Monday 29 October 2018

స్వస్తిక్ చిహ్నం విశిష్టత*

*జై శ్రీమన్నారాయణ-జై శ్రీ హనుమాన్*

*స్వస్తిక్ చిహ్నం విశిష్టత*

స్వస్తికం మన ప్రాచీన ధర్మానికి ప్రతీక.
ఇది సమగ్ర మంగళప్రద భావనకు సూచన.

సు+అసు ధాతువు నుంచి *స్వస్తిక* వచ్చింది.
మంచి అస్తిత్వం, శక్తి అని అర్థం.

ఏ శుభకార్యాన్నైనా ఈ స్వస్తిక్ మంత్రంతోనే ప్రారంభిస్తాము.

శ్లో" స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తిన పూషా విశ్వవేదాః,
స్వస్తినస్తార్ష్యో అరిష్టనేమిః
స్వస్తినో బృహస్పతిర్దధా.

తా" గొప్ప కీర్తి కలిగిన ఇంద్రుడు మాకు శుభములిచ్చుగాక.
విశ్వజ్ఞాన స్వరూపుడైన పూష (సూర్యుడు) మాకు శుభము లిచ్చుగాక.
అమోఘములైన ఆయుధములు కలిగిన గరుడుడు మాకు శుభము లిచ్చుగాక.
బృహస్పతి మమ్ము రక్షించుగాక.

అనేక సందర్భాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని పసుపు కుంకుమతో తయారు చేసి ప్రవేశ ద్వారాల వద్ద అలంకరిస్తారు.

అక్షరాలలో ఓంకారమెంత పవిత్రమో, వేదసారమో అలానే స్వస్తిక్ చిహ్నం కూడా అవుతుందని శ్రీరాముడు వరమిచ్చినట్లు పురాణాల్లో ఉంది.

ఇంకా స్వస్తికుడనే రాజు రావణ గర్వభంగం చేసి లంకలో స్వస్తికాకృతిలో భవనాలు నిర్మించుకునేటట్లు చేశాడని ఐతిహ్యం ఉంది.

*స్వస్తిర్భవతు*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home