Tuesday 4 May 2021

జ్యోతిషం -ప్రాధమిక అంశాలు

 

శ్రీ గణాధిపతయే నమః

శ్రీ హయగ్రీవాయ నమఃశ్రీ మహా సరస్వత్యై నమః

శ్లోఙ్ఞానానంద మయం దేవం,నిర్మలస్ఫటికాకృతిమ్

ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ ముపాస్మహే

జ్యోతిషం -ప్రాధమిక అంశాలు

Fundamentals in Jyotisham in Telugu

for beginners

నక్షత్రాలు-రాశులు { naxatraalu-raashulu}

STARS- ITS POSITION in  ZODIAC CONSTELLATION

నక్షత్రాలు 27 .  ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది.

పాదాలనే చరణం అని కూడా అంటారు.ఒక్కొక్క పాదాని ఒక అక్షరం తో లేదా ఒక పేరుతో సూచిస్తాము.

ఒక్కొక్క నక్షత్ర వ్యవధి లేదా నిడివి సుమారు 24 గం.లు..కాని ఒక్కొక్కసారి 26 గం.లనుండి 22 గం.లవరకు మారుతుంటుంది. ఆయా నక్షత్ర సమయము లో పుట్టిన వ్యక్తి కి  ఆయా పాదాల పేరు జన్మ నామం అవుతుంది.. ఇలా పుట్టిన సమయాన్నిబట్టి నిర్ణయించ బడేది జన్మనామం. బార సాల రోజు , 21 రోజు లేదా  నామ కరణం రోజు తల్లి తండ్రులు పెట్టేది వ్యవహార నామం. జ్యోతిశ పరంగా ముహుర్తాలు నిర్ణయించుకోవడానికి  జన్మ నామం ను పరిగణన లోకి తీసుకోవడం అవుతుంది. (అయితే  కొన్ని సందర్భాలలో జన్మ నామం తో పాటు  వ్యవహారం కూడ అవసరముతుంది.)

 మొదటి నక్షత్రం అశ్విని.ఇందులో నాలుగు పాదాలు.

 1.చు 2.చె 3. చో  4. ల.

 గుర్తు పెట్టుకోవడానికి, చుక్కయ్య,చెన్నయ్య,చొక్కయ్య,లక్ష్మయ్య  అని గుర్తు పెట్టుకోవచ్చు.

 అశ్విని నక్షత్ర వ్యవధిని నాలుగు భాగాలు చేయగా మొదటి భాగం లో పుట్టిన వ్యక్తి జన్మ నామం చుక్కయ్య లేదా చుక్కమ్మ అని రెండవ భాగము లో పుట్టిన వ్యక్తి జన్మ నామం చెన్నయ్య లేదా చెన్నమ్మ  అని మూడవ  భాగం లో అయితే చొక్కయ్య చొక్కమ్మ అని  ఇలాగే నాలుగవ భాగం లో అయితే లక్ష్మయ్య లేదా లక్ష్మి అని జన్మ నామం చెప్పడం జరుగుతుంది.

 

    

నక్షత్రాలు- వాటి పాదాలు

{naxatraalu-paadaalu) stars- and its 4 parts in jyotisham

 

1.    చు  చె చొ ల …….అశ్విని    { చుక్కయ్య, చెన్నయ్య, చొక్కయ్య,లక్ష్మయ్య}

2.    లీ లు లే లో……….భరణి.      { లింగయ్య, లుక్కయ్య,

          లేగయ్య లోకయ్య }

3.      ఈ ఊ ఏ………….కృత్తిక   అనంత, ఈశ్వర,    

                ఉమ,ఏకాంబర }

4.     ఓ వా వీ వు………...రోహిణి    { ఓంకారం, వామన్,     

                                వీరాజు, వూటూరి }

5.    వే వో కా కి…………. మృగశిర   { వెంకటయ్య, వోగయ్య,     

                                       కాంతం, కిష్టయ్య}

6.     కు ,ఘం,ఙ్ఞ చ… ….ఆర్ద్ర       { కుర్మయ్య, ఘంటయ్య,

                                        ఙ్ఞానయ్య, చక్రయ్య}

7.     కే కో హా హీ ……..పునర్వసు    { కేసయ్య, కోనయ్య,

                                   హనుమయ్య, హిమవంతు}

8.     హూ  హే హో డ ….పుష్యమి   { హుతాశన, హేరంభ,

                                     హోతయ్య, డక్కయ్య}

9.     డీ  డు డే డో…………....ఆశ్లేష     { డిక్కయ్య,

                           డుక్కయ్య, డేగయ్య డోగయ్య}

10.    మా  మీ  మూ  మే..….మఘ   {మల్లయ్య మీనయ్య

                                                 ముక్కంటి,మేఘన}

11.     మో  టా టి   టు .. …..పుబ్బ   {మోహిని, టాకయ్య,

                                             టిక్కయ్య, టుక్కయ్య}

12.    టే టో పా పి   ……..ఉత్తర      { టెక్కయ్య, టొక్కయ్య

                                        పాపయ్య పిచ్చయ్య }

13.     పూ ష ణ ఠ………...హస్త        {మల్లయ్య,షణ్ముఖుడు,

                                            ణణ్ణాజి, ఠక్కరుసు }

14.     పే   పో రా  రి………చిత్త        {పెద్దయ్య,పోతయ్య,

                                           రామయ్య రిక్కమ్మ }

15.     రూ  రే రో త ……..స్వాతి.      { రుక్కమ్మ రేణుక,

                                         రోచిష్ణు, తమ్మయ్య  }

16.     తీ   తు  తే  తో....విశాఖ        {తిక్కయ్య తుక్కమ్మ     

                                             తేగయ్య తోటమ్మ }

17.    నా  నీ  ను నే..…..అనూరాధ   {నాగయ్య నీలిమ

                                        నూకాలమ్మ నేమయ్య}

18.    నో యా  యీ  యు…  జ్యేష్ట     { నోకయ్య యామిని  

                                  యీలయ్య యుగావతి}

19.    యే   యో బా  బి…..మూల…….{ యేశయ, యోగయ్య

                                      బాలమ్మ బిందు }

20.    బూ  ధా  భా  ఢా…. పూర్వాషాడ  { బుచ్చయ్య,                    

                               దామోదర, భాస్కర్, డాక్టర్}

21.    బే  బో జా  జి…ఉత్తరాషాడ         {బేకయ, బోగయ్య

                                      జానయ్య జిక్కయ్య}

22.    జు  జే జో ఖ…..శ్రవణం.         {జుక్కయ్య జేజమ్మ

                                            జోగయ్య  ఖన్నా}

23.    గా  గి  గూ  గే ….ధనిష్ట         { గంగయ్య గిరిధారి,

                                       గుండయ్య,గేయయ్య}

24.    గో  సా  సీ  సు…..శతభిషమ్  { గోపయ్య సాంబయ్య

                                          సీనయ్య సుధాకర్ }

25.    సే  సో దా  ది….పూర్వాభాద్ర   {సేనయ్య సోమయ్య

                                             దాశరధి దినకర్}

26.     దు  శం ఝా  థ …ఉత్తరా భాద్ర  { దుర్గ,                            

                     శంకరుడు      ఝంకారుడు, థక్కయ్య}

27.    దే దో చా  చి ..రేవతి              { దేవయ్య, దొండయ్య

                                        చామంతి చింతామణి}

 

          మొత్తం  27 నక్షత్రాలు 27X4= 108 పాదాలు.

