Monday, 2 November 2020

చతుష్షష్టి పూజ

 

                         శ్రీ మాత్రేనమః

            ॥శ్రీ దేవీ  చతుష్షష్టి పూజ॥

శ్రీ దేవీ నవరాత్రులలో జరిపే చతుష్షష్టి ఉపచారాలు)

ధ్యానం॥

దశవక్త్రా    దశభుజా  దశపాదాంజన ప్రభా।

విశాలయా  రాజమాన  త్రింశల్లోచన మాలయా।

స్ఫురద్దశన  దంష్ట్రాసా  భీమరూపాహి భూమిప।

రూపసౌభాగ్య కాంతీనాంసా  ప్రతిష్టా మహాశ్రయా।

ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుశుండికం।

పరిఘం కార్ముకం శీర్షం నిశ్చ్యేత ద్రుధిరందదౌ।

ఏషాసా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా।

ఆరాధితా వశీకుర్యాత్పూజా కర్తుశ్చరాచరం॥ …….……………………1

సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతా మిత ప్రభా।

త్రిగుణాసా మహాలక్ష్మీః సాక్షాన్మహిష మర్దినీ

శ్వేతాననా నీలభుజా సుశ్వేత స్తన మండలా

రక్త మధ్యా రక్తపాదా రక్త జంఘోరురున్నతా।

సుచిత్ర జఘనా చిత్ర మాల్యాంబర విభూషణా

చిత్రానులేపనాకాంతి రూప సౌభాగ్య శాలినీ

అష్టాదశభుజా పూజ్యాసా సహస్ర భుజాసతీ

ఆయుధాన్యత్ర  వక్ష్యంతే  దక్షిణాధః కరక్రమాత్

అక్షమాలాచ కమలం బాణాసిః కులిశం గదా

చక్రం త్రిశూలం పరశు శృంఖో ఘంటాచ పాశకః

శక్తిర్దండ శ్చర్మ చాపః  పాన పాత్రం కమండలుః।

అలంకృత భుజామేభిః రాయుధైః కమలాసనాం

సర్వదేవమయీ మీశాం మహాలక్ష్మీ మిమాం నృప

పూజయే త్సర్వ లోకానాం సదేవానాం ప్రభుర్భవేత్॥……………………….2

శ్లో॥ గౌరీ దేహాత్సముద్భూతాయా సత్వైక గుణాశ్రయా

సాక్షాత్సరస్వతీ ప్రోక్తా శుంభాసుర నిబర్హిణీ

దదౌచాష్ఠ  భుజాబాణ ముసలే శూల చక్ర భృత్।

శంఖం ఘంటాం లాంగలంచ కార్ముకం వసుధాధిప।

ఏషా సంపూజితా శక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి॥

శ్లో॥ వందేహం కుంద సూనాభా మిందీవర దళేక్షణాం

వందారు జనమందార వల్లీం వాగధి దేవతాం॥

శ్లో॥ ఉషసి మాగధ మంగళ గాయనైర్ఝడితి జాగృహి జాగృహి జాగృహి

అతికృపార్ధ కటాక్ష  నిరీక్షణైర్జగదిదం జగదంబ సుఖీకురు॥……. (3)

(ధ్యానవిధిః॥ మూల మంత్ర ముక్త్వా  స్వహృదయ స్థితాం

చిచ్చైతన్య  స్వరూపాం దేవీం  పుష్పాంజలా వాగతాం

విభావ్య యంత్రోపరి సంయోజయేత్)

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ

రాజరాజే దేవతాభ్యోనమః॥   ధ్యానం సమర్పయామి॥

శ్లో॥ కనక కలశ శోభమాన శీర్షం జలధరచుంబి సముల్ల సత్పతాకం,

భగవతి తవ సన్నివాస హేతోర్మణి మయమందిర మేత దర్పయామి॥

ఇతి  దివ్యమందిరం సమర్పయామి॥…………………4

శ్లో॥ కనకమయ వితర్ది శోభమానం దిశిదిశి పూర్ణ సువర్ణ కుంభయుక్తం।

మయికృపయాశు సమర్చనం గృహీతుం మణిమయ మంటప

మధ్యమేహి మాతః॥

శ్రీమహాకాళీ...... నమః॥   ఇతి రత్న మంటపం సమర్పయామి॥……5

శ్లో॥ తపనీయ్యమయీ సతూలికా కమనీయా మృదులోత్త రచ్ఛదా।

నవరత్న విభూషితా మయా శిబికేయం జగదంబితేర్పితా

శ్రీమహాకాళీ...... నమః॥ఇతి ఆందోళికాం సమర్పయామి॥……………6

శ్లో॥ శంఖ చక్ర గదాహస్తే సువర్ణాభే  సుశోభనే

మమదేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని

శ్రీమహాకాళీ...... నమః॥ ఇతి  ఆవాహనం సమర్పయామి॥…………7

శ్లో॥ నానావర ప్రదాం దేవీం సమారాధన సువ్రతాం॥

పీతాంబర ధరాం దేవీం సర్వక్షోభ వివర్జితాం॥

శ్లో॥కనకమయ వితర్ధ స్థాపితే తూలికాఢ్యే  వివిధ కుసుమ కీర్ణే  కోటిబాలార్క వర్ణే

భగవతి రమణీయే రత్న సింహాసనేస్మి న్నుప విశ పదయుగ్మం హేమ పీఠే నిధాయ॥

శ్రీమహాకాళీ...... నమః॥ రత్నఖచిత  సింహాసనం సమర్పయామి.…………….8

శ్లో॥మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనక స్తంభ చతుష్టయేన   యుక్తం।

