Monday 25 December 2017

వరూధినీ ప్రవరుల కథ

                               
               చాలా మందికి ప్రవరుడు గురించి గాని వరూధినీ గురించి కాని తెలియదు. కాని ఆసక్తి ఉంటుంది తెలుసుకొవాలని , అటువంటి వారెవరి కెవరికైన ఉపయోగ పడాలని భావిస్తూ నా  తొలి అనువాదం                 

                వరూధినీ ప్రవరాఖ్యుము
    (This is our lesson in our high school or college I think. Just for recollection of poems I searched in internet and I translated the poetry into prose. I request you all to read this and give your comments….Raja Mouli Valmikam)

         (అల్లసాని పెద్దన గారి  ప్రవరాఖ్యము అను స్వారోచిష మనుసంభవము )

   {అరుణాస్పదపురం)
   మ॥వరుణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌
బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌.
            పూర్వము ఆర్యా వర్త దేశమలోని గంగా నది ఒడ్దున అరుణాస్పదమనే పురము గలదు. ఆ ఊరిలో గల విప్రులందరు మంచి విద్యా సంపన్నులు మరియు ఆచార పరాయణులు, దైవభక్తి, మరియు రాజభక్తి   కలవారు. ఆ ఊరిలో గల మహిళలు రంభ తిలోత్తమ వంటి అప్సరసలకంటే అందమైన వారు మరియు నాట్య కళా కోవిదులు.
{ప్రవరుని గొప్ప తనము}
ఉ॥ ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.       
      ఆ అరుణాస్పదమనె ఆ పట్టణములో ప్రవరుడు అనే బ్రాహ్మణొత్తముడుండే వాడు. అతను మన్మధుని మించిన అందగాడు. మంచి భాషా ప్రావీణ్యము కలవాడు. నిత్యకర్మానుష్టానపరుడు. బ్రాహ్మణ జాతికి ఆభరణము లాంటి వాడు. ఎప్పుడు తన సమయానంతటిని జపతపధ్యానములందు అతిథి అభ్యాగతుల సేవలందు గడపెడి వాడు. ఆతని చక్కదనాన్ని చూసి వారకాంతలకు కూడ ఆతని పట్ల కోరిక ఉదయించి అతని పొందులేని జీవితం వ్యర్థము అని వాపొయేవారు. అతడు ఎప్పుడు తన  ఊరు వదలి వేరే గ్రామానికో పట్టణానికో పోయే వాడు కాదు.
ఆతను యౌవన కాలములో ధనార్జన తో పాటు యాగాలు హోమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన భార్య సోమిదమ్మ. భార్యా భర్తల మధ్య ఎడతెగని అనురాగము ఉండెడిది. ఆతనికి తల్లి తండ్రులందు కూడ భక్తి ఎక్కువే.
         అతడు  ప్రతిరోజు   ఉషః కాలమున నే లేచి వెళ్ళి గంగానదిలో స్నానమాడి ఆ నదీతీరముననే సంధ్యావందనము సూర్యోపాసన కావించుకొని, ఇంటిలో పూజాహోమాదులకు కావల్సిన సమిధలు, పండ్లు, ధర్భలు నువ్వులు మొదలగు వస్తువులు సేకరించుకొని, ఉతికిన మడి దోతులు ధరించిన బ్రహ్మచారి శిష్యులు వెంటరాగా ఇంటికి వచ్చే వాడు. జనులందరు ఆ విప్రవరుని చూసి మెచ్చుకొనెడి వారు.
          ఆతని సౌశీల్యాని, కులమును గుణమును చిన్న వయసునుండే పాటిస్తున్న నియమ నిష్టలను చూసి రాజులెవరినా ఆతనికి అగ్రహారములు, భూములు దానముగా ఇవ్వాలని చూసినా అతడు స్వీకరించచేవాడు కాదు. ఆతని ఇంట పాడికి పంటకు కొదువలెదు.  ఆతని భార్య సోమిదమ్మ అన్నపూర్ణకు తీసిపోదు. అతిథులు ఎప్పుడు వచ్చినా, వారికి కావల్సిన వంటలు వండి, రుచికరమైన భోజనం వడ్డించేది. అతిథులెందరు వచ్చినా   ఆమె, వారి సేవలో అలసి పొయేది కాదు.
      ఆ ఊరికి  ఎవరైనా తీర్థ యాత్రలు చేస్తూ యాత్రికులు వచ్చినారని  ఆ ప్రవరాఖ్యునికి తెలియగనే ఆతడు వారికి ఎదురువెళ్ళి వారి పాదాలకు నమస్కరించి,వారిని సాదరముగా ఇంటికి తోడ్కొనివచ్చి, అర్ఘ్య పాద్యాదులతోపాటు చక్కటి ఆతిథ్యమిచ్చి, కడుపునిండా కమ్మటి భోజనాన్ని పెట్టి సంతృప్త పరచేవాడు.వారు తినిన తరువాత వారికి చక్కటి పడక ఏర్పాటు చేసి, వారి దగ్గరకు వచ్చి కూర్చొని ఆ యాత్రికులు చేసిన తీర్థ యాత్రా మహత్యములను గురించి అడిగెడు వాడు.ఆ తరువాత అతడు ఆ పుణ్య క్షేత్రములు ఎంత దూరములో నున్నవి, వాటిని దర్శించ వలనని కోరికను వ్యక్త పరుస్తూ తను సంసార జంఝాటములో ఉండడము వలన తీర్థ యాత్రలు చేయలేకపోతున్నానని చింతిస్తూ తన తీర్థ యాత్రాభిలాషను తెలిపెడి వాడు.
                   ఈ విధంగా బ్రాహ్మణుడు నిత్యాగ్ని హోత్రియై, అతిథి అభ్యాగతుల సేవలు చేస్తూ కాలము గడపుతుండగా ఒక నాటి ఉషఃకాలమునందు ఒక సిద్ధుడు అనే యోగి యాత్రికుడిగా ఆ ఊరికి వచ్చాడు.                  
     ఆ యోగి ముడిచిన ఒంటి కొప్పుతో, జింక చర్మముతో చేసిన కిరీటము లాంటి టోపిని ధరించి, ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో కోదండములను పట్టుకొని, కురుచనైన అంగవస్త్రముపై తోలు తో చేసిన వడ్డాణము ధరించి ఉన్నాడు.బక్కపలుచని దేహముతో భస్మాలంకృతుడై,చెవులకు రుద్రాక్షలతో చేయబడిన పోగులు ధరించి ఉన్నాడు
