Thursday 28 June 2012


౧. అన్నం న నింద్యాత్। అన్నము ను నిందించ కూడదు.
౨.అన్నం న పరిచక్షీత। అన్నమును నిరసించకూడదు.
౩. అన్నం బహు కుర్వీత।అన్నం ను ఎక్కువగా సంపాదించ వలయును.
౪.న కంచన వసతౌ ప్రత్యాచక్షీత। అన్నమును యాచించి వచ్చిన వరికి లేదనకూడదు..
ఈ రీతిగ అన్నము యొక్క గొప్పదనాన్ని వేద వా ఙ్మయం లో చాలా చోట్ల పేర్కొన బడిబది.
... ఆన్నం అంటే కేవలం అన్నమే కాదు. తినే పదార్ఠాలు, త్రాగే నీరు , పీల్చే గాలి అన్నీ కూడా
అన్నం గా భావించ బడినది.  ప్రకృతి ప్రసాదించిన వేటినీ కూడా వ్యర్టం చేయ రాదని భావం.
ఇవి నిత్య  సత్యాలు.

3 Comments:

At 1 July 2012 at 03:48 , Blogger Dr.Ramaka said...

అయ్యా నమస్కారములు.
తమరి బ్లాగ్ చక్కగా ఉంది. విషయం సంక్షిప్తంగా హృద్యంగా ఉంది. ఇటువంటి ఉపయుక్త విషయాలు పదిమందికి చేరాలి. అందుకు మీరు మీ బ్లాగ్ ను అన్ని తెలుగు అగ్రిగేటర్ లలో రిజిష్టర్ చేయండి. అన్నిటి పట్టిక కొరకు నా బ్లాగ్ ramasharma.ramaka.com లో సైడ్‌బార్‌లో ‘సాంగ్రహాయణి’ కింద చూడండి.

ఇక మీరు పోష్ట్ రాసిన ప్రతిసారి ఆటో మేటిక్‌గా చేరాల్సినవారి మెయిల్‌కు చేరేందుకు follow by mail అనే ఉపకరణాన్ని మీరు బ్లాగర్ లో ఉపయోగించుకోవచ్చు.

ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు మీరు వాడిన బేసిక్ టెంప్లేట్ కాకుండా తరువాతవి ఎంచుకుంటే, బ్లాగ్ ను మన ఇష్టమైన విధంగా తీర్చి దిద్దుకోవచ్చు.

బ్లాగ్ ప్రతి పోష్ట్ కు శీర్షిక తప్పక సూచించండి. అలాగైతేనే కొన్ని అగ్రిగేటర్ లలో కనిపిస్తుంది. టైటిల్ లేనివాటి RSS Feed ను అన్ని అగ్రిగేటర్స్ గ్రహించ లేవు.

ఇక ఎలాగూ valmikam.com అని డొమైన్ ను రిజిష్టర్ చేసుకున్నారు కాబట్టి, మీ డొమైన్ తోనే ఉచితంగా ఇమెయిల్ ఐడి (google.com/a వద్ద) సృష్టించుకోవచ్చు.

మీ ప్రయత్నానికి మా హృదయపూర్వక అభినందనలు.

రామక పాండురంగ శర్మ

 
At 1 July 2012 at 04:51 , Blogger Sanskrit Central said...

महॊदय नमांसि ।

भवतः ब्लाग् / वेब् सैट् पृष्ठं संस्कृतवाण्यां (The unique Sanskrit aggregator)संयॊजितं इति वक्तुं संतॊषं प्रकटयामि । तदत्र निम्नॊक्तप्रदॆशॆ द्रष्टुं शक्यतॆ

http://sanskritcentral.com/aggregator/sources

अन्यदपि मॆ विज्ञापनं यद्भवतां ब्लाग् / वेब् सैट् पृष्ठॆ अस्माकं संस्कृतवाण्याः ( http://sanskritcentral.com/node/2 प्रदॆशॆ लभॆत् ) चित्रं यथाशक्ति प्रकटीकुर्युः यॆन वयं धन्याः, कृतज्ञाश्च भवॆम ।

संस्कृतवाणी कृतॆ -

पाण्डुरङ्गशर्मा रामकः



--
संस्कृतवाणी

Sanskrit Aggregator's Blog


--
संस्कृतवाणी

http://blog.sanskritcentral.com/

 
At 1 July 2012 at 05:36 , Blogger mouli.valmikam said...

నమస్కారములు. ఈ నా చిరు ప్రయత్నాన్ని ఉత్సాహ పరచినందులకు మరియు మీ సలహాలకు
నా హృదయ పూర్వక కృతఙ్నతలు.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home