సులో ఇలాంటి లోతైన
 అంశాలు పరిశీలనలో ఉంటే,మీన రాశిలో తాము
గుర్తించిన విషయాలను వెంటనే వ్యక్తీకరించడానికి
ప్రయత్నం చేస్తారు.ఏదైనా ఊహే పరిశోధనలకు,
పరమాత్మ సన్నిధికి చేరడానికి మార్గమని భావించడం
ఈ గ్రహం వల్ల కలుగుతుంది.
గౌరవం పెంచుకోవడం గురు ప్రత్యేకత
14.09.2015
వృషభ తులలు-శుక్రుడు.
వృషభ తులా రాశులకు శుక్రుడు అధిపతి.శుక్రుడు కూడా గ్రహ రాజ్య వ్యవస్థ రీత్యా మంత్రి అయినప్పటికి,గురువుకు శుక్రునికి మౌలికమైన భేదాలు మనకు కనిపిస్తాయి.న్యాయ బద్ధమైన స్పష్టమైన జీవన విధానానికి గురువు ప్రతీక కా కనిపిస్తే అవసరానుకూలంగా నిర్ణయాలు తీసుకొంటూ అప్పటికప్పుడు సమస్యల నివారణకు ప్రయత్నం చేస్తూ నలుగురు మేలు చేసే తత్త్వం ఈ రాశిలో ఉంటుంది.పెద్దవారితోస్నేహ బాంధవ్యాలు పెంచుకొని,ఆ పరిచయం తో తమ పనులు పూర్తి చేసుకోవడమ్,ఇతరుల పనులు కూడ చేసి పెట్టడం వంటి మధ్య వర్తిత్వ బాధ్యతలు కూడ నెత్తిన వేసుకుంటారు.అందువలన ఒక్కొక్కప్పుడు ఇబ్బందులలో పడుతారు.అయితే తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డా వీరి మంత్రిత్వ స్థితి ఉత్తమంగా ఉండి అందరి మన్ననలను పొందుతారు.
మకర కుంభాలు-శనిః
మకర కుంభ రాశులకు శని అధిపతి.గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా శని సేవకుడు.సేవా తత్పరకు ప్రతీక శని. శాంతి కలిగించేవాడు శని.లోకంలో సేవను మించిన ధర్మం మరొకటి లేదు.మకరంలోను,కుంభం లోను గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా సేవా పరమైన భావనలే ఉన్నప్పటికి,కార్యాలయలలో,రాజ గృహలలో చేసే సేవకుల పనితీరు,సామాజిక సేవలు చేసే వారి తీరు వేరు వేరుగా ఉంటుంది.నిజమైన సేవా తత్త్వం తెలిసి ఆపదలోను,మంచి చెడులోసహకరిస్తూ ముందుకు వచ్చే వారంతా ఈ రాశులకు చెందిన వారవుతారు.కుంభ రాశి లో కొంచెం సౌఖ్యం కలిగిన సేవా తత్త్వం ఉంటే మకర రాశిలో శ్రమతో కూడుకున్న సేవలు ఉంటాయి.అహంకారం,అభిజాత్యమ్ లేకుండా నిస్వార్థంగా చేసే భగవంతుని సేవ, ఆసుపత్రులలో హృదయ పూర్వకంగా రోగులకు చేసే సేవ ఉత్తమమైన సేవ అవుతుంది.అటువంటి సేవలకు,తత్త్వానికి శని కారకుడు అవుతాడు.ఆ రాశులు అప్పుడు సేవా తత్త్వ రాశులుగా గుర్తింప బడుతాయి.
ఈ విధంగా రాశులను గ్రహ రాజ్య వ్యవస్థ రీత్యా,ఆధిపత్యాల రీత్యా వర్గీకరించ వచ్చు.ఈ విధంగా రాశిని విశ్లేషించడం వలన లోకం లో వ్యక్తుల రకాలు,వారి ఉపయోగాలు మనకు అవగతమవుతాయి.
మేష లగ్నం:--మేష లగ్నానికి అధిపతి కుకుజుడు.
లగ్నం ,దీనినే ప్రథమ భావం లేదా తను భావమ్ అని
కూడా పిలుస్తాము.తనువు అనగా శరీరం తను భావము
 నుండి మనస్సు ఆత్మ విశ్వాసము రూపమ్ ఙ్ఞానం,వర్ణం బలం
 దౌర్బల్యం సుఖ దుఃఖాలు పట్టుదల ఆశయాలు అభిరుచులు
 దృక్పతాలు తదితర అంశాలు లగ్న భావం నుండి పరిశీలించాలి.
అయితే మేష లగ్న జాతకులందరికి కుజుడే అధిపతి అయినా
 కూడ అందరి శరీరాలు రూపమ్ మొదలగు పైన చెప్పబడిన
అంశాలు ఒకే రకంగా ఉండవు.కుజుడు సమయమం
 లో మేషాది ద్వాదశ రాశులలో ఎక్కడైన ఉండ వచ్చు.
ఆయా స్థానాలు కేంద్రాలు, కోణాలు,ఉపచయ స్తానాలు,
షష్టాష్టమ వ్యయ స్థానాలా,లేదా కుజుని యొక్క ఉచ్చ, నీచ,
 మూల త్రికోణ స్థానాలలా లేదా కుజుడు శత్రు,మిత్రు క్షేత్రాలలో
ఉన్నాడా అనే దాన్ని బట్టి పలితం మారుతుంది. ఒక రాశిలో కూడ
 ఎన్నవ డిగ్రీలో ఉన్నాడు అని కూడా చూడాలి.లగ్న కుండలి లో
 ఒక్కొక్క రాశి 0-30 డిగ్రీలు. గ్రహాలు రాశి మధ్యలో ఉంటే (15 డిగ్రీలు)
 పూర్తి పలితాన్ని ఇస్తాయి అలాగే లగ్నంపై, కుజునిపై ఇతర గ్రహాల దృష్టి
వలన కూడ పలితం మారుతుంది.అలాగే లగ్నం లో ఉన్న గ్రహం బట్టి
 కూడ పలితం మారుతుంది.లగ్నం లో ఇన్నగ్రహం కుజుని మిత్రుడా,శత్రువా
 అతనిపై ఇతర గ్రహాల యతి లేదా యుతి ఉన్నదా పరిశీలించాలి
అలగే మేష లగ్నానికి అష్తమాధిపతి కూడా కుజుడే.అష్టమం ఆయుస్థానం
 మరియు మృత్యుస్థానమ్,మరియు ఆకస్మిక లాభాలు
 నష్టాలు,lottry లాంటివి,అష్టమం నుండి చూడాలి.
మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి శుక్రుడు.
ద్వితీయం ధన స్థానం.సప్తమం కళత్ర స్థానం (spouse).
కళత్రం అంటే భార్య లేదా భర్త,మగవారికైతే భార్యా స్థానం
 ఆడ వారికైతే భర్త స్తానమ్,ఇదే కాకుండ వ్యాపారం లో
 భాగ స్వామ్యం కూడా సప్తమ స్తానాన్ని బట్టి పరిశీలించాలి.
మేష లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బుధుడు.
తృతీయం సొదరీ సోదర వర్గం,పరాక్రమం.సేవకులు,
షష్టమం శత్రు రోగ రుణాలను తెలియ జేస్తాయి.
మేష లగ్నానికి చతుర్దాధిపతి చంద్రుడు.చతుర్థం ద్వారా
గృహం భూములు,వాహనం, తల్లి మొదలగు అంశాలు పరిశీలించాలి.
మేష లగ్నానికి పంచమాధిపతి రవి.పంచమం ద్వారా సంతానం విద్య
అనురాగం అత్మీయత మొదలగు అంశాలు పరిశీలించాలి.
మేష లగ్నానికి నవమ వ్యయాధిపతి గురుడు.
నవమం భాగ్య స్థానం.నవమం ద్వారా భాగ్యం,తండ్రి,
వారసత్వం ఉపాసనా బలం ప్రయాణాలు మొదలగు
 అంశాలు పరిశీలించాలి.
వ్యయం (12 స్థానం) ;- స్థానాన్ని బట్టి ధన వ్యయం,నిద్రాభంగం,
జన్మాంతర విషయాలు,శత్రు భయం,దేశాంతర వాసం
మొదలగునవి పరిశీలించాలి.
మేష లగ్నంః-మేష లగ్నానికి లగ్న అష్టమాధిపతి కుజుడు.ద్వితీయ సప్తాధిపతి శిక్రుడు,తృతీయ షష్టమాధిపతి బుధుడు,చతుర్థాధిపతి చంద్రుడు,పంచమాధిపతి రవి;నవమ వ్యయాధిపతి గురు;దశమ లాభాధిపతి శని.ఇప్పుడు ఆధిపత్యాల రీత్య మేష లగ్నానికి శుభులెవరు,అశుభులెవరు పరిశీలిద్దాం,
లగ్న అష్టమాధిపతి కుజుడు,లగ్నాధిపతి ఎప్పుడైనా మేలు చేస్తాడు కాబట్టి ఈ లగ్నానికి కుజుడు శుభుడు.మేష లగ్నానికి అష్టమాధిపతి కూడా కుజుడే,అయితే లగ్నాధిపతే అష్టామాధిపతి అయితే దోషం ఉండదనే సూత్రం అనుసరించి కుజుడు ఈ మేష లగ్నానికి శుభుడు.
 ద్వితీయ స్థానం,సప్తమ స్థానం మారక స్థానాలు.ఈ రెండింటికి అధిపతి అయిన శుక్రుడు మేష లగ్నానికి ప్రబల మారకుడు`.కేంద్రాధిపత్యం(4,7,10) శుభ గ్రహాలకు మంచిది కాదు అందువల్ల శుక్రుడు సప్తమ కేంద్రాధిపత్యం వల్ల అశుభుడు.అదేవిధంగా లగ్నాధిపతికి శుక్రుడు మిత్రుడు కాకపోవడం వలన ద్వితీయాధిపత్యం కూడా దోష పలితాన్నే ఇస్తుంది.తృతీయ షష్ట స్థానాలు రెండూ అశుభ స్థానాలే. అందువల్ల మేష రాశికి బుధుడు అశుభ పలితాన్నే ఇస్తాడు.అదికాకుండా బుధుడు కుజునికి మిత్రుడు కూడా కాదు.
చతుర్థాధిపతి చంద్రుడు.చంద్రుడు నైసర్గిక శుభగ్రహం.చతుర్థ కేంద్రాధిపతిగా చంద్రుడు ఈ లగ్నానికి ఇబ్బందికరమైన పలితాన్నిస్తాడు.అయితే చంద్రుడు లగ్నాధిపతి అయిన కుజునికి మిత్రుడు కావడం వలన దోష పలిత శాతం తక్కువగా ఉంటుంది.
కోణాధిపతులెవరైనా(5,9 స్థానాల అధిపతులు) ఎవరైనా మేలు చేస్తారు కాబట్టి పంచమ స్థానాధిపతి అయిన రవి మేష లగ్నానికి శుభుడు మరియు యోగ కారకుడు.అది కాకుండ కుజునికి రవి మిత్రుడు
మేష లగ్నానికి నవమ వ్యయాధిపతి గురువు కోణాధిపత్యమ్ వల్ల మేష లగ్నానికి గురువు శుభుడు.గురువు,కుజుడు మిత్రులు కావడం వలన గురువు యొక్క  వ్యయాధిపత్యం కూడ మంచిదే.అందువలన గురువు యోగ కారకుడు.
దశమ లాభాధిపతి శని.దశమ కేంద్రధిపతిగా నైసర్గిక పాపి అయిన శని ఈ లగ్నానికి శుభాన్నిస్తాడు.లాభాధిపతిగా ఏ గ్రహమైనా ఇబ్బందికర పలితాన్నే ఇస్తుంది.లగ్నాధిపతి అయిన కుజునికి శని తో మైత్రి అంతంత మాత్రమే.అందువలన శని మేష లగ్నానికి మిశ్రమ ఫలాలను ఇస్తుంది.
   ఈ విధంగా పరిశీలిస్తే మేష లగ్నం వారికి రవి,గురులు యోగ కారకులు.చంద్రుడు సమ పలితాన్నిస్తాడు.శని బుధ శుశుక్రులు ప్రబల మారకులు అవుతున్నారు.

వృషభ లగ్నంః
వృషభ లగ్నానికి గురు,రవి,చంద్రులు పాపులు.బుధ,శుక్ర,శనులు శుభులు.ఎలానో పరిశీలిద్దాం.
వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతి శుక్రుడు.షష్టాధిపత్యం మంచిది కాక పోయినా లగ్నాధిపతి కూడ అతడే కాబట్టి శుక్రుడు ఈ లగ్నానికి శుభ పలితాన్నిస్తాడు.ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కోణాధిపతి(5 వ స్థానం) కూడా కావడం వలన శుక్రునికి బుధునికి ఉన్న సాహచర్యం వల్ల ద్వితీయాధిపత్య దోషం తొలగి వృషభ లగ్నానికి బుధుడు శుభుడై యోగకారకుడవుతున్నాడు.
తృతీయాధిపతిగా  చంద్రుడు వృషభ లగ్నానికి దోష ప్రదుడు.
చతుర్థాధిపతిగా రవి పాపగ్రహం. కేంద్రాధిపత్యం వలన శుభ పలితాన్నిస్తున్నాడు.
ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా శుభగ్రహాలకు కేంద్రాధిపత్యం వస్తే అశుభపలితం పాప గ్రహాలకు కేంద్రాధిపత్యం వస్తే శుభ పలితం ఉంటుంది కావున రవి సింహ రాశ్యాధిపతి వృశభం నుండి నాలుగవ స్థానం(కేంద్ర స్థానం) కావున శుభ పలితం.కాని లగ్నాధిపతి శుక్రునితో రవికి స్నేహం లేక పోవడం వలన ఫలితం సామాన్యంగా ఉంటుంది.
సప్థమ వ్యయాధిపతిగా కుజుడు.సప్తమం కేంద్రస్థానం మరియు కుజుడు పాప గ్రహం కావడం వలన శుభుడే అయినా వ్యయాధిపతిగా శుభుడు కాడు,మరియు శుక్రునికి కుజునికి అతి స్నేహం లేక పోవడం వలన పూర్తి శుభ పలితాలను ఇవ్వలేడు.
అష్టమ లాభాధిపత్యాలు రెండూ మంచివి కావు,మరియు అష్టమ లాభాధిపతిఅయిన గురువు,శుక్రుల మధ్య శత్రుత్వం గురుడు ఈ లగ్నానికి దోష ప్రదుడు.
నవమ దశమాధిపతి అయిన శని  కోణాధిపతి(9)గా శుభ పలితాన్ని మరియు పాపగ్రహమై కేంద్రాధిపతిగా కూడా శుభ పలితాన్ని ఇవ్వడం వలన, శని శుక్రునికి మిత్రుడవడమ్ వలన ఈ లగ్నానికి శని యోగ కారక గ్రహమవుతున్నాడు.
ఈ విధంగా పరిశీలించిన తరువాత  వృషభ లగ్నానికి శని ,బుధుడు,శుక్రుడు యోగ కారకులు.రవి కుజ చంద్ర గురులు ఈ క్రమలో దోష ప్రదులవుతున్నారు.



మిధునంః
    మిధున లగ్నానికి బుధ శుక్రులుశుభులు,రవి గురు కుజ శని చంద్రులు అశుభులు.ఎలానో పరిశీలిద్దాం.
మిధున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి బుధుడు.చతుర్థాధిపత్యం శుభ గ్రహమైన బుధునికి ఏర్పడడం దోషమే అయినా లగ్నాధిపత్యం కూడ ఉన్నందువలన బుధుడు ఈ లగ్నానికి శుభ పలితాన్నిస్తాడు.ద్వితీయాధిపత్యం చంద్రునికి ఏర్పడడం వలన,లగ్నాధిపతికి చంద్రునికి సాహ చర్యం లేక పోవడం వలన చంద్రుడు అశుభ పలితాన్నిస్తాడు.తృతీయాధిపత్యం వలన రవి దోషపలితాన్నే ఇస్తాడు.
పంచమ వ్యయాధిపతిగా శుక్రుడు బుధునికి మిత్రుడు కావడం వలన,కోణాధిపత్యం వలన శుక్రుడు
మిధున లగ్నానికి ఒక యోగ కారకుడవుతున్నాడు.
షష్త లాభాధిపత్యాలు రెండూ మంచివి కావు.ఇటువంటి రెండు ఆధిపత్యాలు కుజునికి రావడం వలన,మరియు కుజుడు,లగ్నాధిపతికి మిత్రుడు కాక పోవడం వలన కుజుడు అశుభుడే అవుతున్నాడు.
అష్టమాధిపతి ఎవరైనా దోష పలితాన్నిస్తారు.అదే విధంగా నవమాధిపతి ఎవరైనా శుభ పలితాన్నిస్తారు.లగ్నాధిపతికి శని మిత్రుడు కావడం వలన శని సమ పలితాన్నిస్తాడు.
ఈ విధంగా అన్ని అంశాలను పరిశీలిస్తే మిధున లగ్నానికి బుధ శుక్రులు యోగ కారకులు.రవి,గురు కుజ చంద్రులు అశుభ పలితాన్నిస్తారు.శని సముడు.
కర్కాటక లగ్నంః
కర్కాటక లగ్నానికి లగ్నాధిపతిగా చంద్రుడు యోగ కారకుడు.ద్వితీయాధిపత్యం మంచిది కాక పోయినా ద్వితీయాధిపతి అయిన రవి చంద్రునికి మిత్రుడు కావటం వలన శుభ పలితాన్నిస్తాడు.
తృతీయాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు.వ్యయాధిపత్యం కూడా మిత్ర గ్రహానికి మంచిది.
చంద్రునికి బుధుడు మిత్రుడు, కాని బుధునికి చంద్రుడు ప్రబల శత్రువు కావడం వలన కర్కాటక లగ్నానికి బుధుడు శుభ పలితాన్నివ్వ లేడు.
చతుర్థ లాభాధిపతి శుక్రుడు.చతుర్థాధిపత్యం(కేంద్రం) శుభగ్రహమైన శుక్రునికి ఏర్పడడమ్ దోషం.లాభాధిపత్యం ఏ గ్రహానికున్నా దోషమే.చంద్ర శుక్రులు సమ గ్రహాలే కావున ఈ లగ్నానికి శుక్రుడు శుభ పలితాన్నివ్వలేడు.
పంచమ దశమాధిపతి కుజుడు.ఒకకోణం.ఒకటి కేంద్రం.కోణాధిపతిగా ఏ గ్రహమైనా శుభపలితాన్నిస్తుంది.కాబట్టి కుజుడు కోణాధిపతిగా శుభుడు.కేంద్రాధిపతి గా కుజుడు పాపా గ్రహం కావున శుభుడే,మరియు కుజుడు చంద్రునికి మిత్రుడు కావడం వలన కుజుడు ఈ కర్కాటక లగ్నానికి యోగ కారకుడు.