కమనీయ తమం భవాని తుభ్యం నవ ముల్లాభ మిదం సమర్పయామి॥

శ్రీ మహాకాళీ..... నమః| వితానం సమర్పయామి……………………………….9

శ్లో॥తప్త కాంచన సంకాశాం కమలాం కమలాలయాం|

కన్యా మింద్రాది పూజ్యాం తాం జగదంబాం    నమామ్యహం

శ్లో॥  దూర్వయా సరసిజాన్విత విష్ణుక్రాంత యాచ సహితం కుసుమాఢ్యం॥

పద్మయుగ్మ సదృశే పదయుగ్మే పాద్యమేత దురరీకురుమాతః

శ్రీ మహాకాళీ…… నమః పాద్యం సమర్పయామి…………………………….10

శ్లో॥ జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణు వల్లభాం।

రత్న సింహాసనస్థాంచ వందితాం   పరమేశ్వరీం॥

గంధ పుష్పయవ సర్షప దూర్వా సంయుతం తిల కుశాక్షత మిశ్రం।

హేమ పాత్ర నిహితం సహరత్నై రష్య మేత దురరీ కురుమాతః|

శ్రీమహాకాళీ...... నమః| అర్ఘ్యం సమర్పయామి……………………………..11

శ్లో॥    విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం।

సర్వైశ్వర్య ప్రదామాచ మన దానేన పూజయేత్

శ్లో॥ జలజద్యుతినా కరేణజాతీ ఫల తక్కోల లవంగ గంధ యుకైః॥

అమలై రమృతై రివాతిశీ తై ర్భగవత్యాచమనం విధీయతాం॥

శ్రీమహాకాళీ...... నమః| ఆచమనం సమర్పయామి॥…………………………..12

శ్లో॥ పంచామృతాదంతరేవ మంతై ర్వేదోక్త కైరపి,

మధ్యే మధ్యే పూజయామి మధుపర్క పురస్సరం॥

నిహితం కనకస్య సంపుటే పిహితం రత్న పిధాన కేనయత్॥

తదిదం భవతీ కరేర్పితం మధుపర్కం జనని ప్రగృహ్యతాం

శ్రీమహాకాళీ...... నమః|………  మధుపర్కం సమర్పయామి॥………………..….13

శ్లో॥ ఏతచ్చంపక తైల మంబ వివిధైః పుష్పెర్ముహుర్వాసితం।

న్యస్తం రత్నమయే సువర్ణ చషకే భృంగైర్భ్రమద్భిర్యుతం|

సానందం సురసుందరీభిరభితో హస్తైర్ధృతంతే మయా।

కేశేషు భ్రమర ప్రభేషు సకలేష్వంగేషుచా  లిప్యతే॥

శ్రీమహాకాళీ...... నమః|.......  అభ్యంగనం సమర్పయామి……………………….14

శ్లో॥ మాతః కుంకుమ పంక నిర్మిత మిదం దేహే తవోద్వర్తనం।

భక్త్యాహం కలయామి హేమ రజసా సంమిశ్రితః కేసరైః।

కేశానా మలకైర్వి శోధ్య విమలైః కస్తూరి కాద్య న్వితైః।

స్నానంతే నవరత్న కుంభ నిహితై స్పంవాసి తోష్ణోదకైః॥

శ్రీమహాకాళీ...... నమః॥……..ఇతిఊష్ణోదకఉద్వర్తనం  సమర్పయామి॥………15

శ్లో॥ దధి దుగ్ధ ఘృతై  స్సమాక్షికయా  స్సితయా శర్కరయా సమన్వితైః।

స్నపయామితవాంగ మాదృతో జననిత్వాం పునరుష్ణ వారిభిః॥

శ్రీమహాకాళీ...... నమః॥….. పంచామృత స్నానం సమర్పయామి॥…………………16

శ్లో॥నదీనాం చైవ సర్వాసాం మయా నీతం జలం శుభం।

అనేన స్నాపయామ్యంబ మంతైర్వారుణ సంభవైః।

ఏలో శీర సువాసితై స్సకుసుమై గంగాది తీర్థో దకైః।

మాణిక్యామల మౌక్తికాదికయుతై స్స్వచ్చె స్సువర్ణోదకైః।

మంత్రాన్ వైదిక తాంత్రికాన్పరి పఠన్ సానంద మత్యా దరాత్॥

స్నానంతే పరికల్పయామి జనని స్నానంత్వ మంగీకురు॥

శ్రీమహాకాళీ...... నమఃఃః గంగాది తీర్థోదక స్నానం సమర్పయామి॥…….17

శ్లో॥  జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం|

నానావిధైశ్ళు భైర్వస్త్రైః పూజయామీశ వల్లభాం॥

బాలార్కద్యుతి  దాడిమీయ కుసుమం ప్రస్పర్థి సర్వోత్తమం।

మాతస్త్వం  పరిధేహి దివ్యవసనం భక్త్యామయా కల్పితం।