       ఈ 108 పాదాలను 12 భాగాలుగ విభజించి ఒక్కొక్క భాగానికి ఒక రాశి పేరు  పెట్టడం జరిగింది. ఒక్కొక్క రాశిలో ౯ పాదాలు.        

రాశులు.. 12..  అవి

1.    మేషమ్

2.    వృశభం

3.    మిధునమ్

4.    కర్కాటమ్   

5.    సింహమ్, 

6.     కన్య, 

7.    తుల 

8.    వృశ్చికమ్

9.    ధనుస్సు

10.  .మకరమ్,  

11.   కుంభం   

12.   మీనం.

పై 108 పాదాలను 12 రాశులకు విభజించగా ఇలా ఉంటాయి.

 

1.      చూ   చే  చో ల .లీ లు లే లో   ఆ  ……… మేషం.

2.      ఈ    ఊ  ఏ ఓ వా వీ   వు  వే వో …….వృషభం.

3.      కా కి కూ ఘం ఛ  కే కో హా………...  మిధునం.

4.     హీ  హూ  హే హో డ  డీ డు డే డో…………..కర్కాటకమ్

5.    మా మీ  మూ  మే  మో  టా టి   టు టే….  సింహం.

6.     టో పా పి   పూ ష ణ ఠ, .పే   పో… ……కన్య 

7.     రా  రి .రూ రే రో త తీ  తు తే … ………. తు ల 

8.    తో .నా  నీ  ను నే  నో యా  యీ  యూ……  వృశ్చికం

9.    యే   యో బా  బి.బూ  ధా  భా  ఢా  బే……. ధనుస్సు

10.   బో జా  జి జు  జే జో ఖ .గా  గి…………మఖరం

11.     గూ  గే .గో  సా  సీ  సు, సే  సో దా …..….కుంభం.

12.     ది  దు  శం  ఝా  థ దే దో చా  చి….…….మీనం

 

      నక్షత్రాల పరంగా ఇలా అన్వయించుకోవచ్చు

 

1.    అక్ష్విని, భరణి కృత్తికాః పాదం….మేషం

అనగా అశ్విని 4 పాదాలు భరణి 4 పాదాలు కృత్తిక ఒక పాదం కలిసి మేష రాశి అవుతుంది.

2.    కృత్తికాఃస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ద్రం… వృషభం

కృత్తికా మిగతా 3 పాదాలు రోహిణి 4 పాదాలు మృగశిర మొదటి రెండు పాదాలు వృషభం

3.    మృగశిరార్ద్రం ఆర్ద్ర పునర్వసు త్రయోర్మిధునమ్.

మృగశిర మిగతా రెండు పాదాలు ఆర్ద్ర 4 పాదాలు పునర్వసు 3 పాదాలు  కల్సి మిధునం

4.     పునర్వసు పాదం పుశ్యమి ఆశ్లేషాంతం కర్కాటకం .

పునర్వసు మిగతా ఒక పాదం  పుష్యమి  4 పాదాలు  ఆశ్లేష 4 పాదాలు కల్సి  కర్కాటకం

 

       ఇప్పటివరకు మొత్తం 27 నక్షత్రాలలో మొదటి   9 నక్షత్రాలు 4 రాశులలో చేర్చబడినవి. అందుచే ఈ మొదటి తొమ్మిది నక్షత్రాలను అనగా అశ్విని నుండి ఆశ్లే ష వరకు ప్రధమ నవకము గా పేర్కొన బడుతుంది.

 

5.     మఘ పుబ్బ ఉత్తరాః పాదం సింహం

మఘ -4 పాదాలు,పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం కల్సి సింహ రాశి

 

6.     ఉత్తరాస్త్రయోఃపాదమ్ హస్తమి చిత్తార్ద్రమ్ …కన్య

ఉత్తర మిగతా మూడు పాదాలు హస్త 4 పాదాలు చిత్త మొదటి రెండు పాదాలు  కన్య రాశి

7.     చిత్త్రార్ధం స్వాతి విశాఖాఃత్రయస్తులా।

చిత్త మిగత రెండు పాదాలు స్వాతి 4 పాదాలు విశాఖ మూడు పాదాలు తులా రాశి

8.     విశాఖపాదం అనూరాధ జ్యేష్టాంత్యం… వృశ్చికం.

విశాఖ చివరి(4 వ) పాదం, అనురాధ 4 పాదాలు,జ్యేష్ట 4 పాదాలు  వృశ్చిక రాశి.

 

          9 నక్షత్రాలు (10 నుండి 18 వరకు} 4 రాశులలో చేర్చబడినవి.ఈ రెండవ

  తొమ్మిది నక్షత్రాలను అనగా మఘ  నుండి జ్యేష్ట  వరకు ద్వితీయ  నవకము గా పేర్కొన బడుతుంది.

 

9.     మూలా పూర్వాషాడ ఉత్తరాషాడ పాదం… ధనుస్సు

మూల 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు, ఉత్తరాషాడ మొదటి పాదం కల్సి ధనుర్రాశి.

10.   ఉత్తరాషాడాఃస్త్రయో పాదం శ్రవణ ధనిష్టార్ధం. మకరం..                                                            ఉత్తరాషాడ మిగతా 3 పాదాలు శ్రవణం 4 పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు మకరం.

11.     ధనిష్టార్ధం శతభిషం పూర్వాభాద్రఃస్త్రయః…కుంభం

            ధనిష్ట మిగతారెండు పాదాలు, శతభిషం 4    

    పాదాలు పూర్వా భాద్ర మొదటి 3 పాదాలు కుంభం

12.  పూర్వాభాద్ర పాదమ్ ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం

      పూర్వాభాద్ర  చివరి పాదం ఉత్తరాభాద్ర 4     

        పాదాలు,రేవతి నాలుగు పాదాలు మీన రాశి.

 

         9 నక్షత్రాలు (19 నుండి 27 వరకు} 4 రాశులలో చేర్చబడినవి.ఈ  మూడవ నవకం.

  తొమ్మిది నక్షత్రాలను అనగా మూల  నుండి రేవతి   వరకు  తృతీయ  నవకము గా పేర్కొన బడుతుంది..