షష్ట నవమాధిపతి గురుడు.షష్తమాధిపత్యం మంచిది కాదు.నవమాధిపత్యం శుభపలితాన్నిస్తుంది.
లగ్నాధిపతి అయిన చందునికి,గురునికి మైత్రి ఉండడం వలన షష్టమాధిపత్య దోషం ఉన్నప్పటికి నవమాధిపత్యం వల్ల గురువు ఈ లగ్నానికి విశేష శుభ పలితాన్నిస్తాడు.
సప్తమ అష్టమాధిపతి శని.సప్తమాధిపత్యం అశుభ గ్రహమైన శనికి మంచిది.అదే విధంగా అష్టమాధిపత్యం ఏ గ్రహానికి మంచిది కాదు.శని చంద్రులు సములు.అందు వల్ల శని కర్కాటక లగ్నానికి సమ పలితాన్నిస్తాడు.
ఈ విధంగా ఆధిపత్యాలను విశ్లేషిస్తే కర్కాటక లగ్నానికి చంద్ర కుజ ,రవి, గురులు శుభ ప్రద గ్రహాలు.కాగా బుధ శుక్ర శని గ్రహాలు అశుభ పలితాన్నిచ్చే గ్రహాలవుతున్నాయి.

సింహ లగ్నంః
  సింహ లగ్నానికి శని బుధ శుక్రులు పాపులు.రవి కుజ గురు చంద్రులు ఆధిపత్య శుభ గ్రహాలు.
 లగ్నాధిపతి రవి సింహ లగ్నానికి యోగ కారకుడు.వ్యయాధిపత్యం మంచిది కాకపొయినా చంద్రునితో రవి కున్న మైత్రివల్ల చంద్రుడు ఈ సింహ లగ్నానికి శుభ పలితాన్నిస్తాడు.
ద్వితీయ లాభాధిపతి బుధుడు.రెండు ఆధిపత్యాలు మంచివి కావు, లగ్నాధిపతి అయిన రవికి మిత్రుడు కాక పోవడం వలన బుధుడు అశుభ పలితాన్నిస్తాడు.
తృతీయ దశమాధిపతి శుక్రుడు. తృతీయాధిపత్యం మంచిది కాదు,  దశమాధిపత్యం(కేంద్రం) శుభ గ్రహానికి దోష కారకం. లగ్నాధిపతి రవికి శుక్రుడు మిత్రుడు కాక పోవటం వలన సింహ లగ్నానికి శుక్రుడు శుభ పలితాన్నివ్వడు.
చతుర్థాధిపత్యం అశుభ గ్రహమైన కుజునికి మంచిది.నవమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిదే,కుజుడు రవి మిత్రులవడం వలన సింహ లగ్నానికి కుజుడు యోగ కారకుడు
పంచమ అష్టమాధిపతి గురువు.పంచమాధిపత్యం(కోణ స్థానం) గురువు లాంటి గ్రహాలకు చాలా మంచిది.అష్టమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిది కాదు.గురు రవి ల మధ్యన విశేష మైత్రి వలన అష్టమాధిపత్య దోషం కొంత కేవలం సింహ లగ్నానికి గురువు సమ పలితాన్నిచ్చే వాడవుతున్నాడు.
షష్ట సప్తమ అధిపతి శని.షష్టమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిది కాదు.సప్తమ కేంద్రాధిపత్యం నైసర్గిక అశుభ గ్రహాలకు మంచిది.లగ్నాధిపతి అయిన రవి,శనులు శత్రువులు కావడం వలన శని ఈ లగ్నానికి అశుభ పలితాన్నిస్తున్నాడు.
ఈ విధంగా సింహ లగ్నానికి రవి కుజ గురు చంద్రులు ఈ క్రమం లో ఆధిపత్య శుభ గ్రహాలు కాగా బుధ శుక్ర శనులు క్రమంలో మారకులు అవుతున్నారు.
కన్యాలగ్నంః
కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి బుధుడు.దశమాధి పత్యం శుభ గ్రహానికి మంచిది కాక పోయినా, లగ్నాధిపత్యం వల్ల బుధుడు ఈ లగ్నానికి శుభ పలితాన్నిస్తాడు.       ద్వితీయ నవమాధిపతి శుక్రుడు.ద్వితీయాధిపత్యం మిత్రుడైన శుక్రునికి మంచిదే.నవమాధిపత్యం(కోణ) ఏ గ్రహానికైనా శుభమే మరియు బుధ శుక్రులకున్న మైత్రివల్ల  శుక్రుడు ఈ కన్యా లగ్నానికి యోగ కారకుడు.
తృతీయ అష్టమాధిపతి కుజుడు.ఈ రెండూ ఆధిపత్యాలు దోష పలితాన్నే ఇస్తాయి.బుధునికి కుజునికి మైత్రి లేనందున కుజుడు ఈ లగ్నం వారికి మారకుడవుతున్నాడు.
చతుర్థ సప్తమాధిపతి గురువు.ఉభయ కేంద్రాధిపత్యాలు(4,7) శుభ గ్రహమైన గురునికి ఏర్పడడం మరింత దోష ప్రదం.బుధ గురుల మధ్య మైత్రి  అంతంత మాత్రమే కావున గురువు కన్యా లగ్నానికి శుభాన్నివ్వలేడు.
పంచమ షష్టమాధిపతి శని.పంచమాధిపత్యం ఎవ్వరికున్నా శుభ పలితాన్నిస్తారు.షష్టమాధిపత్యం ఎవ్వరికున్నా దోష ప్రదమే.అయితే శనికి బుధునికి ఉన్న సాహ చర్యం వల్ల కన్యాలగ్నానికి శని యోగ కారకుడవుతున్నాడు.
లాభాధిపత్యం(11) దోషయుతం.లాభాధిపతి అయిన చంద్రుడు బుధునికి ప్రబల శత్రువు కావడం వలన కన్యాలగ్నానికి చంద్రుడు అశుభ పలితాన్నిస్తాడు.
వ్యయాధిపతి రవి బుధునికి మిత్రుడు కాక పోవడం వలన  రవి ఈ లగ్నానికి దోష ప్రదుడే.
 ఈ విధంగా కన్యా లగ్నానికి బుధ శుక్ర శనులు శుభ ప్రద గ్రహాలు కాగా,కుజ గురు రవి చందులు ఆధిపత్య గ్రహాలు అవుతున్నారు.
