Tuesday, 4 May 2021

 

  అధిక మాసం (Adhika Masam) Extra month in Telugu Calendar

           పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ (Solar Year), చాంద్రమాన సంవత్సరానికీ (Lunar Year) పదకొండుంబావు రోజులు తేడా ఉన్నదిచాంద్రమాన సంవత్సరం

సౌరమాన సంవత్సరం కన్నా చిన్నదిఇదే మాదిరిగా   చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది

ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం 

ఆరంభం కావడం జరగకుండా పోతుందిఅటువంటప్పుడు

 సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి 

అధికమాసం అని  పేరుపెట్టారు. ఇలా అధికంగా వచ్చే అధికమాసం 

శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని  నిషేధించారు.

భూమికి  సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది

సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు).

 ఇది నాక్షత్రిక గణనము  (Siderealduration). 

 నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362,(365 రోజుల గంటల నిమిషాల 8+ సెకండ్లుసమయం పడుతుంది.

 ఇది కూడా నాక్షత్రికమే.

సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ

రమారమిగా 29.53 రోజుల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగుతాడు

 (Synodicmonth).  మాసాన్ని రెండు పక్షాలుగాఒక్కో పక్షం 

15 తిథుల కిందా విభాగింపబడిందిఒక్కో తిథి కనిష్టంగా 21+గంటల

నుండి గరిష్టంగా 26+ గంటల వ్యవధి కలిగి ఉండవచ్చు లెక్కన

 354+ రోజుల్లో పన్నెండు మాసాలు పూర్తి అవుతాయి.

చాంద్రమాన పద్ధతిలో అమావాస్య నుండి అమావాస్య మధ్యనున్న 

రోజులను     గానీ,    పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు గల సమయాన్నిగానీ

 చాంద్రమాన మాసంగా పరిగణిస్తారుచాంద్రమాన లెక్కలమీద 

ఆధారపడే దక్షిణ దేశస్తులుఅమావాస్యను ప్రతి మాసపు అవధిగా 

పరిగణిస్తేఉత్తర భారత దేశంలో పౌర్ణమిని లెక్కలో తీసుకుంటారు

అమావాస్యను పరిగణించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్గోవాగుజరాత్,

కర్ణాటకమహారాష్ట్రలయితే పౌర్ణమిని వాడుకొనే రాష్ట్రాలొచ్చి బీహార్,

 ఢిల్లీహిమాచల్ప్రదేశ్జమ్మూ కాశ్మీర్ఝార్ఖండ్మధ్యప్రదేశ్,పంజాబ్,

 రాజస్థాన్ఉత్తరాంచల్ఉత్తర్ప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాలు రెండు

 పద్ధతులలో శుక్ల పక్షాలు సరితూగుతాయిగానీ కృష్ణ పక్షాల మాసాలు

 మారతాయి

ఉదాహరణకు భాద్రపద శుద్ధ చవితి రెండు లెక్కలలో వినాయక చవితే.

 కానీ శ్రీకృష్ణాష్టమి దక్షిన దేశంలో శ్రావణ బహుళ అష్టమికాగా ఉత్తరాదిలో

 భాద్రపద బహుళ అష్టమి అవుతుందిఇది పూర్తిగా అర్థం కాకపోయినా

 ఫరవాలేదుగానీ చాంద్రమాసం అంటే ఏమిటో తెలిస్తే సరిపోతుంది.    మన తెలుగువారు చాంద్రమాన అమావాస్యాంత (అమాంతపద్ధతిని

 పాటిస్తారు కానీగమనించి చూసినట్లయితే మనకూ కొన్ని సౌరమాన

 పండుగలుంటాయిఉదాహరణకు మకర సంక్రాంతిధనుర్మాసం   

  ఇత్యాదులు.

 ప్రతి నెలలో వచ్చే మాస సంక్రాంతి,సంక్రాంతి పండుగగా జరుపుకునే 

మకర సంక్రాంతులు సూర్య గమనంపై ఆధారపడి ఉంటాయి.

 అందుకే సాధారణంగా సంక్రాంతి  జనవరి 14,15 తేదీలలో    మాత్రమే వస్తూ ఉంటుంది.    కాబట్టి 354+ రోజుల్లో పూర్తయ్యే చాంద్రమాన సంవత్సరానికి

 365+రోజులతో ఉన్న సౌరమాన సంవత్సరానికి సమన్వయాన్ని

 కొనసాగించాలిలేకపోతే మాస ఋతువుల పొంతన దెబ్బ తింటుంది

రెండు సంవత్సర లెక్కలలో ఉన్న 11+ రోజుల తేడాను సరిదిద్దేదే 

 అధిక మాసం అనే అమరిక.

