Monday, 8 October 2012

భాగ్యనగరం లో జీవ వైవిధ్య సదస్సు

మన భాగ్య నగరం లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సు (Conference on Bio diversity) సందర్భం గా కొన్ని వేద మంత్రాలు
మం॥ సముద్ర  వసనే దేవి పర్వత  స్థన   మండితే।విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే।
       ప్రతి రోజు పడక నుండి లేస్తూనే కాళ్ళు నేలపై పెట్టె ముందు భూమిని ప్రార్థించడము మన పెద్దల నుండి వస్తున్న సంప్రదాయం.
 మం॥ ఓం  మధువాతా  ఋతాయతే మధుక్షరంతి సింధవః। మాధ్వీర్నస్సంత్వోషధీః । మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః\ మధుద్యౌరస్తు నః పితా । మధుమాన్నో వన్స్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః॥
   ఋతాయతే= మంచి కార్యం చేయాలని కోరే న్ః= మనకు  మధువాతా=మాధుర్యమైన గాలి వీచుగాక,
సింధవః=నదులు ,మధుక్షరంతి=తియ్యని నీటితో ప్రవహించు గాక, ఓషధీః = చెట్లు, మాధ్వీః సంతు=పుష్టిగా ఉండుగాక, నక్తం ఉత ఉషసి= రాత్రింబవళ్ళు  మధు=మాధుర్యాన్ని అందించు గాక,పార్థివగ్ం రజః= భూమి;
మధుమత్=తియ్యదనాన్ని ఇచ్చుగాక,న్ః=మన, పితా=తండ్రియైన ద్యౌః =ఆకాశం,మధు=మాధుర్యాన్ని 
వర్షించు గాక. వనస్పతిః =చెట్టు,చేమలకు అధిపతి యైన్ చంద్రుడు మధుమాన్= తియ్యగా(చల్లగా)
 ఉండుగాక,గావః=పశువులు,నః=మనకు, మాధ్వీః భవంతు=తియ్యదనాన్ని (తియ్యటి పాలను) 
ఇచ్చుగాక.తియ్యగా(పరిశుభ్రమైన గాలి) వీచు గాక్, నదులు తియ్యని నీటితో(స్వచ్చమైన) ప్రవహించు గాక,ఆకాశం 
  మన పూర్వీకుల పర్యావరణ చింతనా ధృక్పధం ను సూచించే మంత్రాలలో యీ మంత్రం ఒకటి. గాలి మాధుర్యాన్ని వర్షించు గాక,చెట్టూ ,చేమలు పరిపుష్టిగా పెరుగు గాక, పశువులు    పాలను అధికంగా
ఇచ్చుగాక,  ప్రకృతిని  మనం పరిశుధ్ధం గా ఉంచుకొన్నప్పుడే అది మాధుర్యాన్ని వర్షింస్తుంది,
మం॥ శంన్నో దేవీరభీష్టయ ఆపో  భవంతు పీతయే। శం యోరభి  స్రవంతు నః।
     దివ్యులైన ఓ జలదేవతలారా !మా పూజలలో మీరు ప్రసన్నులవుతారు గాక! మేము త్రాగడానికి నీరు అనువైనదిగా ఉండు గాక,మాకు మంగళకరాన్ని ప్రసాదించుదురు గాక!Saturday, 29 September 2012

శాంతి మన్త్రం

                             #  ఓం ।గం గణపతయే నమః॥ #        

     మంత్రం॥పర్యాప్తా అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమహర్భవతి ।      సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వంజయతి।। 

              ఓం శాంతిః శాంతిః శాంతిః॥


                  అన్ని పూజాదికాలలో చివరిగా చెప్పబడు ఈ మంత్రము లో అతిరాత్రం అనబడే యాగమ్ గురించి  చెప్పబడింది.

       పర్యాప్త్యా=అపారమైన్ ,అనంత అయాయ=తరగని సంపద పొందడానికి, సర్వస్తోయః =తరగని కీర్తి పొందడానికి అతిరాత్రమ్=అతిరాత్రం అనబడే అనే యాగం ఉత్తమ=ఉత్తమమైనది, తేన=ఈ యాగమ్ వలన సర్వస్వజిత్యై=అన్ని విజయాలు, సర్వమేవ=సమస్తమూ   ఆప్నొతి=పొందబడుతుంది, సర్వం జయతి=సర్వము   పోషింప బడుతుంది.
     భావముః- తరిగిపోని అపార  సంపద పొందడానికి, తరగని కీర్తి పొందడానికి, అతిరాత్రమని పేర్కొనబడే యాగము,   అతిశ్రేష్టమైన  యాగం. ఈ యాగం ద్వారా  సమస్తమూ సిద్దిస్తుంది. సకల విజయాలు కలుగుతాయి.సర్వమూ పొందబడుతుంది.సర్వమూ పోషింపబడుతుంది.

Sunday, 16 September 2012

అఘమర్షణ సూక్త్ం(ప్రాయశ్చిత్త మంత్రం).