.           ఈ విధంగా వచ్చుచున్న ఆ పరమయోగిని చూచి, ప్రవరుడు ఎదురేగి భక్తి తో నమస్కరించి, ఇంటికి తోడ్కొని వచ్చి అర్ఘ్య పాద్యాదులచే పూజించి, చక్కటి రుచికరమైన భోజనముతో సంతృప్తుని గావించి, చక్కని పానుపుపై విశ్రమింపచేసి ఇలా అన్నాడు.             ”ఓ యోగీశ్వరా! మీరలు ఎచటినుండి బయలుదేరినారు, ఎక్కడవరకు మీ ప్రయాణము? మీ రాకచె మా గృహము పావనమైనది. మీ వాక్కులే వేద మంత్రాలు, మీరు కాలుమోపిన ప్రదేశము ప్రయాగకు సమానము, మీ పాదములు కడుగగా వచ్చు పాదోదకమే గంగాజలం. మీ వంటి పరమ యోగులు ఏ గృహస్తుల ఇంటిలో కాలుమోపుతారో, ఎవరి ఇంటిలో స్నాన పానాదులు చేసి మృష్టాన్నభోజనం చేసి వెళ్తారో వారే చరితార్థులు, వారికంటే అదృష్టవంతులు ఎవరు ఉండరీ లోకములో” అని ఇంకా ఇలా అన్నాడు.” సంసార సాగరములో చిక్కుకొన్న మా లాంటి గృహస్తులు   ఉద్దరింప బడాలంటే మీ లాంటి వారి పాదరేణువుల స్పర్శ తప్ప వేరే ఇతర ఔషధం లేదు. మీ పాదరేణువుల స్పర్శతో మా లాంటి గృహస్తులు అన్ని తీర్థయాత్రల ఫలితం పొందుతారు.” ఆ మాటలు విని ఆ యోగి  ప్రవరునితో ఇలా అన్నాడు.
“మీ లాంటి గృహస్తుల వలననే కదా మా వంటి తీర్థ యాత్రికులు కష్టాలు లేకుండ యాత్రలు చేయగలుగుతున్నారు! మా లాంటి పరివ్రాజకులకు గృహస్తుడు తంగేటి జున్నులాంటి వాడు, పెరట్లో ఉన్న కల్పవృక్షము లాంటి వాడు. పాడి పంటలతో ఉన్న గృహ మేధి మాకు దేవుడితో సమానము.  బధిరులకు, కుంటి వారికి గ్రుడ్డివారికి, భిక్షుకులకు, కాపాలికులకు సన్యాసులకు, గృహస్తుడే మూలాధారం. కావున ఓ బ్రాహ్మణోత్తముడా గృహస్థ జీవితమే గొప్పది”. ఈ మాటలు విని ప్రవరుడు” ఓ మహాత్మా! మీరు ఏ ఏ దేశాలందు ప్రయాణించారు, ఏ పర్వతాలు ఎక్కారు, ఏ ఏ తీర్థాలలో స్నానమాచరించారు, ఏ యే ద్వీపాలలో పుణ్యవనాలలో తిరిగారు, ఏ ఏ నదులు దర్శించారు ఆ యా చోట్ల గల వింతలు నాకు చెప్పండి, నేను ప్రత్యక్షంగా దర్శించలేకున్నా, వాటి మహిమ వినుట వలన నాపాపాలు తొలగి పోతాయి గదా!” అని అడుగగనే ఆ మునివర్యుడు సాదరము తో “ ఓ విప్రవర్యా। అయితే చెప్పుతున్నాను,వినుము, నేను  తీర్థ యాత్రల యందు కోరిక గలవాడనై జనపదములు,పుణ్య నదులు అన్ని దర్శించాను. పడమటి కొండలను, తూర్పు కోండలను,హిమాలయాలను అధిరోహించాను. అచటి వింతలు విశేషాలు అన్ని తెలుసుకొన్నాను. నేను కేదారేశ్వరుని దర్శించాను. ప్రయాగ లో ఉన్న మాధవేశ్వరుని సేవించాను, బదరీ నాథ్ క్షేత్రములో ఉన్న నర నారాయణుల దర్శించితిని, ఈ దేశము      ఆ దేశము అన నేల? అవకాశమున్నంతవరకు అన్ని తీర్థాలను దర్శించాను.” అని వివరించాడు.
       అప్పుడు ఆ ప్రవరుడు ఆ ముని వర్యునితో “అయ్యా! నాది ఒక సందేహము.  తమరు అన్యథా భావించక నా సందేహాన్ని తీర్చ గలరని విన్నపము చేస్తున్నాను. మీరు చెప్పిన తీర్థ క్షేత్రములు, పుణ్యస్థలములు అన్ని చూడడానికి కొన్ని సంవత్సరాలు పట్టుతాయేమో?.  మిమ్ముల్ని చూస్తే   చిన్న వయసులోనే ఉన్నట్లు కనపడుతున్నారు, ఇన్ని క్షేత్రాలు తిరుగడము ఎలా సాధ్యమైంది?” అని అనగానే ఆ మునివర్యుడు “ఓ విప్రోత్తమా! మీయొక్క సందేహము సరియైనదే, మీరు మమ్ముల్ను అడగుటలో తప్పు లేదు. మేము సిద్ధులము అగుటవలన అనారోగ్యము, వృద్ధత్వము మమ్ముల్ని బాధించవు.  ఇంకొక ముఖ్య రహస్యము చెప్పుతున్నాను వినుము. ఈశ్వర కృప వలన పాదలేపము అను దివ్యౌషధము నావద్ద కలదు. దాని ప్రభావము వలన అన్ని ప్రదేశాలకు సులభంగా వెళ్ళి వస్తున్నాను.”   ఈ మాటలు వినగానే ఆ బ్రాహ్మణుడు ఆసక్తితో అంజలి ఘటించి “అయ్యా మీరు ఇంతటి గొప్ప సిద్ధపురుషులు అని ఇప్పుడే   తెలుసుకున్నాను. నాపై దయయుంచి ఈ శిష్యుని దూర దేశపు తీర్థయాత్రలు చేయించి ధన్యుని చేయగలరు.” అని ప్రార్థించాడు.
   వెంటనే ఆ సిద్ధుడు నడుముకు కట్టుకున్న దంతపు భరిణే ఒక దానిని బయటి తీసి మూత తెరిచి ఇది ఒక పసరు. దీని ప్రభావము తో నీవు అనుకున్న ప్రదేశానికి వెళ్ళవచ్చు అని ఆ ప్రవరాఖ్యుని పాదాలకు పూసి, ఆ సిద్ధుడు తన దారిన తాను యాత్రలకు వేళ్ళిపోయాడు.
               వెంటనే ఆ ప్రవరాఖ్యుడు యాత్రాసక్తి కలవాడై, ఆరోజు ఉదయమే ఆ పాదలేపన ప్రభావంతో హిమాలయ పర్వతాలలో ఉన్న నదీ నదములను, అరణ్యములను, పర్వతాలను చూడడానికి వెంటనే   బయలుదేరాడు.