ముక్తాభిర్గ్రధితం సకంచుక మిదం స్వీకృత్య పీత ప్రభం।

తప్త స్వర్ణ సమాన వర్ణ మతులం ప్రావర్ణ మంగీకురు॥

శ్రీమహాకాళీ.... నమః॥ సకంచుక ప్రావరణ పరిధాన వస్త్రం సమర్పయామి……18

శ్లో॥ సర్వసిద్ధి ప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరీం।

నానారత్న ధరాంవందే నానాగుణ విధాయినీం॥

శ్రీ మహాకాళీ ...... నమఃః ఉపవీతం - ఉత్తరీయం సమర్పయామి……. (19)

శ్లో॥ నవరత్నయుతే మయార్పితే కమనీయే తపనీయ పాదుకే

సవిలాసమిదం పదద్వయం కృపయాదేవి తయోర్నీ ధీయతాం॥

శ్రీ మహాకాళీ ..... నమః| దివ్యపాదుకే సమర్పయామి…………..…..20

శ్లో॥ బహుభిర గురుధూపై స్సాదరం ధూపయిత్వా

భగవతి తవకేశాన్ కంకతై ర్మార్జయిత్వా)

సురభి భిరరవిందైశ్చంపకై శ్చార్చయిత్వా।

ఝడితి కనక సూత్రైర్జూట మన్వేష్టయామి॥

శ్రీ మహాకాళీ……నమః॥ కేశపాశబంధనం సమర్పయామి …………21

శ్లో॥ సౌవీరాంజన మిదమంబ చక్షుషోస్తే విన్యస్తం కనక శలాకయా మయాయత్

తన్నూనం మలిన మపిత్వ దక్షిసంగాత్ బ్రహ్మేంద్రాద్యభిలషణీయ తామియాయ॥

శ్రీమహాకాళీ...... నమః॥ నేత్రయోస్సౌవీరాంజనం సమర్పయామి…………..22

శ్లో॥ మాణిక్య ముక్తాఫల విద్రుమైశ్చ గారుత్మతైశ్చాప్యథ పుష్యరాగైః॥

వజ్రంచ నీలంచ గృహాణదేవి గోమేధి వైఢూర్య కృతాంశ్చ హారాన్

శ్లో॥ మంజీరే పదయోర్నిధాయ రుచిరౌ విన్యస్య కాంచీం కటౌ।

ముక్తాహార మురోజయో రనుపాం నక్షత్రమాలాం గళే

కేయూరాణి భుజేషు రత్న  వలయ శ్రేణీ కరేషు క్రమాత్।

తాటంకే తవకర్ణయోర్వినిదధే శీర్షేచ చూడామణిం॥

శ్లో॥ ధమ్మిల్లే తవ దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే।

ముక్తారాజి విరాజి హేమతిలకం నాసాపుటే మౌక్తికం।

మాతర్మౌక్తిక  జ్వాలికాంచ కుచయోస్సర్వాంగళీ షూర్మికాః।

కట్యాం కాంచన కింకిణీర్వినిదధేరత్నావతంసంశ్రుతౌ

శ్రీ మహాకాళీ నమః| సర్వాభరణాని సమర్పయామి…………………..23

శ్లో॥ చందనాగురు కర్పూర గోరోచన సుకుంకుమం।

కస్తూర్యాదిసు గంధాఢ్యం సర్వాంగేషు విలేపయే॥

శ్లో॥  మాతః ఫాలతలే తవాతి విమలే కాశ్మీర కస్తూరికా।

కర్పూరాగురుభిః కరోమి తిలకం దేహేంగ రాగం తవ

వక్షోజాదిషు యక్షకర్ధ మరసై స్సిక్త్వాచ పుష్టద్రవైః।

పాదౌ చందన లేపనాది భిరహం సంపూజయామి క్రమాత్॥

శ్రీమహాకాళీ...... నమః॥ శ్రీ గంధం సమర్పయామి ……………………..…..24

శ్లో॥  శ్వేత వర్ణాన మలభాన్ కుంకుమాక్తాంశ్చ తండులాన్।

అక్షతానర్పయిష్యామిలలాట ఫలకేశుచౌ

శ్లో॥ రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వారుచిరైరవిద్దేః।

అఖండితైర్దేవియవాదిభిర్వా కాశ్మీర పంకాంకిత తండులైర్వా

శ్రీమహాకాళీ...... నమః| రత్నాక్షతాన్ సమర్పయామి ………………………….25

శ్లో॥  హరస్యార్థ శరీరాంగి హంసరూపే యతీశ్వరి।

హస్తముద్రాంకుశధరే హరిద్రాం మాతృకర్పయే॥

శ్రీమహాకాళీ...... నమః॥ హరిద్రాచూర్ణం సమర్పయామి………………….. 26

శ్లో॥   కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే।

కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకేర్పయే||

శ్రీమహాకాళీ...... నమః॥ కుంకుమ విలేపనం సమర్పయామి (2)