 

 తొందరగా గుర్తుపెట్టుకోవడానికి ఈ  12 వాక్యాలు  కంఠస్థం చేయాలి.

1.    అశ్విని, భరణి కృత్తికాః పాదం….మేషం

2.    కృత్తికాఃస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ద్రం… వృషభం

3.    మృగశిరార్ద్రం ఆర్ద్ర పునర్వసు త్రయోర్మిధునమ్.

4.     పునర్వసు పాదం పుశ్యమి ఆశ్లేషాంతం కర్కాటకం .

5.     మఘ పుబ్బ ఉత్తరాః పాదం సింహం

6.     ఉత్తరాస్త్రయోఃపాదమ్ హస్తమి చిత్తార్ద్రమ్ …కన్య

7.     చిత్త్రార్ధం స్వాతి విశాఖాఃత్రయస్తులా।

8.     విశాఖపాదం అనూరాధ జ్యేష్టాంత్యం… వృశ్చికం.

9.     మూలా పూర్వాషాడ ఉత్తరాషాడ పాదం… ధనుస్సు

10.   ఉత్తరాషాడాఃస్త్రయో పాదం శ్రవణ ధనిష్టార్ధం…. మ కరమ్

11.     ధనిష్టార్ధం శతభిషం పూర్వాభాద్రఃస్త్రయః…కుంభం

12.    పూర్వాభాద్ర పాదమ్ ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం

జాతకం:-సంస్కృతం లో “జ” అనే అక్షరానికి  పుట్టుక అని అర్థం.

జాత అనే శబ్దానికి కూడా పుట్టుక అనే అర్థం ఉంది.జాతుడు,

జాతి మొదలైన పదాలన్ని పుట్టినవి అనే అర్థంలోనే వాడ బడుతున్నాయి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం  శిశువు పుట్టిన సమయంలో లగ్నాన్నిమరియు

ఆకాశం లోని గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆ యా రాశుల ద్వారా గమనించి

వేసుకునే రాశుల పట్టికనే “జాతకం”అని అంటాము.నిజానికి జాతకం అనే

 అంశాన్ని కేవలం రాశి చక్రం అనే అర్థమ్ లోనే కాకుండా ఇతరమైన

నవాంశ,భావ చక్రం,వింశోత్తరి దశలు,అష్టక వర్గు,షోదశ వర్గు మొదలైన

చక్రాలన్నింటికి కలిపి వాడటం మనకు కనిపిస్తుంది.జాతక చక్రం లో  తరువాత

మార్పులు లేనప్పటికి మారే దశలు,గోచారాదులు మొదలగు వాటి ద్వారా

జాతకుడి భావి జీవితం లో కలిగే మార్పులను సూచించడం వీలౌతుంది.

లగ్నం:-లగ్నం అంటే కలయిక అని అర్థం.అమరకోశం ప్రకారం

“రాశీనాం  మేషాదీనాం ఉదయో లగ్నముచ్యతే”

.మేషాది రాశుల యొక్క ఉదయం లగ్నం అనబడుతుంది.

భూమి తన చుట్టు తాను పడమర నుండి తూర్పు వైపు  తిరుగడం వల్ల

 అన్ని నక్షత్రాలులు, వానిని కలిగి ఉన్న రాశులు తూర్పున ఉదయించి

 పడమరన అస్తమించినట్లు కనిపిస్తాయి.

    ఒక్ నిర్దిష్టమైన ప్రదేశం లో నిర్దిష్టమైన సమయంలో 

  భూమి ఆకాశాలు తూర్పు వైపు లగ్నమై(కల్సినట్లుగా)

   కనిపించే ప్రదేశాన్ని “లగ్నం” అంటాము.

రాశిః-మన పూర్వీకులు మనకు రాత్రి చుట్టూ కనపడే నక్షత్ర మండలాన్ని

12  రాశులు గా విభజించారు.రాశి అనే శబ్దానికి  గుంపు అని అర్థం.

 మనకు కనపడే ఈ పన్నెండు రాశుల సముదాయమును రాశి చక్రం

లేదా “భ”చక్రమ్ అని కూడా అంటాము. .ఇది మనకు కనపడే

 ఆకాశ భాగం లో ఒకక   వృత్త పరిధిలో కనిపిస్తుంది .

కాబట్టి గణిత శాస్త్రం ప్రకారం 360  డిగ్రీలున్న ఈ రాశి చక్రాన్ని

12  సమాన భాగాలుగ విభజించ బడింది.ఒక్కో విభాగానికి .

.360/12=30 డిగ్రీలు ఉంటాయి.అవే మేషాది రాశులు.

 

 

 

 సంఖ్య/sign     రాశి           డిగ్రీలు  

1.       1. Aries       మేషం …     .    0-30

2.     2. Taurus……వృషబం  …..  ..30-60

3.      3.Gemini…  మిధునం …. ….60-90

4.      4.Cancer…  కర్కాటకమ్ …….90-120

5.      5.Leo……    సింహం …. ……120-150

6.      6.Virgo………కన్య  …….…..150-180

7.      7.Libra…….…తుల…….…...180-210

8.      8.Scorpion…..వృశ్చికం….….210-240

9.      9.Sagittarus…..ధనుస్సు….…240-270

10.    10.Capricorn…. మకరం……..270-300

11.     11.Aquarious.…కుంభం………..300-330

12.    12.Pisces………మీనం.…….330-360

 

  రాశుల కన్నా నక్షత్రాలే ముందుగా ఆకాశం

 లో గమనించడం జరిగింది.ప్రతి రోజు రాత్రి

పూట చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరగా

 కనిపిస్తున్నాడో ,ఆ నక్షత్రాన్ని

 ఆ రోజు నక్షత్రంగా సూచించడం

 జరుగుతుంది. ఆ రోజు నక్షత్రం వేరు

కార్యక్రమాలకు బాగుందో లేదొ చూడడం

ముహూర్త భాగం ప్రత్యేకత.ఆలాగే వ్యక్తుల

 జన్మ నక్షత్రాలకు,ఆ రోజు నక్షత్రం వరకు

లెక్కించి (9 నవకాలుగా)చూసి

 తారా బలం బాగుందా లేదా పరిశీలించడం

 కూడ ముహూర్తం నిర్ణయం లో ముఖ్యమైన అంశం.

 

చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం

చెపుతుంది.చంద్రుడున్న నక్షత్రం,చంద్రుడున్న

 రాశి తత్త్వాలు మన మనస్తత్వాని నిర్దేశిస్తున్నాయి.

మనస్సు లోని భావాలను అధ్యయనం

 చేయడానికి ఇదొక మార్గం.

రాశి అధిపతి,నక్షత్రాధిపతి,నవాంశాధిపతుల

మైత్రి,శత్రుత్వాల ఆధారంగా జాతకుడి ఫలితాలు

నిర్ణయించ బడుతాయి.ఇప్పుడు ఇవి అశ్విన్యాది

నక్షత్రాల వారిని సూక్ష్మంగా పరిశీలిద్దాము.

