శుచి-శుభ్రత
శుచి--శుభ్రత గురించి
శ్రీ సూక్తమ్ లో 16 వ మంత్రం ….
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహం।
శ్రియః పంచదశర్చం చ శ్రీకామ సతతం జపేత్ ।
యః = ఎవరైతె లక్ష్మీ దేవి కటాక్షం కొరకు ప్రార్థిస్తున్నారో వారు శుచిః =శుచి గా ఉంటూ
ప్రయతో భూత్వా= ఇంద్రియాలను నిగ్రహించిన వారుగా ఉంటూ మన్వహం = అను నిత్యం
జుహుయాదాజ్య=నేతితో హోమం గావించాలి.
శ్రియః పంచదశర్చం చ= లక్ష్మీ దేవి 15 మంత్రాలను [౧నుండి ౧౫ ] సతతం =సదా
జపేత్= జపిస్తుండాలి.
శుచి అంటే కేవలం మడి కట్టుకొని కూర్చుంటే చాలదు. బాహ్యాభ్యంతర శుచిః
మన ఇల్లు మన పరిసరాలు ఇంటా బయటా మన దేహం మన మనస్సు ఇవన్నీ శుభ్రం గా ఉండాలి.
పూజ గదిని శుభ్ర పరచ కుండా ఇంట్లో బూజులు దులుప కుండా మాసి పోయిన మడి పంచె కట్టుకొని దీపమ్ వెలిగించ కుండా మనస్సును కేంద్రీకరించ కుండా ఎన్ని సార్లు శ్రీ సూక్తమ్ చదివినా పలితం దక్కదు. లక్ష్మీ దేవి కృపకు పాత్రులం కాలేము. మన పూర్వీకులు దీనిని బట్ట్ శుచి శుభ్రత కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విశదమవుతుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home