            అచ్చటకు చేరుకొని, ఆకాశాన్నంటుతున్న హిమవత్పర్వత శిఖరాలను, ఎత్తైన పర్వతాలనుండి క్రిందికి దుముకుతున్న జలపాతాలను, జింకలవలే సవ్వడి లేకుండ పరుగెత్తుతున్న సెలయేళ్లను, చూసి అచ్చెరువందాడు, బదరీక్షేత్రాన్ని దర్శించాడు. సప్త స్వరాలు వినిపిస్తున్న అలకానదీ ప్రవాహఝరితో పాటు కదంబపూల పరిమళాన్ని ఆస్వాదించాడు. అడవులలో తొండములు చాచి లేత చిగ్ళ్ళను అందుకొని తింటున్న  ఏనుగులను, పొదరిండ్లలో గురక పెట్టి నిద్రపోతున్న పులులను,సెలయెటి ఇసుకలందు పొరలుచున్న వరాహములను చూస్తూ ఎలుగు బంటులు నక్కలు, తోడేళ్ళున్నటువంటి  ఆ పర్వత సానువులందు ,అడవులందు సంచరించాడు.గంగ కొరకై సగరుడు తపము చెసినచోటు,విష్ణువుకూర్మావతారమెత్తి  గిరిని ధరించిన చోటు,పార్వతి శివుని గురంచి తపస్సు చెసిన చోటు దర్శించి అనేక మైన ఓషధీ లతలను చూసి  తన్మయత్వం చెందాడు. ఈ క్షేత్రముల మహాత్యము బ్రహ్మకైనా వర్ణింప తరమా! ఇక్కడి మిగతా వింతలను రేపు వచ్చి చూసేదను అని అనుకుంటూ ఉండగా మిట్ట మధ్యాహ్నము అవడముతో ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కాని వెళ్ళలేకపోయాడు. తన కాళ్ళకు రాసుకున్న పాదలేపము మంచు నీటితో కరగి పోవడము గుర్తించాడు. అతను పైకి ఎగరలేనందుకు చింతిస్తూ। ఏమి నా దురదృష్టము, సిద్ధుని పాదలేప ప్రభావమున ఘోరాటవిలో వచ్చి పడితిని. ఎక్కడి అరుణాస్పద పురము, ఎక్కడి హిమాలయాలు! ముందు వెనుకలు ఆలోచించ కుండ ఇక్కడ వచ్చి పడ్డాను, వచ్చిన దారి తెలియదు, తిరిగి వెళ్ళుటకు మార్గమేది?  సిద్ధుని ఔషధ మాహాత్యము తెలిసికొనుటకు ఏ ద్వారకనో అవంతికకో, కురుక్షేత్రముకో గయకో ప్రయాగకో వెళ్ళకుండ, ఈ ఘోరారణ్యమునకు వచ్చితిని, ఎంతటి తెలివి తక్కువ వాణ్ణి నేను? ముందు వెనుకలాలోచించని మందమతులు గదా   బ్రాహ్మణులు?
     ఒక్క నిముషం కూడ నన్ను చూడకుండ ఉండలేనటువంటి మా నాన్న ఎంత బాధ పడుచున్నాడొ! సంధ్యా సమయము లో ఎప్పుడు పలకరించే నా తల్లి నన్ను గానక ఎంత వ్యధ చెందుతుందో కదా! అనుకూలవతి అయిన నాభార్య ఎంత బెంగ పెట్టుకుంటుందో కదా! నా శిష్యులెలా ఉన్నారో? అతిథులకు చేయు సేవలు ఏమైనాయో   దేవతార్చన, నిత్యాగ్ని హోత్రములు లేకుండ ఎంత పాపాన్నిమూటకట్టుకుంటున్నానో కద! దైవము నాపై కనికరము లేక ఇక్కడ పడవేసాడు, నేను ఇల్లు చేరే ఉపాయము చెప్పే పుణ్యాత్ముడెవరో మరి? అని చింతిస్తూ భయపడుతూ సంచరిస్తున్నాడు.
     ఒక్క అడుగు వేస్తే లోయలో పడిపోయేటట్లు   నిట్ట నిలువుగా ఉన్న కొండ చరియలను, కాలు మోపితే లాక్కోపోయే అమిత వేగముతో ప్రవహిస్తున్న గంగా ప్రవాహాన్ని చూస్తూ, ఇసుక వేసినా కూడ క్రిందపడనటువంటి, సూర్యకిరణములు కూడ సోకడానికి వీలు లేని దట్టమైన అడవులను గుండా నడచాడు.  చివరకు మోదుగ, పున్నాగ పోక చెట్లతో కూడిన మరియుచిలుకలు కోయిల మెదలగు పక్షుల కిలకిలారావములతో ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇది ఒక ఆశ్రమము వలె ఉన్నది. ఇందులోకి ప్రవేశిస్తే నా ఇంటికి వెళ్ళడానికి ఏదో మార్గము దొరకక పోదు. అని తన దిగులును కొంత దిగమ్రింగుకొని   ఆ ప్రవరాఖ్యుడు ఆ వన వాటిక లోకి వెళ్ళాడు. అచట ద్రాక్ష చెట్లతో సువాసనలిస్తున్న పూలతో తీగలతో ఉన్న తోటలో అందమైన భవనాన్ని చూసి దాని దరిదాపులకు వెళ్ళాడు. వెంటనే అచ్చట స్త్రీలున్న సూచనగా కస్తూరి మరియు చందనములో కూడిన ఒక చక్కటి శీతల పవనము ఆతన్నిని స్పృశించినది. ఇంకా కొన్ని అడుగులు వెయగనే మెరపు తీగ వలే  పద్మము వంటి కన్నులు కలది,,లెడి వంటి నడుము కలది,చంద్రబింబము వంటి ముఖము కలది, సింహ మధ్యమ వంటి నడుము కలది అయిన ఒక  స్త్రీ రత్నాన్ని కనుగొన్నాడు. ఆ సమయములో ఆ అతివ తన మణిమయ మందిరమందు గల తోటలో మామిడి చెట్టు క్రింద గల ఒక పాలరాతి గద్దెపై కూచొని చకక్కని పాటలు పాడుతూ, వీణ వాయిస్తూ నెచ్చెలులు తాళాలు వాయిస్తూ ఉండగా అరమోడ్పు కన్నులతో రతి పారవశ్యము లాంటి తన్మయత్వము చెందుతూ ఉంది.
        ఒక్కసారి కనులు తెరిచి చూడగనే ఎదురుగా నలకూబరుని మించిన అందముతో నున్న ఆ విప్రవరుని కనుగొన్నది.  ఆతనిని చూడగనే ఆ వనితామణికి మేను పులకరించింది వెంటనే అచ్చటి నుండి లేచి ముందుకు వచ్చి ఒక పోక చెట్టు మాటున నిలబడి అ అందగాణ్ణి చూస్తూ నిలబడ్డది.
   ఆతని రూపలెఖా విలాసములకు ఆశ్చర్యపొతూ తన మనసులో ఇలా తలపోస్తుంది.
            ఎక్కడినుండి వాచ్చినాడు, యక్షతనయుడా, ఇంద్రుడా చంద్రుడా జయంతుడా మన్మధుడా, చక్క దనములోవారందరు   వీడి ముందు తక్కువే. ఈ భూలోకములో ఇంతటి అందగాళ్లు ఉంటారా! ఇతడు నన్ను పరియణమాడుతే నా అంత అదృష్టవంతులు   ఉండరు. మన్మధుడు కూడా వీడిముంది దిగదుడుపే! అని మనసులో తీయని కలలు కంటూ ఆ తనికి ఎదురుగా వచ్చి నిలచినది. ఆ ప్రవరుడు ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు.
   ఉ. ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితి\న్‌
గ్రొవ్వున నిన్నగాగ్రమునకు\న్‌ జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగు\న్‌.      39