 

1).అశ్వినిః-అశ్విని నక్షత్రాధిపతి కేతువు.

ఈ నక్షత్రం లో పుట్టిన వారికి కేతు మహాదశ

 తో ప్రారంభం అవుతుంది.కేతుదశ

పూర్తి ప్రమాణం.7 సం॥లు.ఆ తరువాత

శుక్ర దశ 20 సం॥,రవి 6 సం॥,చంద్ర

 దశ 10 సం॥కుజ 7 సం॥,రాహు 18 సం॥,

గురు 16 సం॥ శని 19 సం॥ బుధ 17 సం॥ల

దశలు అనుభవానికి వస్తాయి.

పూర్ణాయు ప్రమాణం 96 సం॥,అయితే

అశ్విని ప్రారంభ రెండు ఘడియలు గండ కాలము.

ఈ నక్షత్ర జాతకులు సాధారణంగా

ఆకర్షణీయంగా ఉంటారు.అందరికి ప్రేమ పాత్రులుగా

స్నేహ భావం తో ప్రవర్తిస్తారు.నెర్పుతో పనులు

చక్క బెట్టుకుంటారు.నగలు ఆభరణాల మీద మోజు

 ఎక్కువ.అయితే దుర్జన సాంగత్యం వల్ల

చిక్కులు తెచ్చుకుంటారు.చపలత్వం,లోభ గుణం

కొద్దిగా కనిపిస్తాయి.స్థూల శరీరం,ధీర్ఘ హస్తాలు,

సూక్ష్మ నాసిక,విశాల నయనాలు,మంచి రూపం

ఉంటుంది. అయితే అవయవాల తీరు,గుణ

గణాలు నక్షత్ర పా దాలను బట్టి,లగ్నం గ్రహస్థితి ని బట్టి మారవచ్చు..

నక్షత్రాధిపతి కేతువు ఙ్ఞాన కారకుడు..మంత్ర శాస్త్రం,వేదాంతం,

తంత్ర,జ్యోతిష, యోగ శాస్త్రాల పట్ల దైవ ఉపాసన పట్ల ఆసక్తి కలిగిస్తాడు.

అలాగే వైరాగ్యం,అధ్యాత్మికం,ఙ్ఞానం లభిస్తాయి..మశూచి,స్పోటకమ్,

కడుపునొప్పి, నెత్ర వ్యాధి, వ్రణాలు ఇత్యాది రుగ్మతలు,

సంప్రదాయ భిన్నమైన ప్రవర్తన,చపల బుద్ధి,అన్య మతాల వారితో

చెలిమి అల్ప భోజనం మొదలగు అంశాలు కేతువు పరిధి  లోకి వస్తాయి.

కేతు యొక్క అనుకూల దశ అంతర్దశ లలో

మంచి పలితాలు,ప్రతికూల దశ,అంతర్దశలలోచెడు ఫలితాలు కనిపిస్తాయి.    

 

2)..భరణిః నక్షత్రాల వరుసలో రెండవది.

మేష రాశి.భరణి నక్షత్రానికి అధిపతి

శుక్రుడు.అధిదేవత యముడు.ఈ నక్షత్రం లో

పుట్టిన వారికి శుక్ర మహా దశ తో జీవితం

ప్రారంభం అవుతుంది.శుక్రదశ పూర్తి

 ప్రమాణం 20 ఏళ్ళు.తరువాత రవి 6,చంద్ర 10

కుజ 7 రాహు 18,గురు 16,శని 19,బుధ 17,

కెతు 7 సంవత్సరాలు వరుసగా అనుభవానికి

వస్తాయి.

పరమ ఆయుప్రమాణం 85 సం॥లు.

భరణి నక్షత్రం లో పుట్టిన వారు

సత్యవాదులు ధర్మ ప్రవర్తనులు,అలంకార

ప్రియులు,కళాభిరుచి గలవారు,

సుఖవంతులు అవుతారు,మంచి ఆహారం

 నిద్ర అనుభవించుతారు.

నక్ష్తత్రాధిపతి శుక్రుడు కళత్ర కారకుడు,

లలిత కళలు,వాహన సౌకర్యం,దాంపత్య

సుఖం ఆభరణాలు,సేవకసౌకర్యం

కలిగిస్తాడు.ప్రతి కూల దశ,అంతర్దశ ల లో

 కుటుంబ లోపళ్,తల్లికి లేదా భార్యకు

 అనారోగ్యం,వ్యాపారం లో నష్టం,కలహాల

 కాపురం కలుగుతాయి.

 

3) కృత్తికః-మొదటి పాదం మేష రాశిలో,

2,3,4 పాదాలు వృషభరాశిలో ఉంటాయి.

రాశి ప్రకారం మేషానికి కుజుడు,వృషభానికి

 శుక్రుడు అధిపతులు.కృత్తక కు నక్షత్రాధిపతి

రవి.అధి దైవం అగ్ని. ఈ నక్షత్రం లో పుట్టిన

వారికి రవి మహా దశ తో జీవితం ప్రారంభం

 అవుతుంది.రవి దశ పూర్తి ప్రమాణం

6 ఏళ్ళు.తరువాత చంద్ర 10 కుజ 7

 రాహు 18,గురు 16,శని 19,బుధ 17, 

కెతు 7 శుక్ర 20 సంవత్సరాలు వరుసగా

 అనుభవానికి వస్తాయి.పూర్ణ ఆయుప్రమాణం

80 సం॥లు.కృత్తిక నక్షత్రం లో జన్మించిన

 వారికి  మంచి శరీర కాంతి,తెలివితేటలు,

వాక్చాతుర్యం,బంధు ప్రీతి,సుఖ సంపదలు

 ఉంటాయి.స్వశక్తి తో సంపాదించి జీవిస్తారు.

 

4). రోహిణి.ః-ఇది 4 వ నక్షత్రం.వృషభ రాశి.

నక్షత్రాధిపతి చంద్రుడు.అధిదైవం ప్రజాపతి.

ఈ నక్షత్రం లో పుట్టిన వారికి చంద్ర మహా దశ

 తో జీవితం ప్రారంభం అవుతుంది.చంద్ర

దశ పూర్తి ప్రమాణం 10 ఏళ్ళు.తరువాత కుజ 7,

రాహు 18,గురు 16,శని 19,బుధ 17,కెతు 7,

శుక్ర 20,రవి 6 సంవత్సరాలు వరుసగా

అనుభవానికి వస్తాయి.పరమ ఆయు

ప్రమాణం 80 సం॥లు.

ఈ నక్షత్ర జాతకులకు ఆకర్షణీయమైన

రూపం,కార్య నైపుణ్యం,మాటలో నేర్పు,

కలుపుగోలు తనమ్,స్థిరమైన బుధ్ధి,చిన్న

 నుదురు కలిగి ఉంటారు.కంటి జబ్బులకు

లోనయ్యే అవకాశమెక్కువ.