శ్లో॥  జనని చంపక తైలమిదం పురోమృగమదోపయుతం పటవాసకం

సురభిగంధయుతం చతుర్భుజే సపది సర్వమిదం ప్రతిగృహ్యతాం॥

..శ్రీ మహాకాళీ……. నమః| సుగంధ పటవాసాదికం సమర్పయామి………….28

శ్లో॥ సీమంతేతే  భగవతిమయా సాదరన్యస్త మేత |

త్సిందూరంమేహృదయ కమలే హర్షవర్షంతనోతు|

బాలాదిత్య ద్యుతిరివ సదాలోహితాయస్యకాంతి |

స్స్వాంతర్ద్వాంతం హరతుసకలంచేతసాచింతయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥ సీమంతే సిందూరం సమర్పయామి…………………..29

శ్లో॥ మందారపారిజాతాబ్జ  కేతకీపాటలీ  సుమైః।

మాలతీమల్లికా పుష్పై స్సర్వ పుష్పైశ్చ పూజయే ||

శ్లో॥ మందార కుంద కరవీర కదంబ పుష్పైస్త్వాం దేవి సంతత

మహం పరిపూజయామి

జాతీజపావకుల చంపక కేతకాది నానావిధాని కుసుమానిచ

తేర్పయామి॥

శ్లో॥ మాలతీ వకుళ హేమ పుష్పికా కాంచనారు కరవీరకైతకైః |

కర్ణికారగిరి కర్ణికాదిభిః పూజయామి జగదంబతేవపుః||

శ్లో॥  పారిజాత శతపత్రపాటలైర్మల్లికా వకుళ చంపకాదిభిః।

అంబుజైర్వికసితైశ్చ సాదరం పూజయామి జగదంబతేవపు।।

అథాంగపూజా

1.    ఓం మహాకాళ్యైనమః పాదౌ పూజయామి॥

2.    ఓం వారా హ్యైనమః జంఘే పూజయామి

3.    ఓం జ్యోత్స్నాయైనమః జానునీ పూజయామి॥

4.    ఓం బ్రహ్మాణ్యైనమః ఊరూ పూజయామి॥

5.    ఓం బ్రాహ్మ్యైనమః గుహ్యం పూజయామి

6.    ఓం వహ్నిమండలవాసిన్యైనమః కటిం పూజయామి॥

7.    ఓం వైష్ణవ్యైనమః నాభిం పూజయామి॥

8.    ఓం శివాయైనమః హృదయం పూజయామి॥

9.    ఓం సుభద్రాయైనమః కంఠం పూజయామి

10. ఓం సర్వాస్త్రధారిణ్యైనమః బాహూన్ పూజయామి

11. ఓం మహాసరస్వత్యైనమః ముఖం పూజయామి

12. ఓం అనంతాయైనమః నేత్రాణి పూజయామి

13. ఓం సుగంధ పరిమళాయైనమః నాసికాం పూజయామి

14. ఓం మహాబలాయైనమః లలాటం పూజయామి

15. ఓం మహాలక్ష్మ్యైనమః శిరః పూజయామి

16. ఓం సర్వదేవస్తుతాయైనమః సర్వాంగాని పూజయామి॥

(శ్రీ లలితా సహస్ర, త్రిశతీ, ఖడ్గమాలా నామాదిభిః పూజయేత్)

శ్రీమహాకాళీ...... నమః॥ పుష్పాక్షతాన్ సమర్పయామి……….30

శ్లో॥  దశాంగో గుగ్గులో పేత శ్చందనాగరు సంయుతః।

కర్పూరలాక్షా సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం॥

శ్లో॥ లాక్షా సంమిళితై స్సితాభ్ర సహితై శ్శ్రీవాస సంమిశ్రితైః।

కర్పూరా కలితైస్సితా మధుయుతైర్గోసర్ఫిషా ధూపితైః।

శ్రీ ఖండా గురుగుగ్గులు ప్రభృతిభిర్నానావిధైర్వస్తుభి|

ర్దూపంతే పరికల్పయామి జననీ ధూపంత్వమంగీకురు||

శ్రీమహాకాళీ...... నమః॥   ధూపమాఘ్రా పయామి……………………….31.