   అని తన వృత్తాంతాన్ని చెప్పగా ఆ సుందరి కనులు త్రిప్పుతూ చెవి కమ్మలు కదలుతుండగా ఆతనిని ఆట పట్టించాలని “భూసురోత్తమా! ఇంత పెద్ద కన్నులు పెట్టుకొని నన్నే ఎవ్వరివని ప్రశ్నిస్తున్నావు, ఏకాంతములో ఉన్న యువతులను ఎదో ఒక మిషతో పల్కరించుట తగునా నీకు, నీవు వచ్చిన త్రోవ నీకు తెలియదా । మేము మీకు చులకనగా కనపడుతున్నామా? అని పరిహాసముగా పల్కి మళ్ళీ తన గురించి “లక్ష్మీ మా తోబుట్టువు, గాంధర్వ విద్య మాకు కులవిద్య.   కైలాసము, వైకుంటము ఇంద్ర సభలలో మేము ఆడి పాడుతాము. నా పేరు వరూధిని, ఘృతాచీ తిలోత్తమ రంభాహేమా శశిరేఖలు నా ప్రాణ సఖులు. మేము విహారమునకై అన్ని లోకాలు తిరుగుతాము. ముఖ్యంగా రత్న కాంతుల వలె మెరిసే హిమ శిఖరాలలో, మెఘాల మధ్య మరియు ఈ గంగా తీరమందు చల్లటి మలయ మారుతములందు పూల పొలదరిండ్లయందు సంచరిస్తాము. ఓ విప్రవర్యా!  నవ మన్మధుడా! నీవు మా ఇంటికి అతిథి గా వచ్చావు, ఎండ దెబ్బ తాకి మల్లె పూవు వంటి నీ మోము వాడి పోయినది. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా గృహాన్ని పావనము చెయ్యి.” అనగానే ఆ బ్రాహ్మణుడు ఓ హంసగమనా నీ ఆదరాభిమానములకు సంతసించితిని.
      మేము ఇచ్చట ఉండడానికి వీలుకాదు, వెంటనే పోవాలి, నీ భక్తి ప్రపత్తులు చాలు నాకు, నా పై దయయుంచి నేను ఇల్లు చేరుటకు ఉపాయము చెప్పు., మీరు గంధర్వులు కదా, మీ మహత్యము గొప్పది. మీరు తలచుకొంటే సాధ్యము కానిది లెదు. అని ఆ ప్రవరుడు వేడుకొంటు అడుగగా ఆమె ఎక్కడ మీ ఊరు? ఒక్కచోట కాలు నిలువదా మీకు, మీ ఊర్లో ఉన్న కుటీరమునకు మా రత్నాల మేడ సరిపోదా! ఇక్కడి పూల పరిమళాను వెదచల్లే పూలపొదరిండ్లు, ఇక్కడి గంగా తీరములు ఇవి అన్ని వదలి ఇంటికి వెళ్ళాలని ఒకటే తొందర పడుచున్నావు, నీ పై నాకు మనసు పడింది. ఈ పొదరిండ్లలో నన్ను కౌగలించి నన్ను సుఖపెట్టు. అని అనగానే ఆ ప్రవరుడు వరూధినితోఓ పద్మాక్షీ!  ఇలా” వావి వరుసలు చూడకుండ మాట్లాడటము నీకు తగునా! నియమ నిష్టలతో ఉన్న మా లాంటి విప్రులను కోరవచ్చునా! కొద్దిగా కూడా ఆలోచించ వలదా! నేను నిత్యపూజలకు అతిథుల సేవకు దూరమయ్యాను ఈ రోజు భోజనానికి వేళ మించిపొయింది. నా తలితండ్రులు కడు ముదుసలి వారు. నా కొరకై ఎదురు చూస్తుంటారు. నేను ఇంటికి చేరకుంటే నా సమస్త విధులకు దూరమవుతాను.
         “ఓ సుందరాంగా! ఇటువంటి వైదిక కర్మలు చేసేది స్వర్గ సుఖాల కొరకె గదా! మా కౌగిళ్ళలో సుఖించుటకొరకే గదా! అటువంటి సుఖము ఎదురుగా లభిస్తుండగా కాదనడము తగునా! “అని వరూధినీ పలికగా బ్రవరుండు “ నీవన్నది  నిజమే అది కోరికలు గల వారికి వర్తిస్తుంది.నాకు అటువంటి కోరికలు లేవు, నాకు నగరపు త్రోవ జూపి పుణ్యవంతురాలువు కమ్ము,ఇంద్రియ లోలుడనై పాతకానికొడిగట్తలేను.” అని పల్కెను.
    శా.   ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ'
యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?
             అని వరూధిని మోహ పారవశ్యముతో ప్రవరుని కౌగలించుకొని ముద్దిడ బోగా ఆతడు   “హా ! శ్రీ హరీ!” అని ఆ అతివ భుజాలను పట్టుకొని దూరము గా త్రోసి వేసాడు.
    అప్పుడు సిగ్గు తో అవమానముతో కోపముతో ప్రవరినితో పాపిష్టి వాడా! నీవు నన్ను త్రోసివేయగా నీ వాడి గోర్లు నన్నెట్లు గాయపరచినవో చూడు!  అని తన వక్షస్థలాన్ని చూపించి అతి జాలిగా    “ఎన్నో యఙ్ఞములు తపస్సులు చేసినావని చెప్పుతున్నావు? నీకు భూత దయ తెలియదా, నన్ను ఇలా హింసించ వచ్చా? ఇన్ని చదువులు చదివినావు ఎందులకు వ్యర్థము కదా? పూర్వము పరాశరుడు దాసి కన్యను గర్భవతిగా చేసి కులహీనతను పొందినాడా? విశ్వామిత్రుడు మేనక ప్రేమలో పడినా కూడ బ్రహ్మర్శి అయ్యాడు కదా ।   మాందకర్ణి ఐదుగురు అప్సరలతో కాపురము చేయలేదా!  అహల్య ను పొంది సుఖించిన ఇంద్రుడు స్వర్ఘాధిపతి యే కదా! వారి కంటే నీ గొప్పతనమేమి? ఆకులు అలములు తిని అరణ్యములో ముక్కు మూసికొని తపస్సు చేస్తు ఉన్న మునులు కూడ మా కౌగిళ్ళలో బందీలు అవుతారుగదా।“ అని పలుకగా ఆ ప్రవరుడు వరూధినికి మారుపలకక    జవ్వాది కస్తూరి వాసనలంటిన తన శరీరాన్ని శుభ్రపరచుకొని శుచియై ఆచమించి అగ్నిని   ప్రార్థించి ఇలా వేడుకొన్నాడు..
    ఉ.  దాన జపాగ్నిహోత్ర పరతంత్రుఁడనేని, భవత్పజాంబుజ
ధ్యాన రతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా!
           అని   ప్రార్థించగా అగ్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ అగ్నిదేవుని కృపచే వాయువేగంబున   ఇంటికి చేరుకొని నిత్య కృత్య సత్కర్మల యందు నిమగ్నుడయ్యె నని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని ఖగేంద్రుడు జైమినికి చెప్పెను.