 

5).మృగశిరః-1,2 పాదాలు వృషభ రాశిలో,

3,4 పాదాలు మిధునం లో ఉంటాయి.మిధున

రాశి అధిపతి బుధుడు,మృగశిర నక్షత్రాధిపతి

కుజుడు.అధి దైవతం చంద్రుడు. ఈ నక్షత్రం లో

 పుట్టిన వారికి కుజ మహా దశ తో జీవితం

ప్రారంభం అవుతుంది.కుజ దశ పూర్తి

 ప్రమాణం 7 ఏళ్ళు.ఒక్కొక్క పాదం 21 నెలలు

హరీంచగా మిగిలిన కుజ దశ అనుభవానికి

 వస్తుంది.తరువాత రాహు 18,గురు 16,శని

 19,బుధ 17,కెతు 7,శుక్ర 20,రవి 6,

చంద్ర 10 సం॥ లు వరుసగా అనుభవానికి

 వస్తాయి.పరమ ఆయుప్రమాణం 80 సం॥లు.

మృగశిర నక్షత్ర జాతకులకు ఉత్సాహం,ధైర్య

 సాహసాలు,పాపభీతి,మాత్రు భక్తి,శాస్త్ర విఙ్ఞానమ్,

స్వాభిమానం,తీవ్ర విమర్ష,అవివెకం,

ఉన్నత వక్షస్థలం,విశాలమైన భుజాలు

ఉంటాయి.చపలత్వమ్ అధికం,

పెత్తనమ్ వహించగలరు.

 

6). ఆరుద్రః-ఆరుద్రకు అధిపతి రాహువు.

ఈ నక్షత్రం లో పుట్టిన వారికి రాహు

మహా దశ తో జీవితం ప్రారంభం

అవుతుంది.రాహు దశ పూర్తి ప్రమాణం

 18 ఏళ్ళు.ఒక్కొక్క పాదాని నాలుగున్నర

ఏళ్ళూ గతించగా మిగిలిన రాహు దశ

 అనుభవానికి వస్తుంది.తరువాత

గురు 16,శని 19,బుధ 17,కెతు 7,శుక్ర 20,

రవి 6,చంద్ర 10,కుజ 7 సం॥ లు వరుసగా

 అనుభవానికి వస్తాయి.పరమ ఆయు

ప్రమాణం 70 సం॥లు.ఈ నక్షత్ర జాతకులకు

 క్రయ విక్రయాలలో నైపుణ్యం ఎక్కువ.

కాల నియమాలు పాటిస్తారు.చలన

చిత్ర రంగం,ఫోటోగ్రఫీ,ప్రింటింగ్,ఎక్ష్‍రే,

ప్లానులు,డిజైనులు,రికార్డింగ్‍ అనుకూలం,

కొంచెం గర్వం,తామస గుణం,చేసిన మేలు

 మరిచే చపలత్వం ఉంటుంది.

అక్రమ వ్యాపారానికి సంకోచించరు.

 

7). పునర్వసుః-1,2,3 పాదాలు మిధున రాశిలో

 నాలుగవ పాదమ్ కర్కాటక రాశిలోను

ఉంటాయి. ఈ నక్షత్రం లో పుట్టిన

వారికి గురు మహా దశ తో జీవితం

 ప్రారంభం అవుతుంది.గురు దశ పూర్తి

 ప్రమాణం 16 ఏళ్ళు.ఒక్కొక్క పాదం 4 ఏళ్ళు

నెలలు హరీంచగా మిగిలిన గురు దశ

 అనుభవానికి వస్తుంది.తరువాత ,శని 19,

బుధ 17,కెతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,

రాహు 18 సం॥ లు వరుసగా అనుభవానికి

వస్తాయి.గండాలు లేకుంటే

పూర్ణాయుర్ధాయం 96 సం॥లు.

ఈ నక్షత్రం లో పుట్టినవారు మంచి

 తెలివితేటలు,ధర్మబుధ్ధి,ఔదార్యం,ధైవభక్తి,

శాస్త్ర విఙ్ఞానమ్,న్యాయ దృష్టి,పరోప కారా

గుణమ్ కలిగి ఉంటారు.మంచి తనంతో జనాన్ని

ఆకర్షించగలరు.ఒక్కొక్క పాదానికి ఒక్కొ విశేషం ఉంది.

      

8)పుష్యమిః-కర్కాటక రాశి,నక్షత్రాధిపతి శని.

శని దశతో జీవితం ప్రారంభం.

 పూర్తి దశ 19 సం॥లు. తరువాత బుధ 17,కెతు 7,

శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు 18,

గురు 16 సం॥ లు వరుసగా అనుభవానికి వస్తాయి.

గండాలు లేకుంటే పూర్ణాయుర్ధాయం 70 సం॥లు.

ఈ నక్షత్రం లో పుట్టినవారికి కాముకత్వం,

శరీర పుష్టి,ధైర్యం,శుభ్రత,ఆత్మాభిమానమ్,

సూక్ష్మ గ్రహణ శక్తి,శీఘ్ర కోపం,ఉపకార గుణం,

శాస్త్ర విఙ్ఞానమ్ ఉంటాయి.

ఏకాంతంగా ఉండటానికిఇష్ట పడుతారు.

తీపి పదార్థాలు మక్కువ.

 

9). ఆశ్లేషః-కర్కాటక రాశి.నక్షత్రాధిపతి బుధుడు.

బుధ దశతో జీవితం ప్రారంభం పూర్తి

దశ 17 సం॥లు. తరువాత కెతు 7,శుక్ర 20,

రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు 18,గురు 16,

శని 19 సం॥ లు వరుసగా అనుభవానికి వస్తాయి.

 పూర్ణాయుర్ధాయం 86 సం॥లు.ఏ పాదం లో

పుట్టిన వారైనా మాటలలో మంచి నెర్పరులు.

రహస్యంగా అపకారం చేయగలరు.

యజమాని పనులను చెయడంలో ఆసక్తి,

చాతుర్యం,చూపిస్తారు,పెద్దల మన్ననలను

ఆదరణను పొందుతారు.అందంగా ఉంటారు.

పరసంపర్కం,కాముక గుణం ఎక్కువ.

 

10). మఖః-సింహ రాశి.నక్షత్రాధిపతి కేతువు.

కేతు మహా దశతో జీవితం ప్రారంభం.

తరువాత వచ్చే దశలు,,శుక్ర 20,రవి 6,

చంద్ర 10,కుజ 7,రాహు 18,గురు 16,శని 19,

బుధ 17 సం॥ లు. పూర్ణాయుర్ధాయం

97 సం॥లు.ఏ పాదం లో పుట్టిన వారైనా

 మహిళలకు గౌరవం,సుఖం,సంపద,

లభిస్తాయి.దైవభక్తి,పెద్దల పట్ల గౌరవం

ఉంటాయి.పురుషుడైతే తేజో వంతుడై

తండ్రిని మించి పోతాడు.వాదనా పటిమ,

దైవ భక్తి,గురుభక్తి ఉంటాయి.

