Sunday 28 October 2018

నూతన యఙ్ఞోపవీత ధారణ

                                       యజ్ఞోపవీత ధారణ

      శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
.శ్రీ మహాగణాధిపతయే నమ:
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడువేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)

ప్రాణాయామం
---------------
(
కుడి చేతి బ్రొటన వేళిని కుడి ముక్కు గోడకి,ఉంగరం వేళిని ఎడమ ముక్కు గోడకి తాకించి)
ఓం భూ: , ఓం భువ: , ఓగ్0 సువ: , ఓం మహ: , ఓం జన: , ఓం తప: , ఓగ్0 సత్యం , ఓం తత్సవితుర్వే--ణ్యం , భర్గో దేవస్య ధీమహి , ధియోయోన: ప్రచోదయా--త్ , ఓమాప: , జ్యోతీరస: ,అమృతం బ్రహ్మ , భూర్భువస్సువరోం--
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , శుభ తిథౌ।………శ్రీమాన్ …….. గోత్ర: ………నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుస్ఠాన యోగ్యత సిద్ధ్యర్ధం,బ్రహ్మ తేజ: అభివృద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే అంటూ నీరు వదలాలి.

మూడు కొత్త యజ్ఞోపవీతాలిని నీటితోను,పసుపుతోను శుభ్రపరచాలి.

యజ్ఞోపవీతం ఇతి మంత్రస్య
పరబ్రహ్మ ఋషి:(కుడిచేతితో నుదుటిని తాకాలి)
తృష్ఠప్ ఛంద:(ముక్కు కింద తాకాలి)
పరమాత్మ దేవత:(హృదయాన్ని తాకాలి)
యజ్ఞోపవీతధారణే వినియోగ:
ఒకదాని తర్వాత ఒకటి మూడు యజ్ఞోపవీతాలిని క్రింది విధంగా చేస్తూ ధరంచాలి.
ధరించేటప్పుడు రెండు చేతులతో యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని కుడి చేతితో పైకి ఉండేటట్లు(ఆకాశానికి చూపించేటట్లు)చేసి కింది ధారణ మంత్రాన్ని పఠిస్తూ మొదటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
1.యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మొదటి దాన్ని ధరించాలి.
పునరాచమ్య!!...ఓం కేశవాయ స్వాహా ,……. (హస్తములతో బాహువులని)
       మమ గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ రెండవ దాన్ని ధరించాలి.
2. ఆచమ్య!!......ఓం కేశవాయ స్వాహా …… మమ ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మూడవ దాన్ని ధరించాలి.
3. ఆచమ్య!!....ఓం కేశవాయ స్వాహా ……… శ్రీమత: కౌండన్యస గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , నూతన యజ్ఞోపవీతధారణ సమయే దశాసంఖ్య గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే
పాత,కొత్త యజ్ఞోపవీతాలని పట్టుకుని గాయత్రి మంత్రం 10 సార్లు జపించాలి.జపించిన పిమ్మట గాయత్రీ మహామంత్ర జపం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పళ్ళెంలో నీటిని వదలాలి.
తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ స్వరూపం జీర్ణోపవీతం విసృ తస్తు తేజ:
(
లేదా)
ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కష్మలదూషితం|
విసృజామి పరబ్రహ్మణ్ వర్చో దీర్ఘాయురస్తు మే |
"
సముద్రం గచ్ఛ స్వాహా" ఇత్యుక్త్వా విసృజేత్ | అని అంటూ పాత యజ్ఞోపవీతాన్ని బయటకి తీసేయాలి.
ఆచమ్య!!







TIPS


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home