                        జైమిని ముని ఖగేంద్రునితో వరూధినికి   తరువాత ఏమి జరిగింది, ఆ వృత్తాంతము చెప్పుమని అడిగెను.                         

Wednesday 4 October 2017

పుణ్యాహ వాచనం

అథ స్వస్తిపుణ్యాహవాచనమ్
                       సంకల్పంః-శుభాభ్యాం...శుభతిథౌ॥అస్మాకం....నూతన గృహప్రవేశాఖ్య కర్మణి{జాతాశౌచనివారాణార్థం, మృతాశౌచనివారాణార్థం} (పాణిగ్రహణాఖ్య కరమణి)శుధ్యర్థం,వృధ్యర్థం,శాంత్యర్థం అభ్యుదయార్థంచ ఆయుష్కామ్యార్థ ఫల సిధ్యర్థం బ్రాహ్మణైర్మహాజనైస్సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే॥                                                                                        భూమిం పార్హ్య॥ఓం మహీద్యౌఃపృథీవీచన ఇమం యఙ్ఞం మిమిక్షితాం।పిపృతాన్నోభరీమబిః॥ ఇతి దక్షిణోత్తరతో భూమిం స్పృష్ట్వా॥ మం॥ఓమ్ అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనూ స్సుదుఘాఃపూయమానాః।అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ॥ ఇతి వస్త్రమాస్తీర్య॥
       మం॥ఓమ్ ఓషధయస్సంవదంతే సోమేన సహరాజ్ఙా।  యస్మై కరోతి బ్రాహ్మణస్తగ్ం రాజన్ పారయామసి॥ ఇతి తండుల పుంజౌ కృత్వా॥ తండుల పుంజోపరి ద్వాత్రింశత్కోష్టకం పుణ్యాహవాచనస్థండిలం లిఖిత్వా॥
  మం॥ ఓమ్ ఆకలశేషుధావతిపవిత్రే పరిషిచ్యతే।ఉక్త్థైర్యజ్ఙేషు వర్ధతే॥ స్థండిలోపరి త్రికలశాన్ నిక్షిప్య॥
 మం॥ఓం ఇమంమే గంగేయమునే సరస్వతి శుతుద్రిస్తోమగ్‍ం సచతా పరుష్ణియా। అసిక్నియా మరుద్వృధే వితస్తయార్జీకియే।శృణుహ్యాసుషోమయా॥ ఇతి కలశేషు ఉదకమాపూర్య॥
 మం॥ఓమ్ గంధద్వారాం దురాధర్షామ్ నిత్యపుష్టాం కరీశిణీం।ఈశ్వరీగ్ం సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియం॥ఇతి గంధమ్ నిక్షిప్య॥
       మం॥ఓం యాఃఫలినీర్యాఅఫలాఅపుష్పాయాశ్చ పుష్పిణీః।బృహస్పతిప్రసూతాస్తానో ముంచంత్వగ్‍ంహసః॥ఇతి ఫలం నిక్షిప్య॥
     మం॥ఓం హిరణ్య రూపస్సహిరణ్య సందృగపాన్నపాత్సేతు హిరణ్య వర్ణః।హిరణ్యయాత్పరియోనేర్నిషద్య హిరణ్య దాద దద్యన్నమస్మై॥ఇతి హిరణ్యం నిక్షిప్య॥
మం॥ఓమ్ సహిరత్నానిదాశుషే సువాతి సవితాభగః।తంభాగం చిత్రమీమహే॥ఇతి నవ రత్నాని నిక్షిప్య॥
మం॥ ఓం ఇమం మే వరుణశ్రుధీ హవ మద్యా చ మృడయ । త్వా మవస్యు రాచకే। తత్వాయామిబ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానోహవిర్భిః॥అహేడమానో వరుణేహభో ధ్యురుష‍గ్‍ం సమాన ఆయుః ప్రమోషీః॥ఉత్తర కలశే వరుణ మావాహయామి॥
 ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్నాం త్స్వావేశో అనమీవో భవానః।యత్వే మహేప్రతితంన్నోజుషస్వశంన్నఏధి ద్విపదేశం చతుష్పదే॥దక్షిణ కలశే వాస్తుపురుష వావాహయామి॥
మం॥ఓం బ్రహ్మజజ్ణ్గానం ప్రథమం పురస్తా ద్విసీమతస్సురుచోవేన ఆవః।సబుధ్నియా ఉపమాఅస్యవిష్టాస్సతశ్చయోనిమసతశ్చవివః॥మధ్యమ కలశే బ్రహ్మాణ  వాహాహయామి॥

వరుణ వాస్తు బ్రహ్మ కలశ దేవతాభ్యోనమః
గంధ అక్షత ధూప దీప నైవేద్య తాంబూలైరభ్యర్చ్య॥
శ్రీ లక్ష్మీనారాయణాభ్యామ్ నమః॥
 శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః।
శ్రీ వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః।
శ్రీ శచీ పురంధరాభ్యాం నమః।
శ్రీ అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః।
శ్రీ సీతారానమాభ్యాంనమః।
శ్రీ మాతా పితృభ్యోనమః॥
శ్రీ గురుభ్యోనమః॥ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః॥
 మాతృ దేవో భవ।పితృ దేవో భవ।ఆచార్య  దేవో భవ।అతిథి దేవో భవ॥
అవనికృత జాన్మండలఃకమల ముకుళ సదృశమంజలీం శిరస్యాధాయ॥
 దక్షిణేన పాణినా సువర్ణ పూర్ణ కలశమ్ ధారయిత్వా (యజమానః) దీర్ఘా నాగా నద్యో గిరయః।త్రీణివిష్ణు పదానిచ ।తేనాయుప్రమాణెన  పుణ్యమ్ పుణ్యాహమ్ దీర్ఘమాయురస్తు॥ (బ్రాహ్మణః) అస్తు దీర్ఘమాయుః।(శిరసి అభిమంత్ర్య)॥శివాఆపస్సంతు॥(కలశేశ్వభిమంత్ర్య॥
సంతు శివాఆపః॥ సౌమనస్యమస్తు।(హృదయేభిమృశ్య) అస్తు సౌమనస్యం ॥అక్షతారింష్టంచాస్తు(అక్షతాన్‍స్పర్శయిత్వా) అస్త్వక్షతమరిష్టమ్ ఏవమ్ త్రిః॥(మూడు సార్లు)॥      మం॥ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చంతు పుత్రకా ఉతపురన్నధృష్ణ్వర్చత॥అక్షతాఃపాంతు ఆయుష్యమస్తు॥       
    మం॥ ఓం గంధ ద్వారాం దురాధర్షాం నిత్య పుష్టాం కరీషిణీం।ఈశ్వరీగ్‍ం సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియం॥    గంధాఃపాంతు సౌమంగళ్యం చాస్తు।పుష్పాణి పాంతు సౌశ్రేయమస్తు॥ తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు॥ దక్షిణాఃపాంతు బహుదేయంచాస్తు॥స్వశ్రేయసమస్తు॥ శాంతిఃపుష్టిస్తుష్టిశ్చాస్తు॥   
(యజమానః) యంకృత్వాసర్వవేదయజ్ఙ క్రియా కరణకర్మారంభాఃశుభాఃశొభనాఃప్రవర్తంతే తమహమోంకారమాదింకృత్వా॥ భవద్భిరనుజ్ఙాతఃపుణ్యంపుణ్యాహం వాచయిష్యే॥ (విప్రాః) వాచ్యతాం॥ మం॥ఓం భద్రమ్ కర్ణేభిశ్శ్రుణుయామదేవాః।భద్రమ్ పశ్యేమాక్షభిర్యజత్రాః  స్తిరైరంగైస్తుష్టువాగ్‍ం  సస్తనూభిః వ్యశేమ దేవహితం యధాయుః॥   మం॥ఓంద్రవిణొదాద్రవిణసస్తురస్య ద్రవిణోదాస్సనరస్యప్రియంసత్‍॥ద్రవిణొదావీరవతీమిషన్నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః॥ మం॥ఓం సవితాపశ్చాతాత్సవితా పురస్తాత్సవితోత్తరాత్తాత్సవితాధరాత్తాత్‍॥సవితానస్సువతు సర్వతాతింసవితానోరాసతాం దీర్ఘమాయుః॥మం॥ఓం నవో నవో భవతిజాయమానోహ్నంకేతురుషసామేత్యగ్రే।భాగందేవేభ్యోవిదధాత్యాయన్ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః॥
మం॥ఓం సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనంచ॥ ఉత్తర కలశ మాదాయ ప్రాక్కలశే కించిత్కించిదుదకం నినీయ ధీర్ఘమాయురస్తు॥        (యజమానః)-బ్రాహ్మణానాం మనస్సమాధీయతాం॥       (విప్రాః)ః- సమాహిత మనస్మః॥           యజమానఃః-ప్రసీదంతు భవంతః॥                ( విప్రాః) ప్రసన్నాస్మః॥
యజమానఃః- శాంతిరస్తు।పుష్టి రస్తు। తుష్టిరసు।వృధ్ధిరస్తు।అవిఘ్నమస్తు।ఆయుష్యమస్తు।ఆరోగ్యమస్తు।స్వస్తి శుభమ్ కర్మాస్తు॥కర్మ సమృధ్ధిరస్తు॥పుత్ర సమృధ్ధిరస్తు॥వేద సమృధ్ధిరస్తు॥శాస్త్ర సమృధ్ధిరస్తు॥గృహే ధన ధాన్య సమృధ్ధిరస్తు॥ఇష్ట సంపదస్తు॥ సర్వ సంపదస్తు॥ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసన మస్తూ॥యత్పాపం తత్ప్రతిహతమస్తు॥యచ్చ్రేయస్తదస్తు॥
   శుక్రాంగారకబుధ బృహస్పతిశనైశ్చర రాహుకేతవ సోమసహితాదిత్యాది పురోగా సర్వేగ్రహాః ప్రీయంతాం॥ తిథికరణముహూర్తజన్మ నక్షత్ర దిగ్దేవతాః ప్రీయంతాం॥ నైరృత్యాం దిశి।శామ్యంతు ఘోరాణి।శామ్యంతు పాపాని।శామ్యంతు ఈతయః।శామ్యంతు మధ్యమ కలశే॥ శుభాని వర్ధంతాం।శివా ఋతవస్సంతు।శివా ఓషధయస్సంతు।శివా వనస్పతయస్సంతు। అహోరాత్రే శివేస్యాతాం।       ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు॥ ఉత్తరోత్తరమహరహరభివృధ్ధిరస్తు।ఉత్తరోత్తరాః శుబాఃక్రియాఃసంపద్యంతాం॥అగ్ని పురోగా విశ్వే దెవా ప్రీయంతాం॥మహేశ్వరీ పురోగా మాతరః ప్రీయంతాం॥ఇంద్ర పురోగా మరుద్గణాః ప్రీయంతాం॥వశిష్టపురోగా ఋషిగణాః ప్రీయంతాం॥ శ్రీ విష్ణుపురోగాస్సర్వేదేవాఃప్రీయంతాం॥ఆదిత్యపురోగాస్సర్వేగ్రహాఃప్రీయంతాం॥ ఋషయశ్చందాగ్‍స్యాచార్యా వేదాయజ్ణ్గా దక్షిణాశ్చప్రీయంతాం॥ బ్రహ్మచబ్రాహ్మణాశ్చ ప్రీయంతాం॥ బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రీయంతాం॥ శ్రధ్ధా మేధా ప్రీయంతాం॥ ప్రీయతాం భగవాన్ నారాయణః। ప్రీయతాం భగవాన్ ప్రపితామహః॥ ప్రీయతాం భగవాన్ పితామహః॥ప్రీయతాం భగవాన్ పర్జన్యః॥ ప్రీయతాం భగవాన్ స్వామీ మహాసేనః॥                                                                                               సత్యాఏతా అశిషస్సంతు పుణ్యాహ కాలాన్వాచయిష్యే॥  (విప్రాః-)వాచ్యతాం॥ఓం యత్పుణ్యం నక్షత్రం తద్బట్కుర్వీతోపవ్యుషం। యదావైసూర్య ఉదేతి అథ నక్షత్రంనైతి।యావతితత్ర సూర్యో గచ్చేత్।యత్ర జఘన్యం పశ్యేత్।తావతి కుర్వీతయత్కారీస్యాత్।పుణ్యాహ ఏవకురుతే॥ఓం తానివాఏతాని యమనకక్షత్రాణి।యాన్యేవదేవ నక్షత్రాణి।తేషుకుర్వీతయత్కారీస్యాత్।పుణ్యాహ ఏవ కురుతే॥                                                  యజమానః॥..........కర్మణఃపుణ్యాహం భవంతో భృబవంతు॥       
  విప్రాః॥పుణ్యాహంకర్మణోస్తు॥ఓంపుణ్యాహం॥ (ఏవం త్రిః) ౩ సార్లు..
మం॥ఓమ్ స్వస్తిన ఇంద్రో వృధ్ధశ్రవాః స్వస్తినఃపూషా విశ్వవేదాః స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమిః స్వస్తినోబృహస్పతిర్దధాతు॥  యజమానః॥మహ్యం సకుటుంబాయ అస్మిన్...................... ఉత్సవాఖ్యస్య శుధ్ధికర్మణి వృధ్ధి కర్మణి అభ్యుదయ కర్మణి      శుధ్ధి వృధ్ధిఅభ్యుదయకర్మణి మహాజనాన్‍ నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బృవంతు॥ విప్రాః॥ఆయుష్మతే స్వస్తీ॥(ఏవం త్రిః...3 సార్లు)                                                                                        యజమానః॥ఓగ్‍స్వస్తి భవంతో బృవంతు॥   విప్రాః॥ఓగ్‍స్వస్తి॥                                            మం॥ఒమ్ భద్రం కర్ణే భిశృణుయామదేవా।భద్రమ్ పశ్యే మాక్ష బిర్యజత్రా॥స్థిరైరంగై స్తుష్టువాగ్‍ం సస్తనూభిః॥ 
                          యజమానహః-వామ దక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తర కలశౌ యుగపత్ గృహీత్వా॥ఋధ్ధిం భవంతో బృవంతు॥ ఋధ్ధిం భవంతో బృవంత॥ఋధ్ధిం భవంతో బృవంతు॥                 విప్రాఃః-ఋద్యతామృద్ధిసమ్రిద్ధిః॥    వర్షశతసంపూర్ణమస్తు॥...........గోత్రాభివృద్ధిరస్తు॥......వంశాబివృద్దిరస్తు॥ శాంతిఃపుష్టిస్తుష్టిశ్చాస్తు॥ పునరపిగోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు॥ఇష్టసంపదస్తు।సర్వ సంపదస్తు॥ ఇతి ఉదకం నిక్షిప్య॥
బ్రాహ్మణేష్వమృతగ్‍ం హితమ్।యేన దేవాః పవిత్రేణ।ఆత్మానమ్ పునతేసదా॥తేన సహస్రధారేణ పావమాన్యః పునంతుమా।ప్రాజాపత్యం పవిత్రం।శతోధ్యామగ్‍ం హిరణ్మయం।తేన బ్రహ్మ విదోవయం।పూతం బ్రహ్మ పునీమహే।ఇంద్రస్సునీతీ సహమాపునాతు।సోమ స్స్వస్త్వా వరుణ స్సమీచ్యా।యమోరాజా పమృణాభిఃపునాతుమా।జాతవేదా మోర్జయం త్యా పునాతు॥ప్రాచ్యాం దిశిదేవా ఋత్విజో మార్జయంతాం।దక్షిణాయాం దిశిమాసాః పితరో మార్జయంతాం॥అపఉపస్పృశ్య॥ప్రతీచ్యాం దిశిగృహాః పశవోమార్జయంతాం॥ఉదీచ్యాందిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం॥ఉర్ధ్వాయాందిశి యజ్ఙస్సంవత్సరో యజ్ఙపతిర్మార్జయంతాం॥ ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగొత్రేభ్యో నానానామభ్యః శ్రీలకక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహస్వరూపేభ్యః శ్రీలకక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహస్వ ప్రీత్యర్థం   స్వస్తిపుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం యజమాన మానసోత్సాహ పరిమితహిరణ్యం తుభ్యమహంసంప్రదదేనమమ॥ మం॥॥ ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్నాం త్స్వావేశో అనమీవో భవానః।యత్వే మహేప్రతితంన్నోజుషస్వశంన్నఏధి ద్విపదేశం చతుష్పద॥శుభగ్‍ం శుభం।శుభగ్‍ం శుభం।। ఇతి పుణ్యాహవాచనం॥