కోపం ఎక్కువ.బంధు వర్గానికి మేలు చేస్తారు.

కార్య నిపుణులు,కళాభిరుచి,

ఆకర్షణ,ఉపాసనా బలం ఉంటాయి.

 

11). పుబ్బ(పూర్వ ఫల్గుణి)ః-సింహరాశి,పుబ్బ

నక్షత్రాధిపతి శుక్రుడు.ఈ జాతకులకు శుక్ర దశ

తో జీవితం ప్రారంభమవుతుంది.పూర్తి దశ 20 సం॥లు.

తరువాత వచ్చే దశలు రవి 6,చంద్ర 10,

కుజ 7,రాహు 18,గురు 16,శని 19,

బుధ 17,కేతు 7 సం॥ లు. పూర్ణాయుర్ధాయం

90 సం॥లు.ఏ పాదం లో పుట్టినా పుబ్బ నక్షత్ర జాతకులకు

కళాభిరుచి,ఆభరణాలు,అలంకారాల మీద మోజు,

యుక్తాయుక్త విచక్షణ,కళలలో నేర్పరి తనం,మంచి రూపమ్,

ప్రజాదరణ ఉంటాయి.ఖర్చు,చపల గుణం ఎక్కువ,

మాతృ సుఖం స్వల్పం.

 

12). ఉత్తరః-మొదటి పాదం సింహ రాశి లోను,మిగిలిన

2,3,4 పాదాలు కన్యారాశి లోను ఉంటాయి. నక్షత్రాధిపతి

 సూర్యుడు.ఈ నక్షత్ర జాతకులకు సూర్య దశ తో జీవితం

 ప్రారంభమవుతుంది.పూర్తి దశ 6 సం॥లు.

తరువాత వచ్చే దశలు చంద్ర 10,

కుజ 7,రాహు 18,గురు 16,శని 19,

బుధ 17,కేతు 7,శుక్ర 20 సం॥ లు. పూర్ణాయుర్ధాయం

80 సం॥లు.ఏ పాదం లో పుట్టినా నక్షత్ర స్త్రీ జాతకురాలు

సంతానవతి,సౌభాగ్యవతి,కార్యదక్షురాలు పురుషుడైన

తేజస్వి,కార్యాకార్య విచారము తెలిసినవాడు

నాట్యకారుడుఅగును.

 

13). హస్తః-అశ్విని నుండి 13 వ నక్షత్రం ఇది.

నక్షత్రాధిపతి చంద్రుడు.

హస్తలో పుట్టిన వారికి చంద్ర దశతో జీవితం

 ప్రారంభం.తదుపరి కుజ7,రాహు 18,గురు16,శని19,

బుధ 17,కేతు7,శుక్ర 20,రవి 6 సం॥లు వరుసగా

 అనుభవానికి వస్తాయి.పూర్ణాయుర్దాయమ్ 88 సం॥.

పురుషులైతె మంచి కీర్తి,గౌరవం,గాంభీర్యం,

విద్య,నైపుణ్యం,ఉపకార గుణంఉంటాయి.

మహిళలైతేమంచి ప్రవర్తన్,దైవభక్తి,పెద్దల

యందు గౌరవమ్, సంపద,సుఖం ఉంటాయి.

 

14). చిత్తః-మొదటి రెండు పాదాలు కన్య రాశి,చివరి

రెండు పాదాలు తులా రాశి.నక్షత్రాధిపతి కుజుడు.

కుజ దశ (7 సం॥లు) తో జీవితం ప్రారంభం.

తదుపరి ,రాహు 18,గురు16,శని19,బుధ 17,కేతు7,

శుక్ర 20,రవి 6,చంద్ర దశ 10 సం॥లు వరుసగా

 అనుభవానికి వస్తాయి.అన్ని గండాలు గడిస్తే

 పూర్ణాయుర్దాయమ్ 80 సం॥.

    చిత్తా నక్షత్రం లో పుట్టినవారు పురుషులు

 సర్వ జన ప్రియులు,సుగంధ ద్రవ్యాలు,

అలంకారలపై ఆసక్తి గలవారు,విలాసప్రియులు,

మృదు సంభాషణ గలవారై ఉంటారి.స్త్రీలు

 రూపవతులు అలంకార ప్రియులవుతారు.

ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది.

 

15). స్వాతిః-ఈ నక్షత్రం నాలుగు పాదాలు తులా రాశిలో

ఉంటాయి.స్వాతి నక్షత్రాధిపతిరాహువు

రాహు దశ(18సం॥లు) తో జీవితం ప్రారంభం.

 తదుపరి గురు16,శని19,

బుధ 17,కేతు7,శుక్ర 20,రవి 6,చంద్ర10,

కుజ 7 సం॥లు వరుసగా అనుభవానికి వస్తాయి.

ఈ నక్షత్ర జాతకలు పురుషులు స్వతంత్రులు,

బుద్ధిమంతులు,ధైర్యవంతులు,

పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారు.

బంధు వర్గానికి ఇష్టులవుతారు.విశాల దృక్పథం

 కలిగి ఉంటారు.స్వాతిలో పుట్టిన మహిళలకు

 మంచి సంతానం,కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు

16). విశాఖః-విశాఖ 1,2,3, పాదాలు తులా రాశిలోను,

4 వ పాదం వృశ్చిక రాశి లో ఉంటాయి.

విశాఖ నక్షత్రాధిపతి గురువు.గురు దశ పూర్తి

 ప్రమాణం 16.సం॥లు.తదుపరి వరుసగా శని 19,బుధ 17,

కేతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,

రాహు18 సం॥ ల దశలు అనుభవానికి వస్తాయి.

పూర్ణాయువు 97 సం॥ లు. విశాఖ నక్షత్రం ఏ పాదం

 లో పుట్టినా పురుషులకు సూక్ష్మ బుద్ధి,వివేకం,యుక్తి,,

పొదుపు,దయ,ఇంద్రియ నిగ్రహం,అసూయ,లోభ గుణం,

కరుణ,స్పష్టంగా మాట్లాడే స్వభావం,నేర్పరి తనం,

బంధు వర్గానికి ఉపకారం చేసే స్వభావం ఉంటాయి.

విశాఖ మహిళలకు కోమల శరీరం,కలుపుగోలు తనం,

మిత్ర ప్రేమ ఉంటాయి,ధనవంతురాలు,తీర్థ యాత్రలు చేస్తారు.

 

17). అనూరాధః-ఈ నక్షత్రం వృశ్చిక రాశి లోనిది.