శ్లో॥ గోఘృతా వర్తి సంయుక్తా దీపమాలా మనోహరా

అజ్ఞానమంధకారంమే నివారయతు సోజ్వలా॥

శ్లో॥ రత్నాలంకృత హేమపాత్ర నిహితైర్గో సర్ఫిషా పూరితై।

ర్దీపై ర్దీర్ఘ తరాంధకార భిదురైర్బాలార్క కోటి ప్రభైః।

ఆతామ్రజ్వల దుజ్జ్వల జ్ఞ్యల నవద్రత్న ప్రభాదీపి తైl

ర్మాతస్యామహ మాదరాదనుదినం నీరాజయామ్యంబికే ||

శ్రీమహాకాళీ...... నమః॥ దీపం దర్శయామి …………………………..32

శ్లో॥ మహతి కనక పాత్రే స్థాపయిత్వా విశాలాన్।

తపన సదృశరూపా నంధకార ప్రభేదాన్

బహుఘృత మథతేషు న్యస్త దీపానకంపాన్

భువన జనని కుర్వే నిత్య మారార్తి కంతే||

శ్లో॥  సవినయమథ  కృత్వా  జానుయుగ్మం  ధరణ్యాం సపది

శిరసిధృత్వా పాత్ర మారార్తి కస్య

ముఖ కమల సమీపే తేం  బసార్థం త్రివారం భ్రమయతి మయి

భూయాదాశుసార్ద్రః  కటాక్షః॥

శ్రీమహాకాళీ...... నమః॥ సము కుంభాక్యం సమర్పయామి॥…………33

శ్లో॥సర్వభక్ష్యైశ్చ  భోజ్యైశ్చ రస్సైషడ్భిః సమన్వితం

నైవేద్యం మానసోభీష్టం మహాలక్ష్మీర్నీ వేదయే॥

శ్లో॥  మాతస్యాం దధి దుగ్ధ పాయస మహాశాల్యన్న సంతానికా

సూపాపూప  సితాఘృతై స్పనటకై స్సద్ర రంభాపలైః|

ఏలా జీరక హింగు నాగరనిశాకుస్తుంబరీ సంస్కృతైః।

శాకై స్సాకమహం సుధాధి కరసై స్సంతర్ప యామ్యంబికే॥

శ్లో॥ సాపూప సూప దధి దుగ్ధ సితా ఘృతాని

సుస్వాదు యుక్త పరమాన్న పురస్కృతాని,

శాకోల్ల సన్మరిచి జీరక బాహ్లికాని

భక్ష్యాణి భక్ష జగదంబ మయార్పితాని॥

శ్లో॥  క్షీరమే తదిదముత్తమోత్తమం ప్రాజ్య మాజ్యమిదముజ్వలం మధు।

మాతరేతదమృతోప మంత్రయం సంభ్రమేణ పరిపీయతాం ముహుః॥

శ్రీమహాకాళీ...... నమః॥ షడ్రసోపేత నైవేద్యం సమర్పయామి………………34

శ్లో॥ పానీయం పావనం శ్రేష్ఠం గంగాది సరిదుద్భవం।

హస్త ప్రక్షాళనం దేవి గృహాణ ముఖశోధనం||

శ్లో॥   ఉష్ణోదకైః పాణియుగం ముఖంచ ప్రక్షాళ్య మాతః కలధౌత పా త్రే

కర్పూర మిశ్రేణ సంకుంకుమేన హస్తౌ సముద్వర్తయ చందనేన॥

శ్రీమహాకాళీ...... నమః॥  హస్త ప్రక్షాళనం సమర్పయామి ………………..…35

శ్లో॥  అతిశీత ముశీర వాసితం తపనీయే కలశే నివేదితం॥

పటపూత మిదంజితామృతం శుచిగంగా మృత మంబపీయతాం

శ్రీమహాకాళీ...... నమః॥  పానీయం సమర్పయామి…………………….36

శ్లో॥ ఇదం ఫలం మయాదేవి స్థాపితం పురతస్తవ

తేనమే సఫలావాప్తి ర్భవే జన్మని జన్మని॥

శ్లో॥  తామ్రామరంభా ఫల సంయుతాని ద్రాక్షాఫల క్షౌద్రసమన్వితాని

సనారికేళాని సదాడిమాని ఫలానితే దేవి సమర్పయామి॥

శ్లో॥ కూశ్మాండ కోశాతక సంమ్మితాని జంబీర నారంగ సమన్వితా ని

సబీజ పూరాణి సజాంబవాని ఫలానితే దేవి సమర్పయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥  ఫలాని సమర్పయామి………………….….37

శ్లో॥  కర్పూర నాగవల్లీభిః క్రముకైర్భాజితం తథా

ఏలా లవంగ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం॥

శ్లో॥ కర్పూరేణ యుతైర్లవంగ సహితై స్తక్కోల చూర్ణాన్వితైః1

సుస్వాదుక్రముకై స్సగౌర ఖదిరైస్సుస్నిగ్ధజాతీ ఫలైః।

మాతః కైతక పత్ర పాండు రుచిరై స్తాంబూల వల్లీ దళై।

స్సానందం ముఖ మండనార్థ మతులం తాంబూల మంగీకురు॥

శ్లో॥ ఏలాలవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని

తాంబూల వల్లీ దళ సంయుతాని పూగానితే దేవి సమర్పయా'మి॥

శ్లో॥ తాంబూల వల్లి దళనిర్జిత హేమవర్ణం స్వర్ణాక్త పూగ ఫల మౌక్తిక చూర్ణ యుక్తం।

రత్నస్థగస్థితమిదం ఖదిరేణ సార్థం తాంబూలమంబ వదనాంబురు హే గృహాణ॥

శ్రీమహాకాళీ...... నమః॥   తాంబూలం సమర్పయామి………………….…..38.