వేద కాలంలో సచ్చీలమూ,నిజాయితీ ఎంతో ప్రాధాన్యం వహించాయి.పాపం క్షోభ వంటివి సహించబడలేదు.దుష్టుల నుండి కానుకలను, దానాలను  ఏవైనా పుచ్చుకోవడమ్  జరిగితే ఎంతో పాపం గా పరిగణించే వారు.దానికొరకై ప్రాయశ్చితమ్ అన్వేషించేవారు.
శ్లో॥  ఓం॥హిరణ్యశృఙ్గం వరుణమ్ ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః ।  యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః ।
       బంగారు కిరీటం ధరించిన వరుణ దేవుణ్ణి శరణు పొందుతాను.ప్రార్థిస్తూన్న నాకు తీర్థఫలాన్ని
 అనుగ్రహించు.దుష్టుల వస్తువును అనుభవించడం జరిగింది,వారి నుండి కానుకలను సైతం పుచ్చుకొని
  ఉన్నాను కనుక.
 శ్లో॥యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం । తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సవితా చ పునన్తు పునః పునః॥
       మనస్సుతోను, మాటలతోను చేతలతోను నా వలననో నావారి వలననో చేయబడిన పాప     కృత్యాలను ఇంద్రుడు,వరుణుడు,బృహస్పతి ,సూర్యుడు  పూర్తిగా పునీతం చెయుదురు గాక!
శ్లో॥అత్యాశనా-దతీపానా-ద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహత్। తన్నో వరుణో రాజా పాణినాహ్యవమర్శతు.॥
    మితిమీరి తినడం ,మితిమీరి త్రాగడం దుష్టుల నుండి కానుకలను పుచ్చుకోవడం లాంటి పాపాలను
     రాజైన వరుణుడు తన స్వహస్తాలతో తుడిచి వేయు గాక.
 
 
 

Thursday, 28 June 2012


౧. అన్నం న నింద్యాత్। అన్నము ను నిందించ కూడదు.
౨.అన్నం న పరిచక్షీత। అన్నమును నిరసించకూడదు.
౩. అన్నం బహు కుర్వీత।అన్నం ను ఎక్కువగా సంపాదించ వలయును.
౪.న కంచన వసతౌ ప్రత్యాచక్షీత। అన్నమును యాచించి వచ్చిన వరికి లేదనకూడదు..
ఈ రీతిగ అన్నము యొక్క గొప్పదనాన్ని వేద వా ఙ్మయం లో చాలా చోట్ల పేర్కొన బడిబది.
... ఆన్నం అంటే కేవలం అన్నమే కాదు. తినే పదార్ఠాలు, త్రాగే నీరు , పీల్చే గాలి అన్నీ కూడా
అన్నం గా భావించ బడినది.  ప్రకృతి ప్రసాదించిన వేటినీ కూడా వ్యర్టం చేయ రాదని భావం.
ఇవి నిత్య  సత్యాలు.

Friday, 22 June 2012

శుచి-శుభ్రత


శుచి--శుభ్రత గురించి
శ్రీ సూక్తమ్ లో 16 వ మంత్రం ….
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహం।
శ్రియః పంచదశర్చం చ శ్రీకామ సతతం జపేత్ ।
యః = ఎవరైతె లక్ష్మీ దేవి కటాక్షం కొరకు ప్రార్థిస్తున్నారో వారు శుచిః =శుచి గా ఉంటూ
ప్రయతో భూత్వా= ఇంద్రియాలను నిగ్రహించిన వారుగా ఉంటూ  మన్వహం = అను నిత్యం
జుహుయాదాజ్య=నేతితో హోమం గావించాలి.
శ్రియః పంచదశర్చం చ= లక్ష్మీ దేవి 15 మంత్రాలను [౧నుండి ౧౫ ] సతతం =సదా
జపేత్= జపిస్తుండాలి.
శుచి అంటే కేవలం మడి కట్టుకొని కూర్చుంటే చాలదు. బాహ్యాభ్యంతర శుచిః
మన ఇల్లు మన పరిసరాలు ఇంటా బయటా  మన దేహం మన మనస్సు ఇవన్నీ శుభ్రం గా ఉండాలి.
పూజ గదిని శుభ్ర పరచ కుండా ఇంట్లో బూజులు దులుప కుండా మాసి పోయిన మడి పంచె కట్టుకొని దీపమ్ వెలిగించ కుండా మనస్సును కేంద్రీకరించ కుండా  ఎన్ని సార్లు శ్రీ సూక్తమ్ చదివినా పలితం దక్కదు. లక్ష్మీ దేవి కృపకు పాత్రులం కాలేము. మన పూర్వీకులు దీనిని బట్ట్ శుచి శుభ్రత కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో  విశదమవుతుంది.

Monday, 18 June 2012

importance of fire god అగ్ని దేవా=జాత వేదా.

1. .హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీమ్ లక్ష్మీం  జాతవేదో[అగ్ని దేవా] మమావహ(నా కొరకు ఆహ్వానించు)।
తాం   మ అవహ జాతవేదో లక్ష్మీ మనప గామినీం యస్యాం హిరణ్యమ్ విందేయం గామశ్వం పురుషానహం
శ్రీ సూక్తమ్ మొదటి పనస.

2. జాత వేదసే[అగ్ని దేవా] సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా త్యగ్నిః ॥
దుర్గా సూక్తం మొదటి పనస


మొదటి సూక్తంలో లక్ష్మీ దేవిని  దేవిని రెండవ సూక్తం లో దుర్గా దేవిని స్తుతించటానికి  ముందు  అగ్ని దేవుని [జాత వేద] ప్రార్థిస్థున్నాము.మన కొరకు ఆయా దేవతలను ఆహ్వానించమని  పనసలో  అగ్ని దేవుని కోరుతున్నాము.ఈ విధం గా ఋగ్వేదం లో కాన వచ్ఛే అనేక  స్తుతులలో   అగ్ని దేవుని కీర్తిస్తూ   ప్రార్థించేవిగా ఉన్నాయి.          
Sunday, 17 June 2012

హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీమ్ లక్ష్మీం  జాతవేదో మమావహ।
తామ అవహ జాతవేదో లక్ష్మీ మనప గామినీం యస్యాం హిరణ్యమ్ విందేయం గామశ్వం పురుషానహం ।