Friday 13 January 2017

మకర సంక్రాంతి తిల తర్పణం


మకర సంక్రమణ తిల తర్పణం
ఆచమ్యా॥ పవిత్రం ధృత్వా॥
శుభాభ్యాం శుభే శోభనే …….ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ పుణ్య తిథౌ॥
(ప్రాచీనావీతి)
అస్మత్ ప్రమీత పితౄన్ ముద్దిశ్య అక్షయ తృప్తి ద్వారా శాశ్వత పుణ్యలోక ఫలావాప్యర్థం
సంక్రమణ శ్రాద్ధ ప్రతినిధి తిల తర్పణం కరిష్యే॥
1అస్మత్ పితరం………గోత్రం…….శర్మాణాం వసురూపం స్వధానాం తర్పయామి,స్వధానాం తర్పయామి, స్వధానాం తర్పయామి॥
2. అస్మత పితామహం……గోత్రం……శర్మాణాం రుద్ర రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
3. అస్మత ప్రపితామహం……గోత్రం…శర్మాణాం ఆదిత్య రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
4. అస్మత మాతరం……గోత్రం…దాయీం వసు రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
5.అస్మత పితా మహీం……గోత్రం…దాయీం రుద్ర రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
6. అస్మత ప్రపితామహీం……గోత్రం…దాయీం ఆదిత్య రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
7.అస్మత్ మాతా మహం...గోత్రం……శర్మాణాం వసు రూపం స్వధానాం తర్పయామి ॥3॥
8.అస్మత్ మాతః పితామహం... గోత్రం……శర్మాణాం రుద్ర రూపం స్వధానాం తర్పయామి॥3॥
9.అస్మత్ మాతః ప్రపితా మహం.. గోత్రం……శర్మాణాం ఆదిత్య రూపం స్వధానాం తర్పయామి॥3॥
10.అస్మత్ మాతామహీం ....గోత్రం……దాయీ రుద్ర రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
11అస్మత్ మాతుఃప్రపితామహీం.. గోత్రం……దాయీ ఆదిత.. రూపం స్వధానాం తర్పయామి॥3॥
మిగతా వారికి
(భ్రాతరం,జ్యేష్ట పిత్రవ్యం,కనిష్ట పిత్రవ్యం,మాతులం,జామాతరం,స్యాలకం,పిత్రు భగినీం,మాతృ భగినీం)
13..అస్మత్ (భ్రాతరం)……… గోత్రం….శర్మాణాం….(సపత్నీకం) వసురూపం స్వధానాం తర్పయామి॥3॥
.
శ్లో॥యేకేచాస్మత్ కులేజాతా అపుత్రాగోత్రిణోమృతాః।తే గృహ్ణాంతు మయా(త్వయా) దత్తం సూత్ర నిష్పీడనోదకం॥
శ్రీరామరామ రామ
॥సవ్యం॥ పవిత్రం విసృజ్య॥
పాదౌ ప్రాక్షాళ్య। ఆచమ్యా॥
పితృ పితామహ ప్రపితామహ అనుగ్రహ ప్రాప్తిరస్తు॥మాతృ పితామహీ ప్రపితామహీ అనుగ్రహ ప్రాప్తిరస్తు॥

మకర సంక్రాంతి ఆచారాలు- పరమార్ధం

మకర సంక్రాంతి ఆచారాలు- పరమార్ధం
ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ప్రారంభం అవుతుంది. రవి మకర రాశి ప్రవేశం తో మకర సంక్రాంతి వస్తుంది. ఈ రోజుననే దేవ మార్గం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే వ్రతాలు అనేక శుభఫలాలను అందిస్తాయి. అదే విధంగా ఉత్తరాయణం లో మానవుడు చేసే శుభకార్యాలు ఎక్కువ ఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యుడు మకరరాశి లో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నాన, జప, దాన, వ్రతాదులు విశేషాఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే పితృ తర్పణాలు, దానాలు మానవులను పితృ రుణం నుండి తప్పించగలవు. ప్రజలు అమ్మవారిని పౌష్యలక్ష్మిగా పూజిస్తారు. సంక్రాంతి రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేయకపోతే అనేక రోగాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
రవి సంక్రమణేప్రాప్తే నస్నాయా ద్యస్తు మానవ:
సప్త జన్మ సు రోగీస్యాత్ నిర్ధన చైవ జాయతే.
మానవులకు పంచవిధమైన రుణాలు ఉంటాయి. దేవరుణం, పితృ రుణం, భూత రుణం, మానవ రుణం మరియు ఋషి రుణం. భూమిపై జీవించే ప్రతి మానవునికి ఈ రుణాలు ఉంటాయి. ఈ రుణాల నుండి విముక్తిని ప్రతి మానవుడు పొందాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ తత్వం అవగతం ఆవుతుంది. ఈ రుణాల నుండి మనుష్యలకు విముక్తి ని కలిగించడానికి పరిహారాలను ఆచారాల రూపంలో మన పెద్దలు తెలియచేసారు. పెద్దలు చెప్పిన ఈ ఆచారాలను పాటించినట్లైతే ప్రతి మనిషి తన పంచ విధమైన రుణాలనుండి విముక్తిని పొంది పరమాత్మకు దగ్గర అవుతాడు. పంచ రుణాలనుండి గృహస్తు విముక్తి పొందే మార్గాలను మకర సంక్రాంతి ఆచారాల రూపంలో మన ఋషులు తెలియచేసారు. ఈ విముక్తి తరుణోపాయాలు సంక్రాంతి ఆచారాల రూపంలో నిర్దేశింపబడినవి. కనుక మకర సంక్రాంతి రోజున మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటిస్తే అన్నీ రుణాలనుండి విముక్తిని పొందవచ్చు.