శ్లో॥ స్వర్ణం పవిత్రం మమలం సర్వపాప వినాశనం

సర్వైశ్వర్య ప్రదం యస్మాదతశ్శాంతిం ప్రయచ్ఛమే॥

శ్లో॥ అథబహుమణిమిశ్రైర్మౌక్తికై స్త్వాం వికీర్య త్రిభువనకమనీయైః

పూజయిత్వాచ వస్త్రైః।

మిళిత వివిధ ముక్తాం దివ్యమాణిక్య యు క్తాం జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి।

శ్రీమహాకాళీ...... నమః॥ సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి………………….39

శ్లో॥ మాతః కాంచన దండ మండిత మిదం పూర్ణేందు బింబప్రభం।

నానారత్న విశోభి హేమకలశం లోకత్రయా హ్లాదకం।

భాస్వన్మౌక్తిక జాలికా పరివృతం ప్రీత్యాత్మ హస్తే ధృతం।

ఛత్రంతే  పరికల్పయామి జనని త్వష్టా స్వయం నిర్మితం॥

శ్రీమహాకాళీ...... నమః॥ ఛత్రం సమర్పయామి…………………….40

శ్లో॥ శరదిందు మరీచి గౌరవర్ణై  ర్మణి ముక్తా విలసత్సువర్ణదండైః।

జగదంబ విచిత్ర చామరైస్త్వామహమానంద భరేణ విజయామి।

శ్రీమహాకాళీ...... నమః॥ చామరాభ్యాం విజయామి ………………………41

శ్లో॥ మార్తాండ  మండల నిభో జగదంబయోయం  భక్త్యా మయా

మణిమయోము కురోర్పితస్తే।

పూర్ణేందు బింబ రుచిరం వదనం స్వకీయ్య మస్మిన్ విలోకయ  విలోల విలోచనేత్వం॥

శ్రీమహాకాళీ...... నమః॥ దర్పణం సమర్పయామి………………………..42

 

శ్లో॥ కర్పూర వర్తి సంయుక్తం దీపమాలా విరాజితం।

నీరాజనం  గృహాణత్వం నారాయణి నమోస్తుతే

శ్లో॥ ఇంద్రాదయో నితిశతై ర్మకుట ప్రదీపై ర్నిరాజయంతి సతతం

తవపాద పీఠం తస్మాదహం తవ సమస్త శరీర మేతన్ని రాజయామి జగదంబ

సహస్రదీపైః॥

శ్రీ మహాకాళీ ........ నమః। నీరాజనం సమర్పయామి………………..43

(నీరాజన గీతాని సర్వైస్సహగాయేత్)

శ్లో॥క్షీరోదార్లవ సంభూతే కమలే కమలాలయే।

జాతీపున్నాగ పుష్పైశ్చ గృహాణ కుసుమాంజలిం॥

చరణ నలిన యుగ్మం పంకజైః పూజయిత్వా కనక కమల మాలా కంఠ దేశేర్పయత్వా।

శిరసి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే హృదయ కమల మధ్య్మళ్ళీ  హర్ష వర్షంతనోతు

శ్రీమహాకాళీ...... నమః॥….. దివ్య మంత్ర పుష్పం సమర్పయామి …………..44

శ్లో॥పదే పదేయా పరిపూజ్యకేభ్య స్సద్యోశ్వమేధాది ఫలం దదాసి।

తాం సర్వ పాపక్షయ హేతుభూతాం ప్రదక్షిణైః స్త్వాం పరితఃకరోమి॥

శ్రీమహాకాళీ...... నమః॥ ప్రదక్షిణ త్రయం సమర్పయామి …………………………….45

శ్లో॥ రక్తత్ఫలరక్త కలా ప్రభాభ్యాం ధ్వజోర్ధ్యరేఖా కులిశాం కుశాభ్యాం।

అశేష బృందారక వందితాభ్యాం నమోభవానీ పద పంకజాభ్యాం।

శ్రీమహాకాళీ...... నమః॥నమస్కారాన్ సమర్పయామి …………………………...46

శ్లో॥ ప్రియగతి రతి తుంగో రత్న పల్యాణ యుక్తః కనక మయ విభూష

స్సిగ్ధ  గంభీర ఘోషః।

భగవతి కలితోయం వాహనార్థం మయాతే తురగ శత సమేతో

వాయువేగస్తురంగః॥

శ్రీ మహాకాళీ... నమః| తురంగం సమర్పయామి…………………..…..47

శ్లో॥ మధుకర వృత కుంభన్యస్త సిందూర రేణుః కనక కలిత ఘంటా

కింకిణీ శోభికంఠః।

శ్రవణ యుగళ చంచచ్చామరో మేఘతుల్యో జనని తవముదేస్యాన్మత్త

మాతంగ ఏషః॥

శ్రీమహాకాళీ...... నమః॥ మదగజం సమర్పయామి…………………48

శ్లో॥ ద్రుత తర తురగైర్వి రాజమానం మణిమయ చక్ర చతుష్టయేన యుక్తం।

కనక మయ మహం వితాన వంతం భగవతి తేహిరథం సమర్పయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥ రథం సమర్పయామి ………………………….……49

శ్లో॥ హయ గజ రథపత్తి శోభమానం దిశి దిశి దుందుభి మేఘనాదయుక్తం

అతి బహుచతురంగ సైన్యమేత ద్భగవతి భక్తి భరేణ తేర్పయామి।

శ్రీమహాకాళీ...... నమః॥ చతురంగ సైన్యం సమర్పయామి……….……….50

శ్లో॥ పరిఘీకృత సప్త సాగరం బహు సంపత్సహితం మయాంబతే

విపులం ధరణీ తలాభిదం ప్రబలం దుర్గమహం సమర్పయే॥

శ్రీమహాకాళీ...... నమః॥ దుర్గం సమర్పయామి ………………………………….51

శ్లో॥ శతపత్రయుతై స్స్వభావశీతై రతి సౌరభ్యయుతైః పరాగ పీతైః |

భ్రమరీ ముఖరీ కృతై రనంతై ర్వ్యజనై స్త్వాం జగదంబ విజయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥ వ్యజనం సమర్పయామి ……………………………..52