అధిక మాసము
 రెండు అధికమాసంలతో కూడిన సంవత్సరాల మధ్యనైనా ఉండే 

వ్యవధి    856,886,1034~ లేదా 1064 రోజులుగా తెలుస్తోంది. 

క్రీ.శ.2000నుండి 2099 వరకు  గ్రెగోరియన్ శతాబ్ధంలో సంభవించిన 

అధిక మాసాలను లెక్కగడితే  నాలుగూ తెలిసాయి

ప్రతి రెండూ లేక మూడేళ్ళకొక అధిక మాసం సంభవిస్తుంటుంది.

అధిక మాసం ఎవరికి వర్తించదు?                                                                               పైన కొన్ని రాష్ట్రాలు పేర్లను పేర్కొనబడినవి..  అమావాస్యనుగానీపౌర్ణమినిగానీ అవధిగా  చాంద్రమాన పంచాగాలను ఉపయోగించే రాష్ట్రాలు అవి

కానీ కేరళతమిళ్నాడుబెంగాల్ వంటి రాష్ట్రాలు సౌరమాన

 పంచాంగాలను     వాడతారువారి మాసాలు సూర్యడి 

 గమనంపై ఆధారపడి ఉంటాయిమన    చాంద్రాయణ మాసనామాలు  నక్షత్రాలను ఆధారం చేసుకొనుంటే (చైత్రమాసం చిత్తా నక్షత్రం

వైశాఖ మాసం విశాఖా నక్షత్రం…వారి సౌరమాసనామాలు 

రాశులకనుగూణంగా పిలువబడతాయి (మేష మాసంవృషభ మాసం…).

 అంచేత  అధికమాసాలు వారికి వర్తించవు.

 క్షయ మాసము (Less month or 11 months in a Lunar Year)
సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం 

అని అర్థమవుతున్నదిఅనగా ఒక చాంద్ర మాసం లో సూర్య

 సంక్రమణం  లేనప్పుడు అధిక మాసం సంభవిస్తుంది.             

   కానీ దీనికి విరుద్ధంగా  కూడా జరుగుతుంటుంది.  

 అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం

మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య 

నుండి అమావాస్య వరకుగల సమయంలోపలసూర్యుడు రెండు 

రాశులు దాటుతాడుఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి

 సంభవిస్తుంటుందివెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి

 తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుందిదీనిని క్షయ మాసం

 అని పిలుస్తారు1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం 

తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ

 సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత 

 మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ 

 సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించిందిఇక మనెవ్వరి 

జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము.

 ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141

 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.

 శతాబ్ధపు అధిక మాసాలు

సంవత్సరము-- మాసము
2001 
వృష -   ఆశ్వీయుజ మాసము
2004 
తారణ -  శ్రావణ మాసము
2007 
సర్వజిత్తు జ్యేష్ట మాసము
2010 
వికృతి -  వైశాఖ మాసము
2012 
నందన భాద్రపద మాసము
2015 
మన్మథ ఆషాడ మాసము
2018 
విలంబి జ్యేష్ట మాసము
2020 
శార్వరి ఆశ్వీయుజ మాసము
2023 
శోభకృతు శ్రావణ మాసము
2026 
పరాభవ జ్యేష్ట మాసము
2029 
సాధారణ చైత్ర మాసము
2031 
విరోధికృతు భాద్రపద మాసము
2034 
ఆనంద ఆషాడ మాసము
2037 
పింగళ జ్యేష్ట మాసము
2039 
సిధ్ధార్థి ఆశ్వీయుజ మాసము
2042 
దుందుభి శ్రావణ మాసము
2045 
క్రోధన జ్యేష్ట మాసము
2048 
శుక్ల చైత్ర మాసము
2050 
ప్రమోదూత భాద్రపద మాసము
2053 
శ్రీముఖ ఆషాడ మాసము
2056 
ధాత వైశాఖ మాసము
2058 
బహుధాన్య ఆశ్వీయుజ మాసము
2061 
వృష శ్రావణ మాసము
2064 
తారణ జ్యేష్ట మాసము
2067 
సర్వధారి చైత్ర మాసము
2069 
విరోధి శ్రావణ మాసము
2072 
నందన ఆషాడ మాసము
2075 
మన్మథ వైశాఖ మాసము
2077 
హేవిలంబి ఆశ్వీయుజ మాసము
2080 
శార్వరి శ్రావణ మాసము
2083 
శోభకృతు జ్యేష్ట మాసము
2086 
ప్లవంగ చైత్ర మాసము
2088 
కీలక శ్రావణ మాసము
2091 
విరోధికృతు ఆషాడ మాసము
2094 
ఆనంద వైశాఖ మాసము
2096 
నల భాద్రపద మాసము
2099 
సిధ్ధార్థి శ్రావణ మాసము.

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home