మకర సంక్రాంతి రోజున కొత్తబియ్యం తో పాలు పొంగించి సూర్యాది దేవతలకు మనం నివేదిస్తాం. పులగం, పాయసం చేసి సూర్యాది దేవతలను మకర సంక్రాంతి రోజున పూజించడం చేత ఈ దేవతల కృపవలన దేవ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందగలం. మకర సంక్రాంతికి పండిన పంట ఇంటికి వస్తుంది. పాడిపంటలకు, వ్యవసాయానికి ఆధారమైన సూర్యభగవానుని తప్పనిసరిగా ఆరాధించాలి. ఆయన ద్వారా వచ్చిన పంటను సూర్యునికే పాలు పొంగళ్ళ రూపంలో నివేదించుట వలన దేవరుణం కొంత మేరకు తొలుగుతుంది.

పితృ తర్పణాలు, పిండోదక దానాల వలన పితృ రుణం తీరుతుంది. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు, దానాలు చేయాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ రోజున పితృ పూజను చేసి తర్పణాలు వదలి దానాలు బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా పితృ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందవచ్చు.

గాలి, నీరు, ఆకాశం ,భూమి మొ|లైన పంచభూతాల కృప వలన సమస్త జీవరాశికి వ్యవసాయం ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఈ పంచభూతాలు మానవులకు పూజనీయాలు. సంక్రాంతి రోజున పొలాలలో పొంగలి మెతుకులు చల్లడం, పసుపు కుంకాలు చల్లి గుమ్మడికాయ పగులగొట్టి దిష్టి తీయడం ఆచారంగా మారింది. పశువులు మానవులకు చేసే మేలుకు గుర్తుగా కనుమ రోజున వీటిని పూజించి కొష్టాలను అలంకరిస్తాము. ఇంకా ముగ్గు లో బియ్యపు పిండిని కలిపి ముగ్గులు వేసి వీటి ద్వారా చీమలు వంటి అల్ప ప్రాణులకు ఆహారం అందిస్తాము. ఇటువంటి ఆచారం పాటిస్తే భూత రుణం నుండి మానవులు కొంతమేరకు విముక్తిని పొందుతారు.

సంక్రాంతి రోజున దానధర్మాలు చేయమమని మన ధర్మం చెపుతుంది. పండుగ రోజున తిలలు, వస్త్రాలు, ధాన్యం, చెరకు, గోవులు ఫలాలు మొ|లైనవి దానం చేస్తారు. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ధాన్యం దానం చేస్తారు. ఇటువంటి దానాల వలన మనుష్య రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. పురాణ పటనం, జపాతపాలు, బ్రాహ్మణులకు దానాలు వంటివి ఆచరించుట ద్వారా ఋషి రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మానవులకు ఏర్పడే పంచరుణాలను తొలగించడానికి మన పెద్దలు ఆచారాల రూపంలో తరుణోపాయాలను చూపించారు. వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా పండగ ఆచారాలను పాటిస్తే మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది.

మకర సంక్రాంతి తో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే ఎటు వంటి పుణ్యకార్యమైన, శుభకార్యమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణం గృహారంభాలకు, గృహప్రవేశాలకు చాలమంచి కాలం.దేవతా ప్రతిష్టాలకు ఉత్తరాయణం మంచిది. సౌమ్య దేవత ప్రతిష్టలు తప్పనిసరిగా ఉత్తరాయణం లోనే చేయాలి. నూతన ఆలయాల ప్రారంభం ఉత్తరాయణం లోనే చేయాలి. వివాహాలకు అన్ని శుభకార్యాలకు ఉత్తరాయణం మంచిది.

మకర సంక్రాంతి రోజున ప్రతివారు తప్పనిసరిగా తెలకపిండి ఒంటికి రాసుకొని స్నానం ఆచరించాలి. తెలక పిండికి వాతాన్ని హరించే గుణం ఉంది. శని మకర రాశికి అధిపతి. శని గ్రహం వాతాన్ని పెంచుతుంది. కనుక వాతాన్ని హరించే తెలకపిండి స్నానం ఈ రోజు చాలా మంచిది. ఈ కాలం లో పెరిగే వాతాన్ని అరిసెలు కూడా బాగా తగ్గిస్తాయి. అందుకనే బెల్లం, నువ్వులు, బియ్యపు పిండి తో తప్పనిసరిగా అరిసెలు వండుకు తినాలని మన పెద్దలు చెపుతారు. మన ప్రాంతం లో అందుకనే ప్రతి గృహం లో అరిసలు వండుతారు. సంక్రాంతి రోజు నువ్వులు గుమ్మడికాయ, బెల్లం వంటి వస్తువులు మంచి ఆరోగ్యం కోసం దానం చేయాలి. మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి.

సంక్రాంతి రోజు ధాన్యం, ఫలాలు, బంగారం,కంచు వంటి లోహాలు దానం ఇవ్వడం మంచిది. ఘృత కంబళి దానం శ్రేష్టం. సంక్రాంతి రోజు ఏది దాన చేస్తామో అవి అధికంగా జన్మ జన్మలకు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజులో నువ్వులు, బియ్యం కలిపి శివ భగవానుని పూజించాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. ఆవు నేతితో శివునకి అభిషేకం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. సంక్రాంతి రోజు ఒక్కపూట భోజనం చేయాలి. రాత్రి కాలంలో భుజించరాదు.

సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది అధిక పుణ్య కాలం కాబట్టి ఈ రోజులో చేసే మంత్ర ధ్యానాలు,జపాలు తపాలు. దానాలు తర్పణాలు శ్రేష్ట మైన ఫలితాలు ఇస్తాయి. చలికాలంలో రాత్రికాలం దీర్ఘంగా ఉంటుంది. పగటికాలం తక్కువుగా ఉంటుంది. కనుక నిద్ర లేచే సమయానికి బాగా ఆకలిగా ఉంటుంది. దీనికి విరుగుడుగా పులగం తినాలని వాగ్భటుడు మొ|లైన వైద్యులు చెప్పడం జరిగింది. రోజు పులగం తినడం ఖర్చుతో కూడిన పని. అందరికీ సాధ్యం కాదు. కనుక ఈ పండుగనాడు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆలయ ప్రసాదంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి రోజున శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదవితే మంచి లాభం కలుగుతుంది.మకర సంక్రాంతి ఆచారాల వెనుక అనేక పారమార్ధిక విషయాలు దాగున్నాయి. వీటిని భక్తితో ఆచరిస్తే పరమాత్మ కృప లభించి జీవితం ధన్యం అవుతుంది.