శ్లో॥ భ్రమ విలుళిత లోల కుంతలాళీ విగళిత మాల్య వికీర్ణ రంగ భూమిః।

ఇయమతి రుచిరా నటీనటంంతీ తవ హృదయే ముదమాతనోతు మాతః॥

ముఖకమల విలాస లోలవేణీ విలసిత నిర్జిత భృంగమాలా।

యువజన సుఖకారు చారుశీలా భగవతితేపురతో నటంతి బాలాః॥

శ్రీమహాకాళీ...... నమః॥ నాట్యం సమర్పయామి…………….…53

శ్లో॥ భ్రమదళికుల తుల్యాలోల ధమ్మిల్లభారా స్స్మిత ముఖకమలోద్య

ద్దివ్యలావణ్య పూరా॥

అనుపమిత సువేషా వారయోషానటంతి పరభృత కలకంఠ్యేస్తు

దృక్పాన పాత్రం॥

శ్రీమహాకాళీ...... నమః॥ దృక్పా పాత్రరూప నటనం సమర్పయామి ………………….54

శ్లో॥ రుచిర కుచ తటీనాం నాట్యకాలే నటీనాం ప్రతిగృహ మథతత్ర

ప్రత్యహం ప్రాదురాసీత్

ధిమికి ధిమికి దిద్ధి దిద్ధి దిద్ధి  ద్దిదిద్ది త్థిగత థిగత త్తత్తైథ్థయ్య

దెయ్యేతి శబ్దః॥

శ్రీ మహాకాళీ....నమః1 నాట్యం సమర్పయామి ……………….55

శ్లో॥ ఢమరు డిండిమ జర్ఘర ఝల్లరీ మృదుర వద్దృగడ ద్రగడాదయః।

ఝడితి ఝాంకృత ఝాంకృత ఝాంకృతతై ర్జహుదయం  హృదయం సుఖయంతుతే॥

శ్రీమహాకాళీ...... నమః॥    గంధర్వ కన్యాగానం సమర్పయామి ………………….56

శ్లో॥ అభినయ కమనీయై ర్నర్తనై ర్నర్తకీనాం క్షణ మపిరమయిత్వా

చేత ఏతత్వదీయం।

స్వయ మహమతి చిత్రై ర్నృత్య వాదిత్ర గీతై ర్భాగవతి భవదీయం మానసం

రంజయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥ అనేకవిధ వాద్యాని శ్రావయామి …………………………57