నక్ష్త్రాధిపతి శని.శని దశ తో జీవితం ప్రారంభం,

శని పూర్తి దశ 19 సం॥లు. తదుపరి వరుసగా బుధ 17,

కేతు 7,శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 ,

 గురు 16 సం॥ ల దశలు అనుభవానికి వస్తాయి.

పూర్ణాయువు80 సం॥ లు. విశాఖ నక్షత్రం ఏ పాదం లో

 పుట్టినా పురుషులకు రాజ కీయాలలో ఆసక్తి,మంచి రూపం

 శౌర్యం,పాప భీతి,మహిళలపై అభిమానం,

పర స్థల నివాసం ఉంటాయి. ఈ నక్షత్రం లో పుట్టిన

మహిళలకు,స్నేహ శీలం,కలుపుగోలు తనమ్.

ప్రసన్న రూపమ్,భర్త పట్ల అనురాగం,భక్తి,

సంపదలు,ఆభరణాలు ఉంటాయి.

 

18). జ్యేష్టః-వృశ్చిక రాశిలో ఉండే ఈ జ్యేష్టా నక్షత్రం

 3 తారల ఎరుపు రంగులో గొడుగు వలె కనిపిస్తుంది.

ఈ నక్షత్రం లో పుట్టిన వారికి పుత్ర సంతతి అధికం,స్నేహ గుణం.

,స్త్రీ లోలత,శత్రువులు అధికం,ముక్కు పొడవుగా ఉంటుంది.

సత్య శీలురు,సంత్రుప్తి తో జీవిస్తారు.నక్షత్రాధిపతి బుధుడు.

బుధ దశ 17 సం॥లు. తదుపరి వరుసగా కేతు 7,శుక్ర 20,రవి 6,

చంద్ర 10,కుజ 7,రాహు18 , గురు 16,శని 19 సం॥ ల

దశలు అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 80 సం॥లు.

 

19). మూలః-మూలా నక్షత్రానికి అధిపతి కేతువు.ఈ నక్షత్రం

 ధనుర్రాశిలో వుంది.కెతు మహా దశతో జీవితం

 ప్రారంభమ్,కేతు పూర్తి దశ 7 సం॥లు. తదుపరి వరుసగా

 శుక్ర 20,రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 ,

 గురు 16 ,శని 19,బుధ 17 సం॥ ల దశలు

 అనుభవానికి వస్తాయి.మూలా నక్షత్ర జాతకులు

 యజమానికి మేలు చేస్తారు.అన్ని రహస్యాలు

పసిగట్ట గలరు.వివక్ష లెకుండా అన్ని తింటారు.

వితండ వాదం చేస్తారు.ఎన్ని కష్టాలైనా భరిస్తారు.

స్వాభిమానం అధికం,ధన,సుఖ,భోగాలు

అనుభవిస్తారు.ఈ నక్షత్రం లో పుట్తిన మహిళకు

 సౌఖ్యం తక్కువ.ఉన్నతవిద్యపై ఆసక్తి తక్కువ.

 

 

20). పూర్వాషాడః- ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు.

 ఈ నక్షత్రం ధనుర్రాశిలో వుంది.శుక్ర  

మహా దశతో జీవితం ప్రారంభమ్,శుక్ర మహా దశ

  పూర్తి దశ  20 సం॥లు. తదుపరి వరుసగా

రవి 6,చంద్ర 10,కుజ 7,రాహు18 , గురు 16 ,

శని 19,బుధ 17 ,కేతు 7సం॥ ల దశలు

 అనుభవానికి వస్తాయి.

పూర్ణాయు ప్రమాణం 80సం॥లు. ఈ నక్షత్ర

జాతకులకు వినయం,ప్రసన్న ముఖం,దాన గుణం,

దూర దృష్టి, తల్లిపైన ప్రేమ,కార్య నిర్వహణ

 సమర్ధత,మంచిపేరు,స్వల్ప సంపద ఉంటాయి.

 

21). ఉత్తరాషాడః-మొదటి పాదం ధనుర్రాశి లోను,

మిగిలిన మూడు పాదాలు మకర రాశిలోను

 ఉంటాయి.నక్షత్రాధిపతి సూర్యుడు.

సూర్య దశ తో జివితం మొదలవుతుంది.

 పూర్తి దశాప్రమాణం  6 సం॥లు.ఒక్కొక్క

 పాదానికి ఒకటిన్నర సంవత్సరాలు. తదుపరి వరుసగా

చంద్ర 10,కుజ 7,రాహు18 , గురు 16 ,

శని 19,బుధ 17 ,కేతు 7సం॥ ల దశలు

 అనుభవానికి వస్తాయి..పూర్ణాయు ప్రమాణం 80సం॥లు.

ఉత్తరాషాడ జాతకులు వినయంగా

 ప్రవర్తిస్తారు.ధార్మికులు,అందరికి ప్రేమ పాత్రులు

 అవుతారు.మహిళలు సంపన్నురాలులై,

 భర్త అనురాగాన్ని పొందుతారు.

 

22). శ్రవణంః-శని ఆధిపత్యం గల మకర రాశిలో

 ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి చంద్రుడు.

కనుక శ్రవణా నక్షత్ర జాతకుల జీవితం

చంద్ర దశలో ప్రారంభం అవుతుంది.

చంద్ర దశ పూర్తి ప్రమాణం 10 సం॥లు.

ఒక్కొక్క పాదానికి రెండున్నర సం॥లు

గడువగా వారి వారి పాదాన్ని బట్టి,

జన్మ సమయాన్ని అనుసరించి మిగతా

చంద్ర దశ అనుభవానికి వస్తుంది.

తదుపరి వరుసగా కుజ 7,రాహు 18,

గురు16,శని19,బుధ17,కేతు7,

శుక్ర 20,రవి 6 సం॥ల దశలు అనుభవానికి

వస్తాయి.ఏ పాదం లో పుట్టినా శ్రవణా

 నక్షత్రానికి దోషం లేదు.

అమావాస్య గ్రహణ నక్షత్రాలలో జన్మిస్తే

శాంతి అవసరం.శ్రవణా నక్షత్ర జాతకులకు

 2,3,4,5,7,13,15,30 సంవత్సరాలలో రోగ శస్త్రాగ్ని,

అపమృత్యు భయాలుంటాయి.

పూర్ణాయువు 90 సం॥లు.శ్రవణ నక్షత్ర

జాతకులకు అనుకూలవతి ఐన భార్య

లభిస్తుంది.శాస్త్ర విఙ్ఞానం,విద్య,వివేకం,

ఔదర్యం,మాటనేర్పు,స్త్రీ వ్యామోహం,ఉపకార

బుద్ధి,కీర్తి ప్రతిష్టలు,ఆర్జన, ఉంటుంది.పరదేశ

సంచారం ఉంటుంది.

 

23). ధనిష్టః-మొదటి రెండు పాదాలు మకర రాశి లోను,

మూడు,నాలుగు పాదాలు కుంభ రాశిలోను

 ఉంటాయి.ధనిష్టా నక్షత్రానికి అధిపతి కుజుడు,

కనుక కుజ దశ తో జీవితం ప్రారంభం.ఇది 7 సం॥లు.

ఒక్కొక్క పాదానికి 21 నెలలు చొప్పున భుక్తం

కాగా మిగిలిన దశ అనుభవానికి వస్తుంది.

తదుపరి వరుసగా రాహు 18,గురు16,శని19,

బుధ17,కేతు7,శుక్ర 20,రవి 6,చంద్ర 10 సం॥ల

దశలు అనుభవానికి వస్తాయి.ఏ పాదం లో

పుట్టినా దోషం లేదు.18,25,40,50,55,

60 సం॥లలో అస్వస్థత ,వేరు వేరు రూపాలలో

 గండాలు ఉంటాయి.పరమాయువు 80 సం॥లు.

ధనిష్ట జాతకులకు దాతృత్వం,ఉపకారగుణం,

రోష పౌరుషాలు,అధిక సంపాదనాభిలాశ,క్రీడలలో

 ఆసక్తి,దక్షత,కష్టపడే స్వభావం ఉంటాయి.

ఖండితంగా వ్యవహరిస్తారు.వ్యసన పరులౌతారు.

శ్వాస రుగ్మతలు రావచ్చు.ధనిష్ట లో పుట్టిన

మహిళలలకు దయ,కరుణ,పుణ్య కథలు వినే

ఆసక్తి ఉపకారగుణం ఉంటాయి.

 

 

24)శతభిషంః-అశ్విని నుండి 24 వ నక్షత్రం.

కుంభ రాశి.నక్షత్రాధిపతి రాహువు.రాహు దశ

 పూర్తి ప్రమాణమ్ 18 సం॥లు.తదుపరి

వరుసగా ,గురు16,శని19,బుధ17,కేతు7,

శుక్ర 20,రవి 6, చంద్ర 10,కుజ7 సం॥ల దశలు

అనుభవానికి వస్తాయి.ఏ పాదం లో పుట్టినా

 దోషం లేదు.

ఈ నక్షత్రం లో పుట్టిన జాతకులు బంధు వర్గానికి

ఉపకారం చేస్తారు.గౌరవ మన్ననలు పొందుతారు.

శత్రువుల పట్ల శాంత భావం,వ్యవహార ఙ్ఞానం,

నిజాయితి,వాక్చాతుర్యం,ధర్మ చింతన కల్గి ఉంటారు.

జీవిత భాగస్వామి పట్ల అభిమానం,ధీర్ఘాయుష్కులుగా

ఉంటారు.

 

25). పూర్వాభాద్రః- అశ్విని నుండి 25 వ నక్షత్రం.1,2,3 పాదాలు

 కుంభ రాశి లోను నాలుగవ పాదం మీన రాశి లోను ఉంటాయి.

నక్షత్రాధిపతి గురువు.గురు దశ పూర్తి ప్రమాణమ్ 16 సం॥లు.

తదుపరి వరుసగా శని19,బుధ17,కేతు7,శుక్ర 20,

రవి 6, చంద్ర 10,కుజ7 ,రాహు 18 సం॥ల దశలు

అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 90 సం॥లు.

12 వ రోజు,3,4,11,18,80 వ ఏట అపమృత్యు

 గండాలు ఉంటాయి.నక్షత్ర జనన దోషం ఉంది.

సామాన్య శాంతి చేసుకోవలెను.పురుషుడికి

దురలవాట్లు,ఉండడానికి అవకాశం ఎక్కువ.

అయినా ఔదార్యం,స్నేహ శీలం,దాన గుణం,

ఉపకారబుద్ధి ఉంటాయి.చెవి రుగ్మతలు రావచ్చు.

స్త్రీ జాతకురాలికి గురుదేవతా భక్తి,

పనులలో నేర్పరి తనం ఉంటాయి.

 

26). ఉత్తరాభాద్రః-అశ్విని నుండి 26 వ నక్షత్రం.

మీన రాశి. మీన రాశి అధితి గురువు.

నక్షత్రాధిపతి శని.  .శని దశ పూర్తి ప్రమాణం

19 సం॥లు. తదుపరి వరుసగా బుధ17,

కేతు7,శుక్ర 20,రవి 6, చంద్ర 10,కుజ7 ,

రాహు 18,గురు 16 సం॥ల దశలు అనుభవానికి

 వస్తాయి.పూర్ణాయువు 90 సం॥లు.

6 నెల అప మృత్యు భయం,12 వ ఏట జ్వర భీతి,

18 వ ఏట గండం ఉంటాయి. ఏ పాదం లో పుట్తినా

 దోషం లేదు.ఈ నక్షత్ర జాతకులకు ధైర్యం,నీతి,

నిజాయితీ,చాపల్యం,నెమ్మది,ఆలస్య స్వభావం

 వుంటాయి.ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది.

అభివృద్ధి చెంద గలరు.

 

27). రేవతిః-27 వ నక్షత్రం ఇది.మీన రాశి.నక్షత్రాధిపతి

బుధుడు.బుధ దశ 17 సం.లు.ఈ నక్షత్ర

జాతకులకు బుధ దశ తో జీవితం ప్రారంభం.

తదుపరి వరుసగా,కేతు7,శుక్ర 20,రవి 6, చంద్ర 10,

కుజ7 ,రాహు 18 , గురు 16,శని 19సం॥ల దశలు

 అనుభవానికి వస్తాయి.పూర్ణాయువు 85 సం॥లు.

5 వ రోజు, 5 వ ఏట,12,40,60 వ ఏట అపమృత్యు

గండాలు ఉంటాయి.రేవతి నక్షత్రం నాలుగవ పాదం

చివరి రెండు ఘడియలలో జన్మిస్తే  దోషం ఉంది.

దీనిని గండాంత కాలం అంటారు.నాలుగవ పాదం

 లో పుత్రుడు జన్మిస్తే తండ్రికి,శిశువుకు,

పుత్రిక జన్మిస్తే తల్లికి, శిశువుకు  దోషం.

శాంతి కొరకు నక్షత్రజపం,రుద్రాభిషేకమ్

జరిపించుకొనవలెను. ఈ నక్షత్రం లో  పుట్టిన జాతకులు

భాగ్య వంతులై సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు.

మంచి రూపమ్,తేజస్సు,స్థూల శరీరం ఉంటాయి.

దూర దృష్టి గలవారు,పండితులు,

కళా నిపుణులు,అన్నదాతలు,పరోపకారులు

 కాగలరు.విదేశీ గమనావకాశాలు ఉంటాయి.

స్త్రీలు శారీరిక పుష్టి గలవారై ఆచార  వంతులై ఉంటారు..