తులా లగ్నంః
    తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు.అష్టమాధిపతి మంచి పలితాన్నిడు.కాని అతడే లగ్నాధిపతి అయితే తప్పని సరిగా శుభపలితాన్నిస్తాడు.కావున శుక్రుడు ఈ లగ్నానికి శుభుడు.
ద్వితీయ సప్తమాధిపతి కుజుడు.ద్వితీయాధిపత్యం మిత్రులకైతే ఉత్తమం.కుజుడు శుక్రునికి మిత్రుడు కాదు.సప్తమాధిపత్యం నైసర్గిక పాప  గ్రహలకుంటే శ్రేష్టం.అందువల్ల కుజుడు ఈ లగ్నానికి ఎక్కువ మంచి చేయలేడు.
తృతీయ షష్టాధిపతి గురువు.తృతీయాధిపత్యమ్,షష్టాధిపత్యం రెండూ దోష కారణాలు కావడం వలన,గురు శుక్రులు మిత్రులు కాకపోవడం వలన గురుడు ఈ తులా లగ్నానికి అశుభ పలితాలనిస్తాడు.
చతుర్థ పంచమాధిపతి శని.చతుర్థాధిపత్యం నైసర్గిక పాప గ్రహమైన శని కావడం మంచిది.పంచమాధిపత్యం(కోణ) ఏ గ్రహానికైనా మంచిదే.లగ్నాధిపతి అయిన శుక్రునికి పై రెండు ఆధిపత్యాలు కలిగిన శనికి మైత్రి అధికంగా ఉన్నందువలన శని ఈ లగ్నానికి యోగ కారకుడవుతున్నాడు.
నవమ వ్యయాధిపతి బుధుడు.నవమాధిపత్యం శుభగ్రహమైన బుధునికి మరింత మంచిది.వ్యయాధిపత్యం మిత్ర గ్రహాలకు  మంచిది.ఈ రెండు భావాలకు అధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి యోగ కారకుడు.
దశమ కేంద్రాధిపతి చంద్రుడు.దశమ కేంద్రాధిపత్యం శుభ గ్రహాలకు మంచిది కాకపోవటం,చంద్ర శుక్రుల మధ్య మైత్రి లేకపోవటమ్ వల్ల చంద్రుడు ఈ లగ్నానికి సమ పలితాన్నిస్తాడు.
లాభాధిపత్యం దోష ప్రదం.రవి శుక్రుల మధ్య శత్రుత్వం వల్ల లాభాధిపతి అయిన రవి తులా లగ్నానికి శుభ పలితాన్నివ్వ లేడు.
ఈ విధంగా పరిశీలించిన తరువాత తులా లగ్నానికి శని బుధ శుక్రులు యోగ కారకులుగా గురు రవి కుజ చంద్రులు ఆధిపత్యాల రీత్యా అశుభ పలితాన్నిస్తున్నారు.
వృశ్చిక లగ్నంః
లగ్న షష్టమాధిపతి కుజుడు.షష్టమాధిపత్యమ్ దోషప్రదమే అయినా లగ్నాధిపత్యం కూడా ఉండడం వలన కుజుడు ఈ లగ్నానికి యోగ కారకుడు.ద్వితీయ పంచమాధిపతి గురుడు.ద్వితీయాధిపత్యం మిత్ర గ్రహాలకు మంచిది.అదె విధంగా పంచమాధిపత్యం ఏ గ్రహానికైనా శ్రేష్టమే కావడం వలన గురుడు ఈ లగ్నానికి యోగ కారకుడు.      తృతీయ చతుర్థాధిపతి శని.తృతీయాధిపత్యం ఏ గ్రహానికైనా దొష ప్రదమే.చతుర్థాధిపత్యం నైసర్గిక పాప గ్రహాలకు మంచిది.శని కుజులకున్న మైత్రి తక్కువ కావడం వలన శని ఈ లగ్నానికి శుభాన్నివ్వలేడు.
సప్థమ వ్యయాధిపతి శుక్రుడు.సప్తమాధిపత్యం శుభ గ్రహాలకు మంచిది కాదు.వ్యయాధిపత్యం మిత్ర గ్రహాలకు మంచిది.లగ్నాధిపతి అయిన కుజునికి వ్యయాధిపతి అయిన శుక్రునికి మైత్రి లేనందున శుక్రుడు ఈ లగ్నానికి అశుభుడు.
అష్టమ లాభాధిపతి బుధుడు.అష్తమాధిపత్యం,లాభాధిపత్యం రెండూ దోష ప్రదాలే.అందువల్ల ఈ రెండు భావాలకు అధిపతి అయిన  బుధుడు కుజునికి మిత్రుడు కూడా కాక పోవడం వలన బుధుడు ఈ లగ్నానికి అశుభుడు.
నవమాధిపతి చంద్రుడు.నవమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిదే.చంద్రుడు కుజునికి మిత్రుడు కూడా కావడం వలలన్ ఈ లగ్నానికి చంద్రుడు యోగ కారకుడవితున్నాడు.
దశమాధిపతి రవి.దశమాధిపత్యం నైసర్గిక పాప గ్రహాలకు మంచిది.రవి లగ్నాధిపతి అయిన కుజునికి మిత్రుడవడం వలన రవి ఈ లగ్నానికి యోగ కారకుడు.
ఈ విధంగా వృశ్చిక లగ్నానికి గురు కుజ చంద్ర రవి యోగ కారకులగా శుక్ర బుధ శనులు అశుభ పలితాన్నిచ్చే వారవుతున్నారు.
ధనుర్లగ్నంః
లగ్న చతుర్థాధిపతి గురుడు.చతుర్థ కేంద్రాధిపత్యం దోష ప్రదమే అయినా లగ్నాధిపతి కూడా కావడం వలన గురుడు ఈ లగ్నానికి యోగ కారకుడు.
 ద్వితీయ తృతీయాధిపత్యాలు రెండూ శత్రుడైన శనికి ఉండడం వలన ఈ రెండూ ఆధిపత్యాలు దోష కారకాలు కావడమ్ వలన శని ఈ లగ్నానికి అశుభుడు.
పంచమ వ్యయాధిపతి కుజుడు గురునికి మిత్రుడు.పంచమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిది.వ్యయాధిపత్యం మిత్రగ్రహానికి మంచిది.అందువల్ల కుజుడు ఈ లగ్నానికి యోగ కారకుడు.