శ్లో॥తవ దేవి గుణాను వర్ణనే చతురానో చతురాననాదయః।

తదిహైక ముఖేషు జంతుషు స్తవనం కస్తవకర్తు మీశ్వరః॥

శ్రీమహాకాళీ...... నమః॥క్షమాపణం సమర్పయామి॥………………………58

శ్లో॥ అథ మణిమయ మంచకాభిరామే కనకమయ వితాన రాజమానే।

ప్రసర దగరు ధూప ధూపితేస్మిన్ భగవతి భక్తగృహేస్తుతే నివాసః॥

శ్రీమహాకాళీ...... నమః॥భక్త గృహ నివాసం సమర్పయామి॥………………….59

శ్లో॥ఏతస్మిన్ మణి ఖచితే సువర్ణ పీఠే త్రైలోక్యా భయవరదౌ నిధాయ పాదౌ।

విస్తీర్ణే  మృదుల తరోత్త రచ్చ దేస్మిన్ పర్యంకే కనకమయే నిషీద మాతః॥

శ్రీమహాకాళీ...... నమః॥సువర్ణ పర్యంకోపవేశనం సమర్పయామి……………60

శ్లో॥తవదేవి సరోజ చిహ్నయోః పదయోర్నిర్జిత పద్మరాగయోః1

అతితరక్తతలైరలక్తకైః పునరుక్తాం రచయామి రక్తతాం॥

శ్రీమహాకాళీ...... నమః॥పాదయోః లాక్షా రంజనం సమర్పయామి…………………61

శ్లో॥  అధమాతరుశీరవాసితం నిజతాంబూల రసేన రంజితం।

తపనీయమయేహిపట్టకే ముఖ గండూష జలం విధీయతాం॥

శ్రీమహాకాళీ...... నమః॥గండూష జల పాత్రం సమర్పయామి…………….62

శ్లో॥ క్షణమధ జగదంబ మంచకేస్మిన్ మృదుతర తూలికయా విరాజమానే

అతిరహసి ముదాశివేన సార్థం సుఖశయనంకురుమాంహృదిస్మరంతీ॥

శ్రీమహాకాళీ...... నమః॥సుఖ శయనం సమర్పయామి………………….63

శ్లో॥  చతుర్భుజాం త్రిణేత్రాంచ వరదాభయధారిణీం

సింహారూఢాం మహాదేవీం సర్వైశ్వర్య ప్రదాయనీం॥

శ్లో॥ ముక్తాకుందేందు గౌరాం మణిమయ మకుటాం రత్న తాటంక యుక్తా।

అక్షస్రక్పుష్ప  హస్తా మభయ వరకరాం చంద్రచూడాం త్రిణేత్రాం।

నానాలంకార యుక్తాం సురమకుట మణిద్యోతిత స్వర్ణపీఠాం।

సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి॥

శ్రీమహాకాళీ...... నమః॥ప్రార్థనం సమర్పయామి………….………64

శ్లో॥ ఏషాభక్త్యా తవ విరచితా యా మయాదేవి పూజా

స్వీకృత్యేనాం సపది సకలాన్ మేపరాధాన్ క్షమస్వ।

న్యూనం యత్తత్తవ తరుణయా పూర్ణతా మేతు సద్య।

స్సానందమే హృదయ కమలే తేస్తు నిత్యం నివాసః||

శ్రీమహాకాళీ...... నమః॥మమ హృదయే నిత్యనివాసం సమర్పయామి ……..65

శ్లో॥ పూజామిమాం యఃపఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యదివా ప్రదోషే।

ధర్మార్థకామన్ పురుషోలభేత దేహావసానే శివభావమేతి॥

శ్లో॥ పూజామిమాం పఠేన్నిత్యం పూజా కర్తుమనీశ్వరః

పూజాఫలమవాప్నోతి వాంఛి తార్థంచ విందతి|

ప్రత్యహం భక్తి సంయుక్తో యః పూజన మిదం పఠేత్

ప్రసాదేన వత్సరాత్సక విర్భవేత్॥

శ్లో॥  పుత్రాన్  దేహి యశోదేహి సౌభాగ్యం దేహి సువ్రతే|

కాళికాళి మహాకాళి వికరాళి నమోస్తుతే|

త్రైలోక్య జనని త్రాహి వరదే భక్తవత్సలే।

గృహాణార్ఘ్యం మయాదత్తం మహాలక్ష్మి నమోస్తుతే||

శ్రీమహాకాళీ...... నమః॥ప్రసన్నార్ఘ్యం సమర్పయామి…………………………….66

శ్లో॥ యాదేవీ మధుకైటభ ప్రమథనీ యాచండ ముండాపహా

యామాయా మహిషా సుర ప్రమథనీ యారక్తబీజాపహా।

యాసా శుంభ నిశుంభ సూదనకరీ యాదేవ దేవార్చితా|

సాదేవీమమ పాతుదేహ మఖిలం మాతా సదా చండికా॥

శ్లో॥ కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే|

బిల్వపత్రార్చితే దేవి దుర్గేత్వాం శరణగతః॥

శ్లో॥ ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహిమే।

సర్వమంగళదేదేవి యశోదేహి ద్విషోజహి॥

శ్లో॥  సర్వాన్ కామాన్ ప్రదేహిత్వం సర్వసౌభాగ్యదాయినీ

తాపత్రయోద్భవదుఃఖంమమతాశు నివారయ॥

శ్లో॥ విష్ణువక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరాభవేః1

తథాత్వ మచలా నిత్యం మద్గృహే సర్వదావస॥

శ్లో॥  మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి।

యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే……………………..67

 

అనేన మయా కృత  చతుష్షష్టి ఉపచార  పూజనేన

భగవతీ సర్వాత్మికా  మహాకా ళీ మహాగౌరీమహాలక్ష్మీ  మహా సరస్వతీ  బాలా

త్రిపుర   సుందరీ లలితా  పరమేశ్వరీ రాజరాజేశ్వరీ భువనేశ్వరీ

సుప్రీతా  సుప్రసన్నా వరదా భవతు॥

॥ ఏతత్ పూజాఫలం పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు॥

2 Comments:

At 2 January 2023 at 02:39 , Blogger 0iwd2u0k65 said...

The proceedings and the judgment of forfeiture shall be in rem and shall be primarily towards the property itself. Sales of such property shall be at public sale to the best and greatest bidder therefor for cash after 2 weeks’ public notice as the court docket might direct. 1171 et seq., as amended, so long as|as long as} the described implements or equipment aren't displayed to the general public|most of the 점보카지노 people|most people}, bought for use in Florida, or held or manufactured in contravention of the necessities of 15 U.S.C. ss. The operator shall provide a copy of the listing of winners, without charge, to any person who requests it. The operator of a recreation promotion is not required to notify a winner by mail or by phone when the winner is already in possession of a recreation card from which the winner can determine that she or he has gained a designated prize. All profitable entries shall be held by the operator for a interval of ninety days after the close or completion of the game.

 
At 13 January 2023 at 01:52 , Blogger haalk2ga5s said...

According to an IBISWorld research, the land-based and distant playing trade was $230.9 billion in 2021. This determine represents a major leap of 14% comparability with} the playing industry’s measurement seen in 2020. So, in the next five years, the projected online GGR of the European 빅카지노 market was €39.1bn, €42.2bn, €45.5bn, €48.5bn, and €52bn, respectively. Reveal that eighty.7% of white gamblers in New Jersey gamble in land-based casinos solely. In June 2021, 27.7% of men and 21.8% of women in the UK participated in online playing. The Kenyan playing market worth is estimated at $40 million.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home