అఘమర్షణ సూక్త్ం(ప్రాయశ్చిత్త మంత్రం).
వేద కాలంలో సచ్చీలమూ,నిజాయితీ ఎంతో ప్రాధాన్యం వహించాయి.పాపం క్షోభ వంటివి సహించబడలేదు.దుష్టుల నుండి కానుకలను, దానాలను ఏవైనా పుచ్చుకోవడమ్ జరిగితే ఎంతో పాపం గా పరిగణించే వారు.దానికొరకై ప్రాయశ్చితమ్ అన్వేషించేవారు.
శ్లో॥ ఓం॥హిరణ్యశృఙ్గం వరుణమ్ ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః । యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః ।
బంగారు కిరీటం ధరించిన వరుణ దేవుణ్ణి శరణు పొందుతాను.ప్రార్థిస్తూన్న నాకు తీర్థఫలాన్ని
అనుగ్రహించు.దుష్టుల వస్తువును అనుభవించడం జరిగింది,వారి నుండి కానుకలను సైతం పుచ్చుకొని
ఉన్నాను కనుక.
శ్లో॥యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం । తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సవితా చ పునన్తు పునః పునః॥
మనస్సుతోను, మాటలతోను చేతలతోను నా వలననో నావారి వలననో చేయబడిన పాప కృత్యాలను ఇంద్రుడు,వరుణుడు,బృహస్పతి ,సూర్యుడు పూర్తిగా పునీతం చెయుదురు గాక!
శ్లో॥అత్యాశనా-దతీపానా-ద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహత్। తన్నో వరుణో రాజా పాణినాహ్యవమర్శతు.॥
మితిమీరి తినడం ,మితిమీరి త్రాగడం దుష్టుల నుండి కానుకలను పుచ్చుకోవడం లాంటి పాపాలను
రాజైన వరుణుడు తన స్వహస్తాలతో తుడిచి వేయు గాక.
No comments:
Post a Comment