షష్ట లాభాధిపతి శుక్రుడు.షష్టమాధిపత్యం,లాభాధిపత్యం రెండు ఏ గ్రహానికైనా దోష ప్రదాలే.అదిగాక శుక్ర గురులు శత్రువులు కావడం వలన ధనుర్లగ్నానికి శుక్రుడు శుభ పలితాన్నివ్వ లేడు.
సప్తమ దశమాధిపతి బుధుడు.ఉభయ కేంద్రాధిపత్యదోషం వల్ల   శుభ గ్రహమైన బుధుడు వలన ధనుర్లగ్నానికి   శుభ పలితాన్నివ్వలేడు.
అష్టమాధిపతి చంద్రుడు.అష్టమాధిపత్యం ఏ గ్రహానికైనా దోషమే.అయినా లగ్నాధిపతి అయిన గురునికి అష్టమాధిపతి అయిన చంద్రునికి మైత్రి కారణంగా అష్టమాధిపత్య దోషం తగ్గిపోతుంది.అందువల్ల ఈ లగ్నానికి చంద్రుడు సముడు అవుతున్నాడు.
నవమాధిపత్యం ఏ గ్రహానికైనా శ్రేష్టమే.నమవాధిపతి అయిన రవి లగ్నాధిపతి అయిన గురునికి మైత్రి ఉన్నందువలన రవి ఈ లగ్నానికి యోగ కారకుడు.
ఈ విధంగా విశ్లేషించిన తరువాత ధనుర్లగ్నానికి రవి ,గురు,చంద్ర కుజులు యోగ కారకులు కాగా,శని బుధ శుక్రులు అశుభ పలితాన్నిస్తున్నారు.
మకర లగ్నంః
    లగ్న ద్వితీయాధిపతి శని.లగ్న ద్వితీయాధిపతులు ఒకరే కావడం వలన శని ఈ లగ్నానికి శుభుడు.తృతీయ వ్యయాధిపతి గురుడు.తృతీయాధిపత్యం మంచిది కాదు.వ్యయాధిపత్యం మిత్ర గ్రహాలకు మాత్రమే మంచిది.లగ్నాధిపతితో స్నేహం లేకపోవడం వలన గురుడు ఈ లగ్నానికి శుభ పలితాన్నివ్వలేడు.
చతుర్థ లాభాధిపతి కుజుడు.చతుర్థాధిపత్యం(కేంద్రం) పాప గ్రహమైన కుజునికి ఉండడం శ్రేష్టం.కాని కుజుడు శనికి శత్రువు కావడం వలన అది అంత యోగాన్నివ్వదు.అదే విధంగా లాభాధిపత్యం కూడా సాధారణ పలితాన్నిస్తుంది.అందువల్ల కుజుడు ఈ మకర లగ్నానికి సమ లపలితాన్నిస్తాడు.
పంచమ దశమాధిపతి శుక్రుడు.పంచమాధిపత్యం ఏ గ్రహానికైన శ్రేష్టం.కాని దశమాధిపత్యం నైసర్గిక శుభ గ్రహమైన శుక్రునికి మంచిది కాదు.కాని శుక్రుడు లగ్నాధిపతి అయిన శనికి మిత్రుడు కావడం వలన ఈ లగ్నానికి శుక్రుడు శుభ పలితాన్నిస్తాడు.
షష్టమాధిపతి నవమాధిపతి బుధుడు.షష్టాధిపతి ఎవరైనా అశుభులే.నవమాధిపతి ఎవరైనా  శుభ పలితాన్నిస్తారు.మకర లగ్నానికి బుధుడు మిత్రుడు కావడం వలన శుభాశుభాలు సమానంగా ఉంటాయి.
సప్తమ కేంద్రాధిపతి చంద్రుడు శుభ గ్రహం కావడం వలన శుభ పలితాన్నివ్వలేడు.అందువలన చంద్రుడు ఈ లగ్నానికి యోగ కారకుడు కాదు.
అష్టమాధిపతి ఎవరైనా దోషాన్నే ఇస్తారు.విశేషించి లగ్నాధిపతి శనికి రవి శత్రువు కావడం వలన ఏ మాత్రం శుభ పలితాన్నివ్వలేడు.
ఈ విధంగా పరిశీలిస్తే మకర లగ్నానికి శని శుక్ర బుధులు ఆధిపత్య శుభులు కాగా,కుజ చంద్ర రవులు క్రమంలో మారకులవుతున్నారు.




కుంభ లగ్నంః
    లగ్న వ్యయాధిపతి శని. లగ్నాధిపతి ఎవరైనా ఆ లగ్నానికి శుభ పలితాన్నిస్తారు.లగ్నాధిపతే వ్యయాధిపతి  కావడం వలన శని ఈ లగ్నానికి  సాధారణ శుభ పలితాన్నిస్తాడు.ద్వితీయ లాభాధిపతి గురుడు. ద్వితీయాధిపత్యం  మిత్ర గ్రహాలకు మాత్రమే మంచిది.లగ్నాధిపతితో స్నేహం లేకపోవడం లాభాధిపత్యం కూడా దోష ప్రదమే కావడం  వలన గురుడు ఈ లగ్నానికి అశుభ పలితాన్నిచ్చే వాడవుతున్నాడు.
తృతీయ దశమాధిపతి కుజుడు.తృతీయాధిపత్యం ఎవరికైనా మం
చిదికాదు.దశమాధిపత్యం నైసర్గిక అశుభ గ్రహమైన కుజునికి ఉండడం మంచిది.
కాని కుజుడు శనికి శత్రువు కావడం వలన అది అంత యోగాన్నివ్వదు.అదే విధంగా లాభాధిపత్యం కూడా సాధారణ పలితాన్నిస్తుంది.అందువల్ల కుజుడు ఈ కుంభ  లగ్నానికి మధ్యమ మైన పలితాలను ఇస్తాడు.
చతుర్థ నవమాధిపతి  శుక్రుడుచతుర్థాధిపత్యం నైసర్గిక శుభ గ్రహమైన శుక్రునికి మంచిది కాదు.నవమాధిపత్యం ఏ గ్రహానికైన శ్రేష్టం. శుక్రుడు లగ్నాధిపతి అయిన శనికి మిత్రుడు కావడం వలన ఈ లగ్నానికి శుక్రుడు ఒక యోగ కారకుడవుతున్నాడు.
