Saturday 29 September 2012

శాంతి మన్త్రం

                             #  ఓం ।గం గణపతయే నమః॥ #        

     మంత్రం॥పర్యాప్తా అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమహర్భవతి ।      సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వంజయతి।। 

              ఓం శాంతిః శాంతిః శాంతిః॥






                  అన్ని పూజాదికాలలో చివరిగా చెప్పబడు ఈ మంత్రము లో అతిరాత్రం అనబడే యాగమ్ గురించి  చెప్పబడింది.

       పర్యాప్త్యా=అపారమైన్ ,అనంత అయాయ=తరగని సంపద పొందడానికి, సర్వస్తోయః =తరగని కీర్తి పొందడానికి అతిరాత్రమ్=అతిరాత్రం అనబడే అనే యాగం ఉత్తమ=ఉత్తమమైనది, తేన=ఈ యాగమ్ వలన సర్వస్వజిత్యై=అన్ని విజయాలు, సర్వమేవ=సమస్తమూ   ఆప్నొతి=పొందబడుతుంది, సర్వం జయతి=సర్వము   పోషింప బడుతుంది.
     భావముః- తరిగిపోని అపార  సంపద పొందడానికి, తరగని కీర్తి పొందడానికి, అతిరాత్రమని పేర్కొనబడే యాగము,   అతిశ్రేష్టమైన  యాగం. ఈ యాగం ద్వారా  సమస్తమూ సిద్దిస్తుంది. సకల విజయాలు కలుగుతాయి.సర్వమూ పొందబడుతుంది.సర్వమూ పోషింపబడుతుంది.

Sunday 16 September 2012

అఘమర్షణ సూక్త్ం(ప్రాయశ్చిత్త మంత్రం).

వేద కాలంలో సచ్చీలమూ,నిజాయితీ ఎంతో ప్రాధాన్యం వహించాయి.పాపం క్షోభ వంటివి సహించబడలేదు.దుష్టుల నుండి కానుకలను, దానాలను  ఏవైనా పుచ్చుకోవడమ్  జరిగితే ఎంతో పాపం గా పరిగణించే వారు.దానికొరకై ప్రాయశ్చితమ్ అన్వేషించేవారు.
శ్లో॥  ఓం॥హిరణ్యశృఙ్గం వరుణమ్ ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః ।  యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః ।
       బంగారు కిరీటం ధరించిన వరుణ దేవుణ్ణి శరణు పొందుతాను.ప్రార్థిస్తూన్న నాకు తీర్థఫలాన్ని
 అనుగ్రహించు.దుష్టుల వస్తువును అనుభవించడం జరిగింది,వారి నుండి కానుకలను సైతం పుచ్చుకొని
  ఉన్నాను కనుక.
 శ్లో॥యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం । తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సవితా చ పునన్తు పునః పునః॥
       మనస్సుతోను, మాటలతోను చేతలతోను నా వలననో నావారి వలననో చేయబడిన పాప     కృత్యాలను ఇంద్రుడు,వరుణుడు,బృహస్పతి ,సూర్యుడు  పూర్తిగా పునీతం చెయుదురు గాక!
శ్లో॥అత్యాశనా-దతీపానా-ద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహత్। తన్నో వరుణో రాజా పాణినాహ్యవమర్శతు.॥
    మితిమీరి తినడం ,మితిమీరి త్రాగడం దుష్టుల నుండి కానుకలను పుచ్చుకోవడం లాంటి పాపాలను
     రాజైన వరుణుడు తన స్వహస్తాలతో తుడిచి వేయు గాక.
 
 
 

Labels: