ఘాత వారం ఘాత తిథి ఘాత నక్షత్రం
ఘాత వారం, ఘాత తిథి, ఘాత నక్షత్రం, ఘాత చంద్రుడు గురించి
శ్లో॥ మేషేచ భానుర్మఘ జన్మ షష్టి। వృషేకరా పంచ చతుర్థి సౌరి।
యుగ్మేనవా మారుత మష్ట
మిందు।కుళీర బాహుర్బుధమైత్రి షష్టి॥
హరీరసా మూల శని ర్నవమ్యాం।సతీచ
విష్ణుర్దశ సౌరిరష్టమి।
తౌల్యాగ్నిజీవే శత తార
ద్వాదశి।అళిర్మునిర్ భార్గవ బీజ రేవతి॥
ధనుర్యుగశుక్ర యమంచ
బీజం।మృగేవసుబ్రాహ్మ్య కుజశ్చ ద్వాదశి।
ఘటారుద్ర రుద్రాశ్చ చతుర్థ
జీవే।మీనార్క సార్పా భృగుబీజయోశ్చ॥
వాణిజ్య యాత్రాచ తటాకవాపి వాస్తు
ప్రవేశే కృషి ఘాత వర్జ్యః॥
జన్మ రాశి |
ఘాత వారం |
ఘాత నక్షత్రం |
ఘాత తిథి |
ఘాత చంద్రుడు. |
1.మేషం |
ఆది వారం |
మఘ |
షష్టి |
జన్మ చంద్రుడు |
2.వృషభం |
శని వారం |
హస్త |
చతుర్థి |
5 వ
“” |
3.మిధునం |
సోమ వారం |
స్వాతి |
అష్టమి |
9 వ “” |
4.కర్కాటకం |
బుధ వారం |
అనూరాధ |
షష్టి |
2 వ |
5.సింహం |
శని వారం |
మూల |
నవమి |
9 వ |
6.కన్య |
శని వారం |
శ్రవణం |
అష్టమి |
10 వ |
7.తుల |
గురు వారం |
శతభిషం |
శత భిషం |
3 వ |
8.వృశ్చికం |
శుక్ర వారం |
రేవతి |
దశమి |
7 వ |
9.ధనుస్సు |
శుక్ర వారం |
భరణి |
విదియ |
4 వ |
10.మకరం |
మంగళ వారం |
రోహిణి |
ద్వాదశి |
8 వ |
11.కుంభం |
గురు వారం |
ఆర్ద్ర |
చతుర్థి |
11 |
12.మీనం |
శుక్ర వారం |
అశ్లేష |
తదియ |
12 |
ఆ యా రాశుల వారికి , ఆయా వారంలలో తిథులలో నక్షత్రం ఉన్న రోజులలో వాణిజ్యం,యాత్రలు ప్రారంభించుట, చెరువులు బావులు త్రవ్వుట,గృహ ప్రవేషం,వ్యవసాయ పనులు ప్రారంభించుట
పనికి రాదు.
తప్పని సరి పరిస్తితులలో మినహాయింపు ఈ క్రింది విధంగా చెప్పబడినది.
శ్లో॥ ఘాత ఋక్షౌ తిథౌ వారే ఘాత చంద్రస్తు నాడికా।
అష్టా(8) దశా(10) నవా(9) రుద్రా(12) అతః ఊర్ధ్వం శుభావహం॥
మినహాయింపు:-ఘాత నక్షత్రం రోజున 8 ఘడియలు, ఘాత తిథి రోజున 10 ఘడియలు, ఘాత
వారము రోజున 9 ఘడియలు,ఘాత చంద్రుడున్న రోజు 12 ఘడియలు వదలి తరువాతి కాలం
శుభప్రదమైనదిగా భావించి , పనులు ప్రారంభించు కొన వచ్చును.ఒక ఘడియ =24 ని.లు
శ్లో॥వివాహకాలే వ్రతబంధ యఙ్ఞే పట్టాభిషేకోపి నిషేక కర్మే।
సీమంత పుంసవన జాతకర్మే నో
చింతనీయా ఖలు ఘాతవర్జ్యః॥
వివాహం,వ్రత బంధము,రాజ్య పట్టాభిషేకం(పదవీప్రమాణ స్వీకారము),నిషేకము,సీమంతము,
పుంసవనము, జాతకర్మ అనుకార్యములకు ఘాత వారము దోషప్రదము కాదు.
0 Comments:
Post a comment
Subscribe to Post Comments [Atom]
<< Home