పంచమ అష్టమాధిపతి  బుధుడు. పంచమాధిపతి ఎవరైనా శుభులే.అష్టమాధిపతి ఎవరైనా అశుభ పలితాన్నిస్తారు. కుంభ  లగ్నానికి బుధుడు మిత్రుడు కావడం వలన శుభాశుభాలు సమానంగా ఉంటాయి.
షష్టమాధిపతి చంద్రుడు.షష్టమాధిపతి ఎవరైనా అశుభ పలితాన్నిస్తారు. అది కాక చంద్రుడు శనికి మిత్రుడు కాక పోవడం వలన చంద్రుడు ఈ లగ్నానికి యోగ కారకుడు కాదు.
సప్తమాధిపత్యం నైసర్గిక అశుభ గ్రహమైన శనికి మంచిదే అయినా,
లగ్నాధిపతి శనికి రవి శత్రువు కావడం వలన ఏ మాత్రం శుభ పలితాన్నివ్వలేడు.
   ఈ విధంగా పరిశీలిస్తే కుంభ  లగ్నానికి  విశేశ యోగ కారకులుగా ఏ గ్రహం లేనప్పటికి, శని శుక్ర బుధులు క్రమంలో శుభ పలితాన్నిస్తారు,గురు,కుజ చంద్ర రవులు క్రమంలో దోష పలితాన్నిస్తున్నారు.
మీన లగ్నంః
 లగ్న దశమాధిపతి గురుడు.
   మీన లగ్నానికి లగ్న దశమాధిపతి గురుడు.లగ్నాధిపతి ఎవరైనా యోగ కారకుడే.దశమాధిపత్యం(కేంద్రం) శుభ గ్రహాలకు మంచిది కాదు..గురుడు లాంటి గ్రహాలకు విశేష దోశ ప్రదమే అయినా లగ్నాధిపత్యం ఉండడం వల్ల గురుడు ఈ లగ్నానికి శుభ పలితాల నిస్తాడు.
ద్వితీయ నవమాధిపతి కుజుడు. ద్వితీయాధిపత్యం మిత్ర గ్రహమైన కుజునికి ఉండడం వలన కుజుడు యోగ కారకుడు.అదే విధంగా నవమాధిపత్యం ఏ గ్రహానికున్నా విశేష శుభ పలితాన్నిస్తుండడం వలన కుజుడు శుభపలితాన్నిస్తాడు.
తృతీయ అష్టమాధిపతి శుక్రుడు.రెండు ఆధిపత్యాలు దోష ప్రదాలే.శుక్రుడు లగ్నాధిపతికి శత్రువైనందువలన మీన లగ్నానికి శుక్రుడు అశుభ పలితాలనే ఇస్తాడు.
చతుర్థ సప్తమాధిపతి బుధుడు. చతుర్థ సప్తమ కేంద్రాదిపత్యాలు నైసర్గిక
అశుభ గ్రహాలకు మంచిది.కాని బుధుడు నైసర్గిక శుభ గ్రహం.
అందువల్ల బుధుడు ఈ లగ్నానికి శుభాన్నివ్వలేడు.
పంచమాధిపత్యం ఉన్న చంద్రుడు గురువుకు మిత్రుడైనందు వలన ఈ లగ్నానికి విశేష యోగ కారకుడవుతున్నాడు.షష్టాధిపతి రవి.షష్టాధిపత్యం ఎవ్వరికైనా మంచిది కాదు,కాని రవి లగ్నాధిపతికి మిత్రుడవడం వలన సాధారణ శుభ పలితాన్నిస్తాడు.
లాభ వ్యయాధిపత్యాలు రెండు చెడ్డవే.ఈ రెండింటికి అధిపతి అయిన శని లగ్నాధిపతి అయిన గురునికి మిత్రుడు కాక పోవడం వలన కూడా శని మీన లగ్నానికి అశుభ పలితాన్నే ఇస్తాడు.
ద్వాదశ లగ్నాలు- ఆధిపత్య శుభా శుభ గ్రహాలు.
గ్రహాలను  శుభ ,అశుభ  గ్రహాలు  అని రెండు రకాలుగా విభజించవచ్చు.
అయితే ఇందులో మళ్ళీ రెండు విధాలుగా విభజన చేయడమైనది.
1.నైసర్గిక శుభ గ్రహాలు-నైసర్గిక అశుభ (పాప) గ్రహాలు.
2 ఆధిపత్య శుభ గ్రహాలు-ఆధిపత్య పాప గ్రహాలు.
 నైసర్గిక శుభ పాప గ్రహాలు- జ్యోతిషం లో ఒక గ్రహం
శుభ పలితం ఎప్పుడు ఇస్తుంది,అశుభ పలితం ఎప్పుడు ఇస్తుంది,
 తెలుసుకోవాలంటే పై రెండు అంశాలను పరిశీలించాలి
గురు,,శుక్రులు  ఇవి రెండు పూర్తి  నైసర్గిక శుభ గ్రహాలు.
బుధుడు స్వయంగా శుభ పలితాన్నివ్వడు,పాప పలితాన్నివ్వడు.తటస్తుడు.
కాని  శుభ గ్రహాలతో కూడి ఉన్నప్పుడు శుభుడు.
పూర్ణ చంద్రుడు శుభుడు,(శుక్ల అష్టమి నుండి కృష్ట అష్టమి వరకు)
ఇక పాప గ్రహాలలో
కుజ, శని, రాహు, కేతు పాప గ్రహములు.
వీరితో కలిసి యున్న బుధుడు కూడ పాప గ్రహమే.
క్షీణ చంద్రుడు (కృష్ట అష్టమి నుండి శుక్ల అష్టమి వరకు) పాప గ్రహం
రవి కౄర గ్రహమ్ అగుట వలన పాప గ్రహంగా పరిగణించ నైనది.
శుభత్వ పాపత్వములు సహజ లక్షణములు.
అయితే  గ్రహలు లగ్న కుండలి లో ఒక్కొక్క భావానికి
 ఆధిపత్యం వహించడం వలన  ఆధిపత్య స్థానముల
 వలన శుభ పాపత్వములు ఏర్పడును.
అందుచే లగ్న కుండలిలో ఒక్కొక్కప్పుడు నైసర్గిక శుభ గ్రహాలైన
 గురు,శుక్రులు కూడ పాప పలితాన్నిస్తారు. నైసర్గిక పాపులైన కుజ శనులు కూడ
ఒక్కొక్కప్పుడు వారి వారి ఆధిపత్యంచే,వారున్న స్థానాన్ని బట్టి శుభ పలితాన్నిస్తారు.
కాబట్టి లగ్నకుండలి లో ఒక్కొక్క లగ్నానికి (మేషం నుండి మీనం వరకు)
శుభ అశుభ గ్రహాలేవో తెలుసుకుందాం.
ఇప్పుడు రాశులు-అధిపతులు మళ్ళీ ఒకసారి చూద్దాం.

గ్రహాలు- ఆధిపత్య శుభా శుభ సూత్రాలు.
లగ్నాలకు ఆధిపత్యాల రీత్యా శుభాశుభ గ్రహాలను,
 యోగ కారక గ్రహాలను నిర్ణయించడానికి
కొన్ని ప్రత్యేకమైన సూత్రాలున్నాయి.వాటి ననుసరించి
ఒక్కో లగ్నానికి శుభాశుభ గ్రహ పలితాలను నిర్ణయించవచ్చు.
లగ్నాన్నించి లెక్కిస్తే 1,4,7,10 స్థానాలను కేంద్రములని,
1,5,9 స్థానాలను కోణ స్థానాలని పేర్కొంటాంము.
ఒకటవ స్థానం అనగా  అనగా లగ్నం.ఇది కేంద్రము మరియు కోణ స్థానము.
  (1)లగ్నానికి 5,9 స్థానిధిపతులు ఎవ్వరైనా శుభులే
నైసర్గిక పాపులైన శని కుజులు కూడా లగ్న జాతకులకు శుభ పలితాన్నిస్తారు.
ఉదాహరణకు తులా లగ్నానికి 5 స్థానం అయిన కుంభ రాశి
అధిపతి శని శుభ పలితాన్నిస్తాడు.అలాగే ధనుర్లగ్నానికి
 5 స్థానం అయిన  మేష  రాశి అధిపతి కుజుడు
 శుభ పలితాన్నిస్తాడు.
(2).నైసర్గిక శుభ గ్రహాలు, లగ్నానికి కేంద్రాదిపతులైతే
 (అనగా 4,7,10 స్థానలకు అధిపతులైతే)
శుభ పలితాన్నివ్వవు.
అలాగే నైసర్గిక పాప గ్రహాలు(ఉదా.కుజ శని)
కేంద్రాదిపతులైతే (అనగా 4,7,10 స్థానలకు
 అధిపతులైతే పాప పలితాన్నివ్వడు.
 3. గ్రహమైనా కోణాధిపతి అయితే శుభ పలితాన్నిస్తాడు.
4. గ్రహమైనా 3,6,11,8,12  స్థానాలకు అధిపతి
 అయితే అశుభ పలితాన్నిస్తారు.
5.కాని అష్టమాధిపతి ఒకవేళ లగ్నాధిపతి కూడ
అయి వున్నట్లైతే అతడు శుభ పలితాన్నిస్తాడు.
ఇది మేష తులా రాశులకు వర్తిస్తుంది.ఉదాహరణకు
 మేష రాశికి లగ్నాధిపతి కుజుడు అలాగే 8 స్థానాధిపతి
 అయిన వృశ్చిక రాశ్యాధిపతి కూడ కుజుడే.అందువలన
 కుజుడు మేష లగ్నానికి శుభాన్ని కలిగిస్తాడు.
(6).  2-12 స్థానాధిపతులు అనగా లగ్నానికి ముందు వెనక
ఉన్న రాశ్యాధిపతులు లగ్నాధిపతి తో సాహచర్యం వల్ల
 శుభాశుభ పలితాన్నిస్తారు.
7.గ్రహాలలో రవి చంద్రులు తప్ప మిగతా గ్రహాలకు
 రెండేసి ఆధిపత్యాలున్నాయి.
కుజ---మేషం,వృశ్చికం, శనిమకర కుంభాలు
గురు---ధనుర్మీనాలు, శుక్రుడువృషభం,తులా
బుధుడు-మిధునం-కన్యలు 
గ్రహాల కుండే రెండు ఆధిపత్యాలలో ఒకటి బాగా ఉండి
రెండవ ఆధిపత్యం దోష ప్రదమైనప్పుడు గ్రహం ఇచ్చే పూర్తి పలితం
లగ్నాధిపతి తో గల శత్రు మిత్రత్వాలపై ,
మరియు గ్రహం ఉన్న స్తానాన్ని బట్టి ఆధార పడి ఉంటుంద
8.కేంద్రాలలో (1,4,7,10) శుభ గ్రహాలు ఉండడం మంచిది.
కోణాలలో (5,9) ఉండే శుభ గ్రహాలు ఎల్లప్పుడు శుభాన్నిస్తాయి.
కోణాలలో (5,9) ఉండే పాప గ్రహాలు భావానికి ఆధిపత్యం కలిగి
 ఉన్నాయో భావాన్ని సంపూర్ణంగా వృ ద్ధి చేసి
కోణ భావ పలితాన్ని పాడు చేస్తాయి
కేంద్రాలలో  ఉండే పాప గ్రహాలు  భావానికి ఆధిపత్యం
 కలిగి ఉన్నాయో భావాన్ని  వృ ద్ధి చేసి
కేంద్ర భావ పలితాన్ని పాడు చేస్తాయి.
అందుకే పాప గ్రహాలకు కేంద్రాధిపత్యం మంచిది.
కాని కేంద్ర స్థితి  (కెంద్రాలలో ఉండడం) మంచిది కాదు.
సూత్రాల రీత్యా మేషాది ద్వాదశ లగ్నాలకు యోగ కారక గ్రహాలను,
 మారకులను బాధకులను నిర్ణయించే అవకాశం ఉంది.

భావం-భావాధిపతులు-భావ కారకులుః
భవం అంటే పుట్టుక.మనస్సులో పుట్టేది కాబట్టి అది భావం.జాతకం లోని 12 భావాలు జీవితం లోని చాలా అంశాలకు ప్రతీకలు.జ్యోతిష పలితాలన్ని మనస్సుకు సంబంధించినవే.భావంలో శుభాలు,అశుభాలుఅన్ని రకాలు ఉంటాయి.
భావాలు మొత్తం 12.అవి.1.తనుభావమ్.2.ధన భావం 3.భాతృ లేక తృతీయ భావం 4.చతుర్థ భావం 5.పుత్ర భావం 6.రోగ లేక శత్రు భావం 7.కళాత్ర లేదా సమాజ భావం 8.ఆయుర్భావం 9.భాగ్య భావం.10.రాజ్య భావం 11 లాభ భావం. 12.వ్యయ భావం.